అఖండ 2 బుకింగ్స్.. 22 రోజుల ముందే ఇలా..
సినిమా రిలీజ్‌కు ఇంకా 22 రోజులు టైమ్ ఉన్నా, యూఎస్ఏలో అడ్వాన్స్ బుకింగ్స్ అఫీషియల్‌గా ఓపెన్ చేసేశారు. ఇది సాధారణంగా రిలీజ్‌కు వారం, పది రోజుల ముందు స్టార్ట్ అయ్యే ప్రాసెస్.;
నటసింహం బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న 'అఖండ 2' కోసం ఫ్యాన్స్ ఏ రేంజ్‌లో వెయిట్ చేస్తున్నారో తెలిసిందే. ఇక డిసెంబర్ 5న ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ కానుండగా, మేకర్స్ ఇండస్ట్రీ రూల్స్‌కు భిన్నంగా, చాలా ముందుగానే ప్రమోషన్స్, బిజినెస్ డీల్స్ క్లోజ్ చేస్తున్నారు. దానికి తగ్గట్టే, ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా 'అఖండ 2' హడావిడి అప్పుడే మొదలైంది.
సినిమా రిలీజ్‌కు ఇంకా 22 రోజులు టైమ్ ఉన్నా, యూఎస్ఏలో అడ్వాన్స్ బుకింగ్స్ అఫీషియల్‌గా ఓపెన్ చేసేశారు. ఇది సాధారణంగా రిలీజ్‌కు వారం, పది రోజుల ముందు స్టార్ట్ అయ్యే ప్రాసెస్. కానీ, 'అఖండ' బ్రాండ్‌పై ఉన్న నమ్మకంతో డిస్ట్రిబ్యూటర్లు చాలా ముందుగానే షోలను లిస్ట్ చేశారు.
లేటెస్ట్ ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ 22 రోజుల ముందు ఓపెన్ చేసిన బుకింగ్స్‌తోనే 'అఖండ 2' 41,839 డాలర్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. ఇప్పటికే 132 లొకేషన్లలో, 394 షోలకు గాను 1442 టికెట్లు అమ్ముడయ్యాయి. ఇది ఫైనల్ నంబర్ కాదు, కానీ రిలీజ్‌కు మూడు వారాలకు పైగా సమయం ఉండగా ఈ నంబర్ రిజిస్టర్ అవ్వడం చూస్తుంటే ఫ్యాన్స్‌లో క్రేజ్ ఏ స్థాయిలో ఉందో చెప్పవచ్చు.
ఈ రేంజ్ ఎర్లీ బుకింగ్స్‌కు కారణం.. 'అఖండ' మొదటి భాగం క్రియేట్ చేసిన ఇంపాక్టే. అప్పట్లో 'అఘోరా' క్యారెక్టర్, థమన్ బీజీఎం యూఎస్ ఆడియన్స్‌కు కూడా ఒక కొత్త 'పూనకం' లాంటి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చాయి. ఇప్పుడు ఆ మ్యాజిక్‌ను మళ్లీ చూడాలని వాళ్లు వెయిట్ చేస్తున్నారు. దానికి తోడు, రీసెంట్‌గా రిలీజైన "అఖండ తాండవం" సాంగ్ ప్రోమో కూడా ఈ హైప్‌ను మరింత పెంచింది.
అయితే, ట్రేడ్ అనలిస్టుల ప్రకారం ఇది కేవలం శాంపిల్ మాత్రమే. అసలు సిసలు మాస్ బుకింగ్స్ జాతర ఇంకా మొదలవలేదు. సాధారణంగా ట్రైలర్ రిలీజ్ అయ్యాక, సినిమాకు వారం రోజులు ఉందనగా అసలు ట్రెండ్ స్టార్ట్ అవుతుంది. కానీ, అంతకంటే ముందే 40K డాలర్స్ మార్క్‌ను టచ్ చేయడం అనేది బాలయ్య స్టామినాకు, 'అఖండ' బ్రాండ్‌కు ఓవర్సీస్‌లో ఉన్న క్రేజ్‌కు ఒక పాజిటివ్ సిగ్నల్. బాలకృష్ణకు మెయిన్ మార్కెట్ ఎప్పుడూ తెలుగు రాష్ట్రాల్లోని మాస్ సెంటర్లే. కానీ, 'అఖండ'తో ఆ లెక్కలు మారిపోయాయి. ఇప్పుడు 'అఖండ 2'.. ఓవర్సీస్‌లో కూడా బాలయ్య కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చేలా కనిపిస్తోంది.