భార‌తదేశ‌ చ‌రిత్ర, దేవుళ్ల గొప్ప‌త‌నాన్ని ప్రపంచానికి చూపించాలి: బోయ‌పాటి

న‌ట‌సింహా నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేష‌న్ లో వ‌స్తున్న పాన్ ఇండియన్ మూవీ అఖండ 2.;

Update: 2025-11-29 03:45 GMT

న‌ట‌సింహా నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేష‌న్ లో వ‌స్తున్న పాన్ ఇండియన్ మూవీ అఖండ 2. ఇటీవ‌ల విడుద‌లైన‌ టీజర్లు, ట్రైలర్ ట్రెండింగ్ లో ఉన్నాయి. అభిమానులు స‌హా ప్ర‌జ‌ల్లో భారీ హైప్ ఉన్న చిత్ర‌మిది. శుక్ర‌వారం సాయంత్రం మేకర్స్ గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. భారీ అభిమానుల స‌మ‌క్షంలో ఎన్బీకే ఎమోష‌న‌ల్ స్పీచ్ ఆద్యంతం ర‌క్తి క‌ట్టించింది. శివుని ఆశీస్సుల‌తోనే అఖండ తాండ‌వం సాధ్య‌మైంద‌ని బాల‌య్య బాబు అన్నారు.

ఈ వేడుక‌లో ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను మాట్లాడుతూ-``భారతీయ సంస్కృతి , సంప్రదాయం గొప్పతనం గురించి ప్రపంచం మ‌రింత‌గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంద``ని అన్నారు. భారతీయ చరిత్ర వారసత్వం, భారతీయ దేవుళ్ల గొప్పతనాన్ని, సనాతన ధర్మాన్ని చూపించాల్సిన అవసరం ఉందని ఆయ‌న పేర్కొన్నారు. తన దర్శకులను నమ్మి కథ, పాత్రకు తనను తాను అప్పగించుకునే ఉత్తమ నటుడిగా NBK ని ఆయన ప్రశంసించారు.

నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ, తాను పాదరసం లాంటివాడని, ఏ పాత్రనైనా సులభంగా చేయ‌గ‌ల‌న‌ని అన్నారు. తన తల్లిదండ్రుల నుండి వచ్చిన గొప్ప జన్యువులు తనకు ఆశీర్వాదం అని వ్యాఖ్యానించారు. అఖండ 2 చిత్రాన్ని శివుడు పూర్తిగా ఆశీర్వదించాడని, ఇది తన కెరీర్‌లో అత్యుత్తమ చిత్రాలలో ఒకటి అని ఆయన వ్యాఖ్యానించారు. సనాతన ధర్మం ముప్పు ఎదుర్కొంటున్నప్పుడల్లా, ఒక మానవుడు దేవుడిగా ఎదుగుతాడని, అదే అఖండ 2 అని ఎన్‌బికె పేర్కొన్నారు. ఈ చిత్రం భారీ బాక్సాఫీస్ విజయాన్ని నమోదు చేస్తుందని, సనాతన ధర్మ శక్తిని ప్రపంచానికి ప్రదర్శిస్తుందని న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేశారు. 14 రీల్స్ ప్లస్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించింది.

బ్లాక్ బ‌స్ట‌ర్ అఖండకు సీక్వెల్‌గా తెరకెక్కించిన `అఖండ 2` డిసెంబరు 5న విడుదల కానుంది. సంయుక్త మీన‌న్, ఆది పినిశెట్టి, పూర్ణ తదితరులు ఈ చిత్రంలో న‌టించారు. దేశాన్ని రక్షించేందుకు సైనికులు ఉంటే.. ధర్మాన్ని కాపాడేందుకు అఘోరాలు, స్వాములు ఉన్నారు అనే కాన్సెప్టుతో హిందూ స‌నాత‌న ధ‌ర్మాన్ని కాపాడ‌ట‌మే ధ్యేయంగా తెర‌కెక్కించిన చిత్రమిది. నంద‌మూరి బాలకృష్ణ నటిస్తున్న 111వ చిత్రం #NBK111 త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్ల‌నుంది. గోపీచంద్‌ మలినేని ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు.

Tags:    

Similar News