మూడో పార్ట్ కు గ్రౌండ్ సిద్ధం చేస్తున్న బ్లాక్ బస్టర్ కాంబో
నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.;
నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనా తర్వాత థియేటర్లు డల్ గా నడుస్తున్న టైమ్ లో వచ్చిన ఈ సినిమా భారీ హిట్ గా నిలవడమే కాకుండా కలెక్షన్ల వర్షం కూడా కురిపించింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా అఖండ2 సినిమా తెరకెక్కుతోంది.
బ్లాక్ బస్టర్ అఖండ కు సీక్వెల్ గా వస్తున్న సినిమా కావడంతో అఖండ2 తాండవంపై అందరికీ మంచి అంచనాలున్నాయి. దానికి తోడు బాలయ్య- బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న సినిమా. వీరిద్దరి కలయిక అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో తెలిసిందే. ఇప్పటికే వారిద్దరి కాంబినేషన్ లో మూడు సినిమాలు రాగా, ఆ మూడు సినిమాలూ ఒకదాన్ని మించి మరొకటి హిట్లుగా నిలిచాయి.
రీసెంట్ గా వచ్చిన అఖండ2 టీజర్ ఆ అంచనాలను మరింత పెంచేసింది. ఎప్పుడెప్పుడు సెప్టెంబర్ 25 వస్తుందా, అఖండ2ని చూద్దామా అని బాలయ్య ఫ్యాన్స్ ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ టాలీవుడ్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. అఖండ2 క్లైమాక్స్ నేరుగా అఖండ3 కు లీడ్ ఇస్తుందని అంటున్నారు.
దాని కోసం బోయపాటి శ్రీను అఖండ2 లో ఓ చిన్న ఎపిసోడ్ ను రూపొందించాడని సమాచారం. ఇటు బోయపాటి తో పాటూ అటు బాలయ్య కూడా అఖండ ఫ్రాంచైజ్ ను ముందుకు తీసుకెళ్లడానికి ఇంట్రెస్టింగ్ గా ఉన్నారని, అందులో భాగంగానే అఖండ3 కోసం అఖండ2 క్లైమాక్స్ లో లీడ్ ను ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. అదే నిజమైతే అఖండ2పై మరింత బజ్ పెరగడం ఖాయం. కాగా అఖండ2 లో ప్రగ్యా జైస్వాల్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తుండగా, తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.