అఖండ 2 కోసం సర్ ప్రైజింగ్ యాక్టర్..!
అఖండ 2 లో హర్షాలి జనని అనే పాత్రలో కనిపించనుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా సల్మాన్ తో నటించిన ఆమె ఇప్పుడు అఖండ 2 లో నటించడం మూవీ లవర్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది.;
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ 2 సినిమా చేస్తున్నారు. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ అంచనాలతో వస్తుంది. అఖండ సినిమా బ్లాక్ బస్టర్ కాగా దానికి కొనసాగింపుగా అఖండ 2 వస్తుంది. ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో గోపీ ఆచంట, రామ్ ఆచంట భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అఖండ 2 లో కాస్టింగ్ నందమూరి ఫ్యాన్స్ తో పాటుగా ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది. సినిమాలో ప్రగ్యా జైశ్వాల్ తో పాటు సంయుక్త మీనన్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇక లేటెస్ట్ గా సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ లో బాలీవుడ్ నటిని తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన సూపర్ హిట్ సినిమా భజరంగి భాయిజాన్ సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ హర్షాలి మల్హోత్రా అఖండ 2లో ఛాన్స్ అందుకుంది. సినిమాలో ఒక మంచి పాత్రలో ఆమె నటిస్తుందని తెలుస్తుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ మేకర్స్ ప్రకటించారు.
అఖండ 2 లో హర్షాలి జనని అనే పాత్రలో కనిపించనుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా సల్మాన్ తో నటించిన ఆమె ఇప్పుడు అఖండ 2 లో నటించడం మూవీ లవర్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది. అఖండ 2 సినిమా పాన్ ఇండియా రిలీజ్ అవుతున్న సందర్భంగా హర్షాలికి ఇది కలిసి వచ్చే పాత్ర అవుతుందని చెప్పొచ్చు.
బోయపాటి శ్రీను అఖండ 2 విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వట్లేదు. బాలయ్య బర్త్ డే నాడు రిలీజ్ చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను దసరా కానుకగా సెప్టెంబర్ 25న రిలీజ్ ఫిక్స్ చేశారు. బాలయ్య ఫ్యాన్స్ కి మరోసారి ఐ ఫీస్ట్ అందించేలా అఖండ 2 ఉంటుందని తెలుస్తుంది.
ఇక అఖండ 2 కోసం థమన్ మరోసారి డ్యూటీ ఎక్కేశాడని తెలుస్తుంది. సినిమాలో తెర మీద సీన్స్ కి అతను ఇచ్చే బిజిఎం నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని తెలుస్తుంది. అఖండ 2 కాస్టింగ్ విషయంలో ఆడియన్స్ ని సినిమాపై మరింత ఆసక్తి పెంచేలా చేస్తుంది. మరి సినిమాపై పెరుగుతున్న ఈ అంచనాలు చూస్తుంటే పాన్ ఇండియా లెవెల్ లో అఖండ 2 సంచలనాలు సృష్టించేలా ఉందని చెప్పొచ్చు.