'అఖండ 2' జార్జియా షెడ్యూల్‌ అప్‌డేట్‌

బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్‌ అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్‌ కేసరి, డాకు మహారాజ్ సినిమాలతో పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకున్నాడు.;

Update: 2025-06-03 06:52 GMT

బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్‌ అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్‌ కేసరి, డాకు మహారాజ్ సినిమాలతో పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకున్నాడు. ఇందులో కొన్ని సినిమాలు థియేట్రికల్‌ రిలీజ్‌లో కమర్షియల్‌ విజయాన్ని సొంతం చేసుకోలేక పోయినా కూడా ఇతర బిజినెస్‌లు కలుపుకుని నిర్మాతలకు లాభాలు తెచ్చి పెట్టాయని, అంతే కాకుండా అభిమానులకు పూర్తి స్థాయి సంతృప్తిని అందించాయి అనడంలో సందేహం లేదు. అందుకే బాలకృష్ణ నుంచి సినిమా అనగానే అభిమానులు మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ 'అఖండ 2' సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేయబోతున్నారు.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఇప్పటి వరకు వచ్చిన సింహా, లెజెండ్‌, అఖండ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. కనుక ఈ సినిమా సైతం మరో భారీ విజయాన్ని దక్కించుకోవడం ఖాయం అని, వీరి కాంబోకు డబుల్‌ హ్యాట్రిక్‌ దక్కడం ఖాయం అనే నమ్మకం వ్యక్తం అవుతోంది. బాలకృష్ణ ఆ మధ్య ఏపీ అసెంబ్లీ ఎన్నికల కారణంగా అఖండ 2 సినిమా ఆలస్యం అయింది. అంతే కాకుండా ఎమ్మెల్యేగా బిజీగా ఉండటం వల్ల బాలకృష్ణ షూటింగ్‌కు ఎక్కువ సమయం కేటాయించలేక పోయారు. అఖండ 2 సినిమా షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది. ప్రస్తుతం జార్జియా షెడ్యూల్‌ జరుగుతోంది.

ఈనెల రెండో వారంలో అఖండ 2 సినిమాకు సంబంధించిన జార్జియా షెడ్యూల్‌ పూర్తి అవుతుంది. ఆ షెడ్యూల్‌తో సినిమా మెజార్టీ పార్ట్‌ షూటింగ్‌ పూర్తి అవుతుంది. బ్యాలన్స్ వర్క్‌ను ఇదే నెల చివరి వారంలో ప్రారంభించి హైదరాబాద్‌తో పాటు ఏపీలో కొన్ని చోట్ల షూటింగ్‌ చేస్తారు. దాంతో సినిమా మొత్తం పూర్తి అవుతుంది. చిత్ర యూనిట్‌ సభ్యుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం జులై చివరి వరకు లేదా ఆగస్టు మొదటి వారంలో అఖండ 2 షూటింగ్‌కి గుమ్మడి కాయ కొట్టే అవకాశాలు ఉన్నాయి. సినిమా విడుదలను సెప్టెంబర్‌లో ప్లాన్‌ చేశారు కనుక రిలీజ్ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండక పోవచ్చు. అఖండ 2 సినిమా షూటింగ్‌ పూర్తి అయిన వెంటనే విడుదల చేయబోతున్నారు.

దసరా కానుకగా అఖండ 2 సినిమాను విడుదల చేయాలని బోయపాటి ప్రయత్నాలు చేస్తున్నాడు. చాలా నెలల క్రితమే సెప్టెంబర్‌ డేట్‌ను అఖండ 2 కి ఫిక్స్ చేశారు. కనుక మరే సినిమా పోటీ వచ్చినా అఖండ 2 రిలీజ్ అవుతుంది కనుక తగ్గాల్సిందే అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాను సైతం సెప్టెంబర్‌లోనే విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి. కనుక అఖండ 2, ఓజీ సినిమాల రిలీజ్ విషయంలో మేకర్స్‌ చర్చించే అవకాశాలు ఉన్నాయి. రెండు సినిమాలకు కనీసం వారం గ్యాప్‌తో విడుదల చేసే విధంగా ప్లాన్‌ చేసే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే రెండు సినిమాలకు ఇబ్బంది ఉండదు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Tags:    

Similar News