వెనిస్ లో స్టార్ హీరో ఫ్యామిలీకి అరుదైన గౌర‌వం!

ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. కుటుంబంతో అజిత్ ఫ్యామిలీ ని చూసి అభిమానులు మురిసిపోతున్నారు. ఫ్యామిలీతో ఇలా క‌నిపించ‌డం అన్న‌ది చాలా రేర్.;

Update: 2025-11-23 07:30 GMT

కోలీవుడ్ లో త‌ల అజిత్ కుమార్ కెరీర్ దేదీప్య‌మానంగా సాగిపోతుంది. ఓవైపు సినిమాలు మ‌రో వైపు కారు రేసింగ్ అంటూ రెండు రకాల జ‌ర్నీని ప‌ర్పెక్ట్ గా ప్లాన్ చేసుకుని ముందుకు సాగుతున్నారు. దీంతోఅవార్డులు..రివార్డుల‌తోనూ అజిత్ పేరు మోరుమ్రోగిపోతుంది. ఇదే ఏడాది ప్ర‌తిష్టాత్మ‌క ప‌ద్మ‌భూష‌ణ్ అవార్డు కూడా అందుకున్నారు. అంత‌కు ముందు రాష్ట్ర స్థాయిలోనూ..జాతీయ స్థాయిలోనూ అవార్డులు అందుకున్నారు. ఇక ప్ర‌త్యేకించి రేసింగ్ అవార్డుల గురించైతే చెప్పాల్సిన ప‌నిలేదు. ఇలాంటి అవార్డులు అజిత్ ఇలాకాలో అన్నీ ఇన్నీ కావు.

రేసింగ్ కాంపిటీష‌న్ లోనూ ఎన్నో అవార్డులు అందుకున్నారు. తాజాగా ఇటలీ వెనిస్‌లో 2025 సంవత్సరం గానూ `జెంట్‌ల్మన్ డ్రైవర్` అవార్డుతో సైతం అజిత్ సొంతం చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా కుటుంబ స‌మేతంగా అజిత్ అవార్డు కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. భార్య షాలిని..పిల్ల‌లిద్ద‌రితో క‌లిసి ఈవెంట్ కు హాజ‌ర‌య్యారు. భార‌తీయ సంప్ర‌దాయాన్ని విదేశాల్లో ఉట్టి ప‌డేలా చేసారు. షాలిని సంప్ర‌దాయ చీర ధ‌రించి హాజ‌రవ్వ‌గా, అజిత్, అత‌ని కుమారుడు సూట్ లో ముస్తాబ‌య్యారు. కుమార్తె కూడా ప‌ద్ద‌తైన ఔట్ పిట్ లో త‌ళుక్కున మెరిసారు.

అంతా బ్లాక్ అండ్ డార్క్ బ్లూ థీమ్ లో హైలైట్ అవుతున్నారు. ప్ర‌ఖ్యాత ఫిలిప్ షారియోల్ మోటర్‌స్పోర్ట్స్ గ్రూప్ క‌ల్పించిన అవ‌కాశ‌మిది. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. కుటుంబంతో అజిత్ ఫ్యామిలీ ని చూసి అభిమానులు మురిసిపోతున్నారు. ఫ్యామిలీతో ఇలా క‌నిపించ‌డం అన్న‌ది చాలా రేర్. ఇలాంటి అరుదైన ఈవెంట్లు మిన‌హా కుటుంబ స‌భ్యులెవ‌రు పెద్ద‌గా బ‌య‌ట‌కు రారు. అజిత్ కోలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో న‌టించారు. ఆ సినిమా ఈవెంట్ల‌కు కూడా షాలిని హాజ‌రు కారు. పెళ్లైన కొత్త‌లో హాజ‌ర‌య్యే వారు.

ఆ త‌ర్వాత క్ర‌మంలో అలాంటి ఈవెంట్ల‌కు దూర‌మ‌య్యారు. ఇక అజిత్ సినిమాల విష‌యానికి వ‌స్తే ఈ ఏడాది `గుడ్ బ్యాడ్ అగ్లీ`, `విదాముయార్చీ` సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. వీటిలో `గుడ్ బ్యాడ్ అగ్లీ` మంచి విజ‌యం సాధించింది. ఈ నేప‌థ్యంలో ఆ చిత్ర ద‌ర్శ‌కుడు అదిక ర‌విచంద్ర‌న్ తోనే మ‌రో సినిమాకు ఒప్పందం చేసుకున్నాడు. ఈ సినిమా వ‌చ్చే ఏడాది ప‌ట్టాలెక్కుతుంది. అలాగే అజిత్ కొత్త క‌మిట్ మెంట్ల గురించి వ‌చ్చే ఏడాది అప్ డేట్ రానుంది.

Tags:    

Similar News