పిక్‌టాక్ : సతీ సమేతంగా సూపర్ స్టార్
తమిళ్ సూపర్ స్టార్ అజిత్ కుమార్ తాజాగా ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు.;
తమిళ్ సూపర్ స్టార్ అజిత్ కుమార్ తాజాగా ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు. ప్రతిష్టాత్మక అవార్డును అందుకునేందుకు గాను అజిత్ కుటుంబంతో కలిసి ఢిల్లీ వెళ్లారు. భార్య షాలినితో పాటు ఇద్దరు పిల్లలతో అజిత్ చెన్నై ఎయిర్ పోర్ట్‌లో కనిపించాడు. ఆ సమయంలో తీసిన ఫోటోలు వైరల్ అయ్యాయి. అజిత్ స్టైలిష్ లుక్‌కి అంతా ఫిదా అయ్యారు. సాధారణంగా మాసిన గడ్డం, తెల్ల జుట్టు ఉండే అజిత్ ఈసారి చాలా స్పెషల్ గా ఇరవై ఏళ్లు తగ్గి మరీ కనిపించాడు అంటూ అభిమానులు ఆ ఫోటోలను తెగ షేర్ చేశారు. అభిమానులతో పాటు నెటిజన్స్ నుంచి ఆ ఫోటోలకు మంచి స్పందన వచ్చిన విషయం తెల్సిందే.
సినిమా షూటింగ్ సమయంలో లేదా ఏదైనా ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొన్న సమయంలో అజిత్ చాలా సింపుల్‌గా, ఓల్డ్ లుక్‌లో కనిపిస్తూ ఉంటాడు. కానీ ఈసారి మాత్రం ఆయన స్టైలిష్ లుక్‌లో కనిపించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డ్ అందుకునేందుకు గాను గతంలో ఎప్పుడూ లేని విధంగా స్టైలిష్ లుక్‌తో బయట అజిత్ కుమార్ కనిపించారు. అవార్డు వేడుక తర్వాత అజిత్ భార్య షాలినితో తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాతో షేర్ చేశారు. షాలిని ఈ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు. ఆకట్టుకునే విధంగా ఉన్న ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
సాదారణంగానే అజిత్ ఏదైనా ఫోటో సోషల్ మీడియాలో షేర్ అయితే తెగ ట్రెండ్ కావడం మనం చూస్తూ ఉంటాం. అలాంటి ఇలా స్టైలిష్ లుక్‌లో కనిపించడంతో పాటు, అంతకు మించి అన్నట్లుగా షాలిని మేడంతో ఉండటంతో అభిమానులు ఫోటోలను నిమిషాల వ్యవదిలోనే వైరల్ చేశారు. అజిత్, షాలిని ఫోటోలు ఎప్పుడు వచ్చినా వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా మరోసారి ఈ ఫోటోలతో ఈ స్టార్ కపుల్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. సినిమాలతో ఎప్పుడూ బిజీగా ఉండే అజిత్ కుమార్ చాలా అరుదుగా మాత్రమే ఇలా షాలినితో కలిసి సమయం గడుపుతూ ఉంటారు. తాజాగా ఢిల్లీకి ఫ్యామిలీతో వెళ్లడంతో ఇలా ఫోటోలకు ఫోజ్ ఇచ్చి సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
బ్లాక్ అండ్ బ్లాక్ సూట్‌లో అజిత్ లుక్ అదిరి పోయింది, ఆయనకు ఏమాత్రం తగ్గకుండా షాలిని చీర కట్టు సైతం చూపు తిప్పుకోనివ్వడం లేదు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇద్దరిదీ అద్భుతమైన జోడీ అంటూ చాలా మంది అంటూ ఉంటారు. మరోసారి ఇది నిరూపితం అయ్యింది. ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అజిత్ తాజాగా గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.200 కోట్ల వసూళ్లు నమోదు చేసింది. అజిత్ కొత్త సినిమాను సైతం అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలోనే చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాడట. ఆ విషయమై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.