• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అభిమానుల అతి ప్రేమ ప్రాణం...

అభిమానుల అతి ప్రేమ ప్రాణం మీద‌కు తెచ్చేలా!

| ఈ సంద‌ర్భంగా త‌మిళ‌నాడులోని తెంకాశీ ప‌ట్ట‌ణం లోని ఓ థియేట‌ర్ వ‌ద్ద 285 అడుగుల భారీ క‌టౌట్ ను అభిమానులు ఏర్పాటు చేసారు.

By - Tupaki Desk
Update: 2025-04-07 07:40 GMT

స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే? ఆ హీరోల క‌టౌట్లు థియేట‌ర్ ముందు ఏ రేంజ్ లో ద‌ర్శ‌నమి స్తాయో చెప్పాల్సిన ప‌నిలేదు. మా హీరో ఒక్క‌డే గొప్ప అన్న నినాదంతోనే ప్ర‌తీ హీరో అభిమాని ముందు కెళ్తాడు. ఈ ఒక్క కార‌ణం ఎన్ని ర‌కాల యుద్దాల‌కు దారి తీస్తుందో తెలిసిందే. ఒక‌ప్పుడు అభిమాన సంఘాల మ‌ధ్య వివాదాలొచ్చేవి. కోట్లాట జ‌రిగేవి. ఇప్పుడా సంఘాల‌కు బ‌ధులు సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న్నుకుంటున్నారు.

మాట‌ల‌తో ఒక‌ర్ని ఒక‌రు దూషించుకుంటున్నారు. పోలీస్ స్టేష‌న్ల‌కు వెళ్లి కేసులు పెట్టుకుంటున్నారు. ఈ గొప్ప సంస్కృతి క‌నిపించేది కేవ‌లం టాలీవుడ్...కోలీవుడ్ ఇండ‌స్ట్రీలో మాత్ర‌మే. దేశంలో ఎన్నో చిత్ర ప‌రిశ్రమలున్నాయి. కానీ ఎక్క‌డా లేని గొప్ప సంస్కృతి ఈ రెండు రాష్ట్రాల్లో మాత్ర‌మే క‌నిపిస్తుంటుంది. ఈ విషయంలో అభిమానులు మారండని రెండు ప‌రిశ్ర‌మ‌ల హీరోలు మోత్తుకుని చెబుతుంటారు.

కానీ వాటిని పట్టించుకునేది ఎంత మంది? ఆచ‌రించేది మ‌రెంత మంది? తాజాగా అభిమానుల అత్యుత్సాహం మ‌రోసారి పెను ప్ర‌మాదంలో ప‌డేయ బోయింది. తృటిలో ప్రాణాపాయం నుంచి త‌ప్పించు కున్నారు. లేదంటే ఊహించ‌ని ప్ర‌మాద‌మే చోటు చేసుకునేది. త‌ల అజిత్ హీరోగా న‌టించిన `గుడ్ బ్యాడ్ అగ్లీ` ఈనెల 10న రిలీజ్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా త‌మిళ‌నాడులోని తెంకాశీ ప‌ట్ట‌ణం లోని ఓ థియేట‌ర్ వ‌ద్ద 285 అడుగుల భారీ క‌టౌట్ ను అభిమానులు ఏర్పాటు చేసారు.

ఇనుముతో తయారు చేసిన పెన్సింగ్ గ్రిల్ ఏర్పాటు చేసి ఒక్కో భాగాన్ని పెడుతూ వెళ్తున్నారు. అయితే కాసేప‌టికి అజిత్ త‌ల భాగం ఒక్క‌సారిగా అదుపు త‌ప్పి కూలిపోయింది. దీంతో చుట్టూ ఉన్న జ‌న‌మంతా ఒక్క‌సారిగా ప‌రుగులు తీసారు. అంతా స‌కాలంలో స్పందించి ప‌క్క‌కు త‌ప్పుకోవ‌డంతో ఎవ‌రికీ ఎలాంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌లేదు. లేదంటే పెద్ద ప్ర‌మాదమే జ‌రిగేద‌ని తెలుస్తోంది.

త‌న పేరిట ఎలాంటి క‌టౌట్లు పెట్టొద్ద‌ని అజిత్ ఎప్పుడు చెబుతుంటాడు. కానీ ఆయ‌న మాట‌ల‌తో సంబంధం లేకుండా అభిమానులు వ్య‌వ‌రిస్తున్నార‌ని తాజా ఘ‌ట‌న‌తో మ‌రోసారి ప్రూవ్ అయింది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి అజిత్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Ajith's huge cutout collapses...

A massive cutout set up for the release of 'Good Bad Ugly' has collapsed.

Fortunately, fans ran away just in time and escaped unharmed.#AjithKumar #GoodBadUgly #ajithkumarfans #Kollywood #Tupaki pic.twitter.com/qbq2qzk2da

— Tupaki (@tupaki_official) April 7, 2025
Tags:    
  • AjithKumar 
  • GoodBadUgly 
  • AjithFans 
  • Kollywood 
  • TamilCinema 
  • MythriMovieMakers 
  • CutoutCollapse 
  • April10Release 
  • AdhikRavichandran 
  • Filmindustry 

Similar News

ఓటీటీలోకి నేరుగా తెలుగు వెర్షన్.. మహిళల ఆదరణ దక్కేనా?

2026-11-24 05:43 GMT

దీపిక‌తో బ‌ల‌వంతంగా ఇల్లు ఊడ్పించిన ట్రైన‌ర్!

2026-11-24 05:43 GMT

శ్రేయా ఘోషల్‌తో క‌పూర్ బ్యూటీ మ్యూజికల్ జర్నీ!

2026-11-24 05:43 GMT

ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ మూవీ టైటిల్ ఇదేనా?

2026-11-24 05:41 GMT

షాహిద్.. సైఫ్‌ హుందాతనానికి బాలీవుడ్ ఫిదా!

2026-11-24 04:18 GMT

చిరకాల ప్రేయసితో ఏడడుగులు వేసిన నటుడు!

2026-11-24 04:18 GMT

సంపత్ నంది కి టాలెంట్ ఉన్నప్పటికీ స్టార్ డైరెక్టర్ అవ్వకపోవడానికి కారణమేంటి..?

2026-11-24 03:56 GMT

క్లిన్ కారాను స్కూల్‌కి వెళ్ల‌మంటే మారాం చేస్తోందా!

2026-11-24 03:50 GMT

'అవెంజ‌ర్స్ డూమ్స్ డే' ఫైన‌ల్ ట్రైల‌ర్: కొత్త వారియ‌ర్ ప్ర‌పంచంలోకి పయ‌నం!

2026-11-24 03:48 GMT

ఈ నటుడికి టాలెంట్ ఉండి కూడా స్టార్ హీరో అవ్వకపోవడానికి కారణమేంటంటే..?

2026-11-24 03:48 GMT

రూ.99 ఆఫ‌ర్‌ : 'రామాయ‌ణ' కాకుండా టాప్-10 సినిమాలు!

2026-11-24 03:47 GMT

నితిన్ మూవీలకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా, నిర్మాతగా పనిచేసిన హీరో ఎవరంటే?

2026-11-24 03:47 GMT

Copyright @2026

Powered by Blink CMS