• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  స్టార్ హీరో విల్లా.. ఒక...

స్టార్ హీరో విల్లా.. ఒక రాత్రి అద్దె 50,000

| వారికి గోవాలో విలాసవంతమైన 5-BHK విల్లా భారీ ఆదాయాన్ని తెచ్చి పెడుతోంది. ఈ విల్లా ఒక రాత్రికి రూ. 50,000 అద్దెను అందిస్తోంది.

By - Tupaki Desk
Update: 2024-10-16 02:30 GMT

బాలీవుడ్ టు టాలీవుడ్ స్టార్ హీరోలు రియ‌ల్ ఎస్టేట్ లో భారీ పెట్టుబ‌డులు పెడుతున్న సంగ‌తి తెలిసిందే. పెరుగుతున్న జ‌నాభా, వారి విలాసాలు, అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్టుగానే నిర్మాణ రంగం పెరుగుతోందే కానీ త‌ర‌గ‌డం లేదు. ముఖ్యంగా సెల‌బ్రిటీలు రిట‌ర్నులు వ‌చ్చే స్థిరాస్తి రంగంలో భారీ పెట్టుబ‌డులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నారు. స్టార్ హీరోలు సిటీ ఔట్ స్క‌ర్ట్స్ లో ఫామ్ హౌస్ లు, విల్లాలు నిర్మించ‌డంలోను బిజీగా ఉన్నారు. అలా తాను సంపాదించిన దాంతో ముంబైలో భారీ విల్లా నిర్మించాడు ప్ర‌ముఖ స్టార్ హీరో అజ‌య్ దేవ‌గ‌న్. ఈ విల్లాతో ఒక రాత్రికి రూ.50,000 సంపాదిస్తున్నాడు. నెల‌కు అక్ష‌రాలా ప‌దిహేను ల‌క్ష‌లు (15ల‌క్ష‌లు) కేవ‌లం రాత్రి వేళ‌ల్లో అద్దె రూపంలో వ‌సూలు చేస్తున్నాడు. అంటే ఏడాదికి 1.5 కోట్లు సునాయాసంగా సంపాదిస్తున్నాడ‌న్న‌మాట‌. పూర్తి వివ‌రాల్లోకి వెళితే....




 



పాపుల‌ర్ బాలీవుడ్ హీరో అజ‌య్ దేవ‌గ‌న్, అత‌డి భార్య కాజోల్ ఇద్ద‌రూ రియ‌ల్ ఎస్టేట్ రంగంలో భారీ పెట్టుబ‌డులు పెడుతున్నారు. వారికి గోవాలో విలాసవంతమైన 5-BHK విల్లా భారీ ఆదాయాన్ని తెచ్చి పెడుతోంది. ఈ విల్లా ఒక రాత్రికి రూ. 50,000 అద్దెను అందిస్తోంది. ఇంటి పేరు- ఎటర్నా. స్టార్ క‌పుల్‌కు చెందిన విలాసవంతమైన గోవా ఆస్తి. ఈ అద్భుతమైన విల్లా బాలీవుడ్ జంటలు సాగించే విలాసవంతమైన జీవన విధానాన్ని ప్ర‌తిబింబిస్తోంది. బీచ్‌సైడ్ ప్ర‌యాణించిన‌ప్పుడు ఈ జంట‌ ఇక్కడే ఉంటారు. ఇంట్లో ఐదు బెడ్‌రూమ్ లు, ఒక అందమైన గెజిబోతో అనుసంధానించిన‌ ప్రైవేట్ పూల్ ఉన్నాయి. ఈ జంట ప్రధాన బెడ్‌రూమ్ ని అత్యంత విలాస‌వంతంగా నిర్మించుకున్నారు. వారు ఎప్పుడు వ‌చ్చినా అందులోనే ఉంటారు. విల్లా ప‌రిస‌రాలు ప్రశాంతమైన వాటర్ వాల్ ఫౌంటెన్‌, ప్రైవేట్ గార్డెన్ తో అందంగా క‌నిపిస్తుంది.





 



ఈ ఇల్లు ఉత్తర గోవాలో పచ్చని పరిసరాలలో ఉంది. విలాసవంతమైన విల్లా స్టార్ కపుల్ ఫ్రేమ్డ్ ఫోటోగ్రాఫ్స్‌తో అందంగా అలంకరించి ఉంటుంది. ఇంట్లో డెకర్, ఫర్నిచర్, పెయింటింగ్స్, శిల్పాలను వ్యక్తిగతంగా ఎంపిక చేసి అలంక‌రించుకున్నారు. పోర్చుగీస్ శైలిలో నిర్మించిన ఈ విల్లాలో లేటెస్ట్ క‌ల్చ‌ర్ కి త‌గ్గ‌ట్టు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. విల్లా గ్రౌండ్ ఫ్లోర్‌లో రెండు బెడ్‌రూమ్‌లు, ఒక ప్రైవేట్ పూల్, డైనింగ్ ఏరియా, లివింగ్ ఏరియా ఉన్నాయి. మరో మూడు బెడ్‌రూమ్‌లు, వాటర్ వాల్ ఫౌంటైన్‌లు వేరే అంతస్తులో ఉన్నాయి. కర్లీ టేల్స్ ఇటీవల తన యూట్యూబ్ ఛానెల్‌లో ఈ విల్లా పర్యటన తాలూకా ఫోటోలు వీడియోను పోస్ట్ చేసింది.




 



ఈ జంట విల్లాను సంద‌ర్శించిన ప్ర‌తిసారీ మాస్టర్ బెడ్‌రూమ్‌లో ఉండేందుకు ప్రాధాన్య‌త‌నిస్తారు. ఇందులో అందమైన చెక్క మంచం, మూడు-సీట్ల లగ్జరీ సోఫా, సైడ్ టేబుల్‌లు ఉంటాయి. దాంతో పాటు ఇంటిలో ఐదు బాత్‌రూమ్‌లు, నాలుగు వాహనాలకు తగినంత పార్కింగ్ ఉన్నాయి. అలాగే ఇందులో ప‌ని చేసే ప్రముఖ చెఫ్‌లు స్టార్ హోట‌ళ్ల‌కు త‌గ్గ‌రీతిలో గెస్టుల‌ అభిరుచులకు ప్రత్యేకంగా సరిపోయే వంటకాలను త‌యారు చేస్తుంటారు. క‌ర్లీ టేల్స్ ప్రకారం...ఎవ‌రికైనా గోవాలో అతిథి గృహం కావాల‌నుకుంటే నిజంగా విలాసవంతంగా ఈ విల్లాలో ఒక రాత్రిని కేవ‌లం 50వేల‌కే ఆస్వాధించ‌వ‌చ్చు.


Tags:    
  • Bollywood 
  • Goa 
  • Villa 
  • Ajaydevgn 
  • Kajol 
  • Starcouples 
  • Realestate 
  • Staractor 

Similar News

బయట 100 కెమెరాలు..లోపల వైట్ సోఫా రూల్!

2026-11-12 11:30 GMT

ఘనంగా మహేష్ బాబు మేనల్లుడి ప్రీ వెడ్డింగ్.. స్పెషల్ పోస్ట్ పంచుకున్న నమృత!

2026-11-12 11:00 GMT

‘వారణాసి’కి రామాయణం చేస్తున్న సాయం

2026-11-12 10:38 GMT

మామ్ గిల్ట్ అంటే ఏంటో అప్పుడే తెలిసింది!

2026-11-12 10:30 GMT

200 ఏళ్ల చరిత్ర కలిగిన ఆభరణాలు.. కరీనాకపూర్ కు వారసత్వంగా ఇంకేం లభించాయంటే?

2026-11-12 10:05 GMT

'వారణాసి'.. ఏడాదిగా ఒక్కటేనా..

2026-11-12 09:54 GMT

ఇన్‌ఫ్లుయెన్సర్స్ నిజంగా ఆ రేంజ్ లో సంపాదిస్తున్నారా?

2026-11-12 09:45 GMT

నువ్వే నువ్వే నుంచి ఆదర్శ కుటుంబం వరకు.. త్రివిక్రమ్‌లో ఈ మార్పేంటి?

2026-11-12 08:18 GMT

తండ్రి కట్ చేసిన సీన్‌ను దొంగచాటుగా కలిపిన హృతిక్!

2026-11-12 08:17 GMT

సూర్యతో నాకు పోలికేంటి? ఆయన లెజెండ్!

2026-11-12 08:16 GMT

వారి గురించి ఆలోచించడం సోనూ సూద్‌ గొప్పతనం..!

2026-11-12 08:16 GMT

'ఇడుపు కాయితం' టీజర్.. సీతా కళ్యాణంతో మొదలై విడాకుల దాకా..

2026-11-12 06:57 GMT

Copyright @2026

Powered by Blink CMS