రకుల్ మూవీ ట్రైలర్.. అది మిస్ అయినట్టుందే
తాజాగా రిలీజైన దే దే ప్యార్ దే2 సినిమా ట్రైలర్ ఆశించిన దానికంటే సాఫ్ట్ గా అనిపించింది.;
సాధారణ సినిమాల కంటే సీక్వెల్ సినిమాలకు ఓ అడ్వాంటేజ్ ఉంటుంది. సీక్వెల్ గా వచ్చే సినిమాకు మొదటి నుంచి మంచి హైప్, ఎగ్జైట్‌మెంట్ ఉంటాయి. ఆ అడ్వాంటేజ్ ను వాడుకుని కొన్ని సినిమాలు సక్సెస్ గా నిలిస్తే మరికొన్ని సినిమాలు అంచనాలను అందుకోలేకపోతాయి. ఇప్పుడలానే ఓ సీక్వెల్ లక్ ను టెస్ట్ చేసుకోబోతుంది. అదే దే దే ప్యార్ దే2.
దే దే ప్యార్ దే2 ట్రైలర్ రిలీజ్
అజయ్ దేవగన్, రకుల్ ప్రీత్ సింగ్, ఆర్ మాధవన్, గౌతమి కపూర్, మీజాన్ జాఫ్రి నటించిన ఈ సినిమా ట్రైలర్ తాజాగా రిలీజవగా, మేకర్స్ మరోసారి ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. తాజాగా రిలీజైన దే దే ప్యార్ దే2 సినిమా ట్రైలర్ ఆశించిన దానికంటే సాఫ్ట్ గా అనిపించింది. ట్రైలర్ చూడగానే ఊహించిన రేంజ్ లో లేదనే ఫీలింగ్ కలుగుతుంది.
ట్రైలర్ కు మిక్డ్స్ రెస్పాన్స్
అలా అని ట్రైలర్ బాలేదని కాదు, ట్రైలర్ లోని కొన్ని సీన్లు కామెడీగా అనిపించాయి. కానీ అవేవీ సినిమాపై భారీ ఆసక్తిని రేకెత్తించేలా లేవు. బుద్ద మిల్ గయా అనే పాట ఉన్నప్పటికీ అది కూడా పూర్తి స్థాయిలో లేదు. దీంతో ట్రైలర్ చూశాక ఆడియన్స్ నుంచి మిక్డ్స్ రెస్పాన్స్ వస్తుంది. కొందరు అసలు నిజంగా ఇది సీక్వెల్ తీయాల్సిన సినిమానా అని కామెంట్స్ చేస్తుంటే మరికొందరు ట్రైలర్ ఫన్నీగా ఉందని కామెంట్ చేస్తున్నారు.
మెటా రిఫరెన్స్ లు మరియు కొన్ని జోక్స్ ను ఇంకొందరు ఎంజాయ్ చేస్తే, ఓ వర్గం ఆడియన్స్ మాత్రం ట్రైలర్ లో ఎట్రాక్టివ్ గా ఉండే సాంగ్ ఏదీ లేదని అభిప్రాయ పడుతున్నారు. మొత్తానికి ట్రైలర్ చూశాక ఆడియన్స్ ఎగ్జైటింగ్ గా ఉన్నప్పటికీ, ట్రైలర్ మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదనే మాటే ఎక్కువగా వినిపిస్తుంది. ట్రైలర్ ఎలా ఉన్నా సినిమా ఆకట్టుకునే అవకాశమైతే లేకపోలేదు. టీ సిరీస్, లవ్ ఫిల్మ్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా మొదటి సినిమా తరహాలో సక్సెస్ ను అందుకుంటుందా లేదా అనేది చూడాలి. కొంత కాలంగా సరైన సక్సెస్‌ల్లో లేని రకుల్ కు ఈ మూవీ అయినా సాలిడ్ కంబ్యాక్ ఇస్తుందేమో అని ఆమె ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.