సూపర్ స్టార్ లైనప్.. 7 సీక్వెల్స్.. 1 ఒరిజినల్

బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ నుండి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రాబోతున్నాయి. 2026 - 27 సంవత్సరాల్లో ఆయన చాలా బిజీ బిజీగా గడపబోతున్నారు.;

Update: 2025-08-22 10:30 GMT

బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ లైనప్ చూస్తే మతిపోతుంది. ఎందుకంటే రాబోయే రెండు సంవత్సరాలలో ఈయన ఏకంగా ఏడు సినిమాలలో లైన్ లో పెట్టారు. అయితే తమ అభిమాన హీరో ఎక్కువ సినిమాలు చేస్తున్నాడని సంతోషపడాలో లేక ఆ సినిమాలన్నీ సీక్వెల్స్ అని సందేహపడాలో తెలియడం లేదు అంటున్నారు చాలామంది ఆయన అభిమానులు.. అయితే ఇందులో తప్పుగా అర్థం చేసుకోవాల్సింది ఏముంది.. సీక్వెల్స్ అయితే ఏంటి ఆయన నుండి వరుస సినిమాలు వస్తున్నాయని ఎగ్జైట్ అవ్వచ్చుగా అని మరికొంతమంది అనుకోవచ్చు. మరి ఒకేసారి ఏడు సినిమాలు ప్రకటించినా.. అజయ్ దేవగన్ అభిమానులు ఎందుకు నిరాశ పడుతున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

 

బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ నుండి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రాబోతున్నాయి. 2026 - 27 సంవత్సరాల్లో ఆయన చాలా బిజీ బిజీగా గడపబోతున్నారు. ఇప్పటికే ఆయన నటించిన చాలా సినిమాలకు సీక్వెల్స్ ప్రకటించేశారు.అయితే ఇక్కడ వచ్చిన అసలు సమస్య ఏంటంటే.. అజయ్ దేవగన్ నటించబోయే 7 సినిమాలు కూడా సీక్వెల్స్ కాగా కేవలం ఒకే ఒక్క సినిమా మాత్రం ఒరిజినల్ అట. ఇప్పటివరకు అజయ్ దేవగన్ నటించిన 7 సినిమాలకు సంబంధించిన సీక్వెల్స్ ని వచ్చే రెండు సంవత్సరాల్లో ఆయన పూర్తి చేయబోతున్నారట.

ఆ సినిమాలు ఏంటంటే దృశ్యం-3, గోల్ మాల్ 5, ధమాల్ 4, షైతాన్ 2, బోలా 2 సినిమాలను 2026 - 2027 సంవత్సరాలలో షూటింగ్ కంప్లీట్ చేయబోతున్నారట.

ఇక రేంజర్ అనే మరో సినిమాలో కూడా అజయ్ దేవగన్ నటిస్తున్నారు. ఇప్పటికే ఆయన నటించిన దేదే ప్యార్ దే సినిమాకు సీక్వెల్ గా దేదే ప్యార్ దే -2 సినిమా షూటింగ్ పూర్తవుతోంది. ఈ సినిమా నవంబర్ 14న విడుదల కాబోతున్నట్టు టాక్. అయితే ఇదంతా బాగానే ఉంది కానీ ఆయన అభిమానులు మాత్రం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అజయ్ దేవగన్ చేయబోయే 7 సీక్వెల్స్ లో ఎన్ని సినిమాలు హిట్ అవుతాయి అనేది తెలియదు. అందుకే సీక్వెల్స్ మీద నమ్మకం పెట్టుకోకుండా కొత్త కథలతో సినిమాలు తీయాలని కోరుకుంటున్నారు. అయితే అజయ్ దేవగన్ దృశ్యం 3, ధమాల్ 4 వంటి సీక్వెల్స్ పై అంచనాలు ఉన్నాయి. కానీ మిగిలిన సీక్వెల్స్ పై అన్ని అంచనాలు అయితే లేవు. అందుకే అభిమానులు కాస్త నిరాశ పడుతున్నారు.

దీనికి తోడు రీసెంట్ గా అజయ్ దేవగన్ నటించిన సన్ ఆఫ్ సర్దార్ 2 మూవీ ఫ్లాప్ అవ్వడంతో సీక్వెల్స్ పై నమ్మకం పోయింది అంటున్నారు ఆయన అభిమానులు. అందుకే కొత్త కథలు ఎంచుకోవాలని,కంటెంట్ బాగుంటేనే సీక్వెల్స్ ఆడతాయని,కంటెంట్ బాలేకపోతే సీక్వెల్స్ అజయ్ దేవగన్ మార్కెట్ మీద దెబ్బకొడతాయని, కొత్త కథల మీద దృష్టి పెట్టాలంటూ ఫ్యాన్స్ సలహాలు ఇస్తున్నారు. సీక్వెల్స్ సినిమాలపై ఆధారపడకుండా కొత్త స్క్రిప్ట్ లను ఎంచుకొని ఒరిజినల్ కథలతో అభిమానులను అలరించాలని కోరుకుంటున్నారు. మరి అజయ్ దేవగన్ నుండి రాబోయే సీక్వెల్స్ ఆయన అభిమానులను మెప్పిస్తాయా.. లేక అజయ్ దేవగన్ అభిమానులు చెప్పినట్టు సీక్వెల్స్ పక్కనపెట్టి కొత్త ప్రాజెక్టులను ఎంచుకుంటారా? అనేది తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News