300 కోట్ల వ‌సూళ్ల సినిమా చేతిలో ఉన్నా ఛాన్సే రాలేదే!

వెంక‌టేష్ హీరోగా న‌టించిన `సంక్రాంతికి వ‌స్తున్నాం `సినిమాలో ఐశ్వ‌ర్యారాజేష్ భార్య‌గా అద్భుతంగా అభిన‌యించింది. స‌హ‌జ న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది.;

Update: 2025-09-17 23:30 GMT

సాధార‌ణంగా విజ‌యాలు లేక‌పోతే ఏ న‌టికి అవ‌కాశాలు రావు అన్న‌ది వాస్త‌వం. స‌క్సెస్ ఉంటే సెంటిమెంట్ గానైనా ఆ న‌టి సినిమాకు క‌లిసొస్తుంద‌ని తీసుకుంటారు. కానీ స‌క్స‌స్ ఉన్నా? అవ‌కాశం రాక‌పోతే ఏమ‌నాలి? అందులోనూ 300 కోట్ల వ‌సూళ్ల సినిమాలో భాగ‌మైన న‌టికి మ‌రో అవ‌కాశం గ‌గ‌నంగా మారిందంటే? ఇంకేమ‌నాలి. అవును ఐశ్వ‌ర్యా రాజేష్ విష‌యంలో అదే జ‌రుగుతోందిప్పుడు. వెంక‌టేష్ హీరోగా న‌టించిన `సంక్రాంతికి వ‌స్తున్నాం `సినిమాలో ఐశ్వ‌ర్యారాజేష్ భార్య‌గా అద్భుతంగా అభిన‌యించింది. స‌హ‌జ న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది.

ఫ‌లించని జోస్యం:

మ‌రో సౌంద‌ర్య‌గా ఇంట‌ర్నెట్ లో ఫేమ‌స్ అయింది. చాలా కాలానికి మంచి స‌హ‌జ న‌టి వ‌చ్చింద‌ని విమ‌ర్శ‌కులు ప్ర‌శంసించారు. ఇక టాలీవుడ్ లో అమ్మ‌డి కెరీర్ కి తిరుగుండ‌ద‌న్నారు. బిజీ న‌టిగా మారిపోతుంద‌ని....అంద‌నంత ఎత్తుకు ఎదుగుతుంద‌ని జోస్యం చెప్పారు. మ‌రి ఆ జోస్యం ఫ‌లించిందా? అంటే ఎంత మాత్రం కాద‌నే చెప్పాలి. `సంక్రాంతికి వ‌స్తున్నాం` రిలీజ్ అయినప్పుడే తొమ్మిది నెల‌లు స‌మీపిస్తుంది. కానీ ఐశ్వ‌ర్య ఇంత వ‌ర‌కూ మ‌రో తెలుగు సినిమాకు సైన్ చేయ‌లేదు. క‌నీసం ఫ‌లానా తెలుగు క‌థ వింటుంది? అన్న ప్ర‌చారం కూడా ఎక్క‌డా రాలేదు.

ఆ రెండు భాష‌ల్లోనే:

స్టార్ హీరోల స‌ర‌స‌న అవ‌కాశాల సంగ‌తి దెవుడెరుగు? అస‌లు చిన్న పాటి అవ‌కాశాలు కూడా రాక‌పోవ‌డం అన్న‌ది శోచ‌నీయం. ప్రస్తుతం ఐశ్య‌ర్యా రాజేష్ చేస్తోన్న చిత్రాల‌న్నీ కూడా త‌మిళ‌, క‌న్న‌డ చిత్రాలే క‌నిపిస్తున్నాయి. కోలీవుడ్ లో మూడు సినిమాలు చేస్తోంది. క‌న్న‌డ‌లో ఇంత వ‌ర‌కూ లాంచ్ అవ్వ‌లేదు. తొలిసారి `ఉత్త‌రాఖండ్` అనే సినిమాతో ఎంట్రీ ఇస్తుంది. దీంతో తెలుగు అవ‌కాశాలు రాలేదా? లేక వ‌చ్చినా? పాత్ర‌లు న‌చ్చ‌క క‌మిట్ అవ్వ‌లేదా? అన్న సందేహాలు లేక‌పోలేదు. కార‌ణం ఏదైనా? ఓ బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత ఐశ్వ‌ర్య తెలుగు సినిమా చేయ‌క‌పోవడం అన్న‌ది ప్రేక్ష‌కుల్లో చర్చ‌నీయాంశంగా మారింది.

ఈఫేజ్ ని దాటేదెలా?

మ‌రి ఈ ఫేజ్ ని దాటి టాలీవుడ్ లో అవ‌కాశాలు ఎలా అందుకుంటుంది? అంద‌కు అమ్మ‌డి భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక ఏంటి? అన్న‌ది తెలియాలి. స‌క్సెస్ లు లేని చాలా మంది భామ‌లు అర‌కొర‌క‌గానైనా చిన్న, మీడియం బ‌డ్జెట్ సినిమాల్లో ఛాన్సులు అందుకుంటున్నారు. ఐశ్వ‌ర్యా రాజేష్ పేరు ఆ జాబితాలో కూడా ఎక్క‌డా చ‌ర్చ‌కు రాలేదు. మ‌రి ఈ ద‌శ‌ను దాటి టాలీవుడ్ లో బిజీ అవుతుందా? వ‌చ్చిన అర‌వ అవ‌కాశాల‌తోనే సంతృప్తి ప‌డుతుందా? అన్న‌ది చూడాలి.

Tags:    

Similar News