సింపుల్ గ్లామ్, స్ట్రాంగ్ ప్రెజెన్స్… ఐశ్వర్య రాజేష్ మెరూన్ లుక్ వైరల్!
గత ఏడాది సంక్రాంతికి అనిల్ రావిపూడి, వెంకటేష్ కాంబినేషన్‌లో వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టి టాలీవుడ్‌లో ఫుల్ జోష్‌లో ఉంది టాలెంటెడ్ బ్యూటీ ఐశ్వర్య రాజేష్.
గత ఏడాది సంక్రాంతికి అనిల్ రావిపూడి, వెంకటేష్ కాంబినేషన్‌లో వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టి టాలీవుడ్‌లో ఫుల్ జోష్‌లో ఉంది టాలెంటెడ్ బ్యూటీ ఐశ్వర్య రాజేష్. కేవలం నటనతోనే కాకుండా, గ్లామర్ అండ్ స్టైలింగ్‌లోనూ తనకు సాటిలేరని నిరూపిస్తూ తాజాగా ఆమె వదిలిన ఒక ఫోటోషూట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. డీప్ మెరూన్ కలర్ అవుట్‌ఫిట్‌లో ఐశ్వర్య రాజేష్ ఒలికించిన రాయల్ లుక్ మరియు ఆమె కాన్ఫిడెంట్ అటిట్యూడ్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
మెరూన్ డ్రెస్‌లో మెరిసిపోతున్న ఐశ్వర్య:
ఈ సరికొత్త ఫోటోషూట్‌లో ఐశ్వర్య రాజేష్ వేసుకున్న డీప్ మెరూన్ కలర్ ఇండో-వెస్ట్రన్ ఫ్యూజన్ శారీ నెవర్ బిఫోర్ లుక్‌ని ఇస్తోంది. ఇక హౌస్ ఆఫ్ శ్లోక్ డిజైన్ చేసిన ఈ మోడ్రన్ ప్రీ డ్రేప్డ్ చీరలో ఐశ్వర్య రాజేష్ ఎంతో ఎలిగెంట్‌గా కనిపిస్తోంది. ఇక హై లెగ్ స్లిట్ ఉన్న రూచ్డ్ స్కర్ట్, దానికి మ్యాచింగ్ ప్రిపరేటరీ ట్యూబ్ లేదా కార్సెట్ బ్లౌజ్ ఆమె గ్లామర్‌ని మరింత ఎలివేట్ చేశాయి.
సాంప్రదాయానికి మోడ్రన్ టచ్:
ఈ అవుట్‌ఫిట్‌కి ప్రధాన ఆకర్షణగా నిలిచింది దాని పల్లు స్టైల్. భుజంపై నుండి కిందకు జాలువారుతున్న లాంగ్ షిఫాన్ జార్జెట్ ఫ్యాబ్రిక్ సాంప్రదాయ పల్లుకి ఒక మోడ్రన్ ట్విస్ట్ ఇచ్చింది. ఇక సెలబ్రిటీ స్టైలిస్ట్ బ్రహ్మమణి నాగ సాయి ఈ లుక్‌ని ఎంతో అద్భుతంగా ప్లాన్ చేయగా, ఫెనిల్ షా తన కెమెరా మాయాజాలంతో డ్రామాటిక్ లైటింగ్‌లో ఐశ్వర్యను ఒక పవర్‌హౌస్ పెర్ఫామర్‌లా బంధించారు.
ఫిదా అవుతున్న ఫ్యాన్స్:
ఈ ఫోటోలు బయటకు రాగానే సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తోంది. "సింపుల్ మేకప్, స్ట్రాంగ్ ప్రెజెన్స్... ఐశ్వర్య లుక్ అదిరిపోయింది", యాక్టింగ్‌లోనే కాదు స్టైలింగ్‌లోనూ క్వీన్అంటూ అభిమానులు క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఎక్కువ హంగామా లేని సింపుల్ గ్లామ్, కళ్ళలోనే పవర్‌ఫుల్ ఎక్స్‌ప్రెషన్స్ చూపించడంతో ఈ లుక్ మరింత వైరల్ అవుతోంది.
వైవిధ్యమైన పాత్రల కేరాఫ్ అడ్రస్:
'కాకా ముట్టై' సినిమాలో ఇద్దరు పిల్లల తల్లిగా నటించి తమిళనాడు స్టేట్ అవార్డ్ అందుకున్న ఐశ్వర్య, ఆ తర్వాత వడ చెన్నై, కనా చిత్రాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఇక ది గ్రేట్ ఇండియన్ కిచెన్, ఫర్హానా వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో భాషతో సంబంధం లేకుండా టాలెంట్ నిరూపించుకుంది. ఇక ప్రస్తుతం ఆమె చేతిలో 'ఓ సుకుమారి'తో పాటు పలు క్రేజీ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి.
ఆమె పాజిటివ్ మంత్రాన్ని తన అభిమానులతో పంచుకుంది.. ఇక మనకు అనుకూలంగానే అంతా జరుగుతుందని నమ్మి జీవించాలి అనే నమ్మే ఐశ్వర్య రాజేష్ సినీ ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం. 'సంక్రాంతికి వస్తున్నాం' సక్సెస్ ఇచ్చిన జోష్‌తో, రాబోయే సినిమాల ప్రమోషన్స్ కోసం చేసిన ఈ ఫోటోషూట్ ప్రస్తుతం ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. గ్లామర్, యాక్టింగ్ రెండింటినీ బ్యాలెన్స్ చేయగలనని ఐశ్వర్య మరోసారి ప్రూవ్ చేసింది.