పారిస్ ర్యాంప్‌పై ఐశ్వర్య రాయ్ రాయల్ వైబ్!
"వాక్ యువర్ వర్త్" థీమ్‌తో జరిగిన ఈ వేడుకలో ఐశ్వర్య తన అమేజింగ్ ప్రెజెన్స్‌తో మరోసారి గ్లోబల్ ఐకాన్‌గా నిలిచారు.
గ్లోబల్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ బచ్చన్ మరోసారి తన రాయల్ లుక్స్‌తో అంతర్జాతీయ వేదికపై మ్యాజిక్ చేసారు. పారిస్ ఫ్యాషన్ వీక్ 2026లో భాగంగా సెప్టెంబర్ 28న ఈఫిల్ టవర్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగిన లొరియల్ పారిస్ తొమ్మిదవ ఎడిషన్ 'లే డెఫిలే' షోలో ఆమె అద్భుతమైన వాక్‌తో అందరినీ అవారానపోయేలా చేశారు. "వాక్ యువర్ వర్త్" థీమ్‌తో జరిగిన ఈ వేడుకలో ఐశ్వర్య తన అమేజింగ్ ప్రెజెన్స్‌తో మరోసారి గ్లోబల్ ఐకాన్‌గా నిలిచారు.
యారా షూమేకర్ బ్లాక్ వెల్వెట్ డ్రెస్:
ఈసారి పారిస్ ర్యాంప్‌పై ఐశ్వర్య రాయ్ వెరైటీ లుక్‌తో మెరిశారు. ప్రముఖ డిజైనర్ యారా షూమేకర్ రూపొందించిన టూ-పీస్ బ్లాక్ వెల్వెట్ సిల్హౌట్ ఎన్సెంబుల్‌లో ఆమె ఒక క్వీన్‌లా దర్శనమిచ్చారు. దానికి తోడు కొత్తగా ట్రై చేసిన బర్గండీ-రెడ్ హెయిర్ కలర్ ఆమె స్టైలిష్ లుక్‌ను మరింత హైలైట్ చేసింది. ఆమె అద్భుతమైన నడక, రాజసం ఉట్టిపడే స్టైలింగ్ చూసి అభిమానులు ఫిదా అయిపోయారు. సోషల్ మీడియాలో "వన్స్ ఎ క్వీన్, ఫరెవర్ ఎ క్వీన్" అంటూ ఆమె ఫోటోలను విపరీతంగా ట్రెండ్ చేశారు.
అంతర్జాతీయ తారలతో కలిసి సందడి:
ఈ భారీ ఫ్యాషన్ ఈవెంట్‌లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది ప్రముఖ సెలబ్రిటీలు, లొరియల్ బ్రాండ్ అంబాసిడర్‌లు పాల్గొన్నారు. సూపర్‌మోడల్ కెండల్ జెన్నర్, 'బ్రిడ్జెర్టన్' నటి సిమోన్ యాష్లే, ఈవా లాంగోరియా, వయోలా డేవిస్, జాన్ ఫాండా మరియు ప్రముఖ గాయని సెలిన్ డియాన్ వంటి గ్లోబల్ స్టార్స్ ఈ ర్యాంప్‌ను పంచుకున్నారు. ఇక ఈ వేడుకలో ఐశ్వర్య అందరితో కలిసి సందడి చేయడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
సెలిన్ డియాన్‌తో హగ్ అండ్ డ్యాన్స్ మూమెంట్స్:
ఈ ఈవెంట్‌లో అత్యంత మధురమైన క్షణం.. ఐశ్వర్య రాయ్ మరియు ఇంటర్నేషనల్ సింగర్ సెలిన్ డియాన్ కలుసుకున్న సమయం. ఇద్దరూ ఆప్యాయంగా హగ్ చేసుకుని, చేతులు పట్టుకుని డ్యాన్స్ చేసిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. అలాగే బ్యాక్‌స్టేజ్‌లో నటి సిమోన్ యాష్లేతో ఐశ్వర్య ఆప్యాయంగా మాట్లాడిన రీ యూనియన్ మూమెంట్స్ కూడా అందరి మనసులను హత్తుకున్నాయి.
లొరియల్ పారిస్‌తో ఐశ్వర్య రాయ్ బచ్చన్‌కు ఉన్న సుదీర్ఘ అనుబంధం ఈ వేడుకతో మరోసారి రుజువైంది. పారిస్ ఫ్యాషన్ వీక్‌లో ఆమె ప్రదర్శించిన డ్రామాటిక్ కౌచర్, కొత్త హెయిర్ కలర్ మరియు క్లాసిక్ పోజ్ ఈవెనింగ్ మొత్తానికి హైలైట్‌గా నిలిచాయి. ఆన్‌లైన్‌లో వస్తున్న అద్భుతమైన స్పందన చూస్తుంటే, ఫ్యాషన్ ప్రపంచంలో ఐశ్వర్య 'క్వీన్ ఎరా' ఎప్పటికీ ఇలాగే కొనసాగుతుందని మరోసారి స్పష్టమైంది.