డైరెక్టర్ మిస్సింగ్..పోలీసుల్ని ఆశ్రయించిన వైఫ్
ప్రమాదం జరిగిన రోజు మహేష్ అహ్మదాబాద్‌లోని లా గార్డెన్‌లో ఒకరిని కలవడానికి వెళ్లాడని అతని భార్య హేతల్ చెబుతోంది.;

రీసెంట్‌గా అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం దేశ వ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపి 270 కుటుంబాల్ని చీకటి మయం చేసింది. ఎన్నో కుటుంబాన్ని తీరని శోకాన్ని నింపింది. ఈ ప్రమాదంలో వివిధ రంగాలకు చెందిన ఎంతో మంది ప్రాణాలు విడిచారు. ఎంతో మంది ఆశలు ఆవిరయ్యాయి. అయితే ఇదే ప్రమాదంలో మ్యూజిక్ ఆల్బమ్స్ డైరెక్టర్ మహేష్ జీరావాలా కూడా ప్రాణాలు కోల్పోయాడని, ఈ ప్రమాదం తరువాత అతను కనిపించకుండా పోయాడని అతని కుటుంబం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ప్రమాదం జరిగిన రోజు మహేష్ అహ్మదాబాద్‌లోని లా గార్డెన్‌లో ఒకరిని కలవడానికి వెళ్లాడని అతని భార్య హేతల్ చెబుతోంది. విమాన ప్రమాదం జరిగిన ప్రాంతానికి 700 మీటర్ల దూకరంలో అతడి ఫోన్ ఉన్నట్లు పోలీసులు గుర్తించడంతో మహేష్ ఫ్యామిలీ తీవ్ర ఆందోళనకు గురవుతోంది. దీంతో మహేష్ కుటుంబం నుంచి పోలీసులు డీఎన్ఏ నమూనాలను సేకరించారు. ఈ సందర్భంగా మహేష్ వైఫ్ చెప్పిన విషయాలు షాక్‌కు గురి చేస్తున్నాయి. `నా భర్త గురువారంమధ్యాహ్నం 1:14కు ఫోన్ చేసి మీటింగ్ అయిపోయిందని ఇంటికి బయల్దేరుతున్నట్టు చెప్పాడు.
ఎంతసేపటికి తను ఇంటికి రాకపోవడంతో ఫోన్ చేశాను. స్విచ్ ఆఫ్ వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాను. విమాన ప్రమాదం జరిగిన 700 మీటర్ల దూరంలో ఆయన ఫోన్‌ను గుర్తించారు. దీంతో ఈ ప్రమాదంలో మహేష్ కూడా చనిపోయాడేమోనని పోలీసులు మా కుటుంబ సభ్యుల నుంచి డీఎన్ఏ నమూనాలని సేకరించారు. అతడు ఎప్పుడూ ఆ మార్గంలో ఇంటికి రాడు. దురదృష్టవశాత్తు ఆ రోజు తను ఆ మార్గాన్ని ఎంచుకున్నాడేమో` అని మహేష్ భార్య హేతల్ ఆవేదన వ్యక్తం చేసింది.
నరోదాకు చెందిన మహేష్ జీరావాలా అసలు పేరు మహేష్ కలవాడియా. మ్యూజిక్ ఆల్బమ్స్‌కు దర్శకత్వం వహించిన ఆయన ప్రేక్షకుల్లో మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు. జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిని విమానం టేకాఫ్ అయిన కాసేపటికే జనావాసాల్లో కూలి ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ప్రయాణికులతో పాటు మెడికల్ హాస్టల్ విద్యార్థులు అంతా కలిపి 270 మంది మృత్యువాత పడ్డారు.