ఒక్క వీడియోతో సంచలనం సృష్టించిన సైయారా నటుడు.. అసహ్యించుకుంటున్న ఫ్యాన్స్!

మరి ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే .. అహాన్ పాండే తూర్పు ఆసియాకి వెకేషన్ కి వెళ్ళినట్టు తెలుస్తోంది.;

Update: 2025-08-07 06:52 GMT

ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే సోదరుడు అహాన్ పాండే, అనిత్ పద్దా హీరో హీరోయిన్లుగా వచ్చిన తాజా చిత్రం సైయారా. కొత్త నటీనటులతో తెరకెక్కిన ఈ సినిమా ఊహించని విజయాన్ని సొంతం చేసుకొని యువతను బాగా ఆకర్షించింది. ఈ సినిమాని థియేటర్లో చూసిన చాలా మంది యూత్ కన్నీళ్లు పెట్టుకున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే ఇందులో నటించిన హీరో హీరోయిన్ కి ఇది మొదటి సినిమానే అయినప్పటికీ చాలా అద్భుతంగా నటించి, ఒకే ఒక్క మూవీతో ఓవర్ నైట్ లో స్టార్స్ అయిపోయారు.

అయితే సినిమాల ద్వారా పాపులర్ అయ్యాక వారికి సంబంధించిన గత విషయాలు ఎన్నో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. అలా తాజాగా సైయారా మూవీ ద్వారా ఫేమస్ అయినా అహాన్ పాండేకి సంబంధించి ఓ షాకింగ్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ముఖ్యంగా ఈ వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు అహాన్ పాండేని చూసి అసహ్యించుకుంటుంటే.. కొంతమంది నెటిజన్స్ మాత్రం ఇతడి ధైర్యానికి ఫిదా అవుతున్నారు.

మరి ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే .. అహాన్ పాండే తూర్పు ఆసియాకి వెకేషన్ కి వెళ్ళినట్టు తెలుస్తోంది. అయితే ఆ వెకేషన్ లో అక్కడ ఫేమస్ అయిన ఫుడ్ కూడా తిన్నారు. అంతేకాదు అందుకు సంబంధించిన వీడియో ని కూడా అభిమానులతో షేర్ చేసుకోవడం జరిగింది. ఇక ఆ వీడియోలో అహాన్ తిన్న ఫుడ్ ఏంటంటే.. విషపూరితమైన తేళ్లని అహాన్ పాండే తింటున్నట్టు ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే కొంతమంది ఈ వీడియోని చూసి ఆ తేళ్లు బతికే ఉన్నాయని అంటే, మరికొంతమంది లేదు లేదు నూనెలో ఫ్రై చేసి పెట్టారు అంటూ మాట్లాడుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికి అహాన్ పాండేకి సంబంధించి తేలు తింటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చాలామంది ఆయన్ని అసహ్యించుకుంటున్నారు.

మరికొంతమంది అహాన్ పాండే చేసిన పనిని మెచ్చుకుంటున్నారు. ఆయన వెకేషన్ కి వెళ్ళిన దగ్గర స్థానిక వంటలను తినడానికి ప్రయత్నించారు. ఇందులో ఆయన్ని తప్పు పట్టడానికి ఏముంది. ఎవరి ఇష్టం వారిది.అతను ఇతరుల సంస్కృతిని కూడా గౌరవిస్తున్నారు. అక్కడి ఆహార పదార్థాలను తినడానికి ప్రయత్నించారు. ఇందులో తప్పుగా అర్థం చేసుకోవాల్సింది ఏమీ లేదు.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.అలా కొంతమంది విమర్శిస్తే మరి కొంత మంది సపోర్ట్ చేస్తున్నారు. మరి కొంతమంది అయితే ఏకంగా సైయారా సినిమాలో నటించి ఫేమస్ అయ్యాడు.కానీ అతను తేళ్లు తినేవాడు అంటూ ఎగతాళిగా కామెంట్లు చేస్తున్నారు.

సాధారణంగా ఫుడ్ విషయంలో ఎవరి అభిప్రాయాలు వాళ్లకు ఉంటాయి. ప్రతి ఒక్కరూ అందరి అభిప్రాయాలను గౌరవించాలన్న రూలేమీ లేదు.. ఎవరికి నచ్చింది వాళ్ళు తింటారు. అలా అహాన్ పాండే కూడా నచ్చింది తిన్నాడు ఇందులో తప్పేముంది అని కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. మొత్తానికైతే ఆ సినిమాతోనే కాదు ఇప్పుడు ఈ వీడియోతో కూడా భారీ పాపులారిటీ అందుకున్నారు అహాన్ పాండే.

Tags:    

Similar News