పొలిశెట్టి హిట్ మూవీకి సీక్వెల్..!
ఇన్వెస్టిగేషన్ డ్రామాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుంది. హిట్ ప్రాంచైజీలో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.;
నవీన్ పొలిశెట్టిని నటుడిగా ఇండస్ట్రీకి, ప్రేక్షకులకు పరిచయం చేసిన సినిమా 'ఏజెంట్ సాయి శ్రీనివాస'. ఈ సినిమా కేవలం రూ.1 కోటి బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమా వరల్డ్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.20 కోట్ల వసూళ్లు నమోదు చేసిందని సమాచారం. నవీన్ పొలిశెట్టిలోని కామెడీ యాంగిల్‌తో పాటు, ఎమోషన్‌ను చక్కగా చూపించిన ఈ సినిమాలో హీరోయిన్‌గా శృతి శర్మ నటించిన విషయం తెల్సిందే. స్వరూప్ ఆర్‌ఎస్‌జే దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి ఒక ప్రైవేట్ డిటెక్టివ్ పాత్రలో కనిపించాడు. విభిన్నమైన కథ, కథనంతో ఈ సినిమా రూపొందించారు. ఈ సినిమా యూఎస్‌లో కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
ఈ మధ్య కాలంలో సూపర్ హిట్ సినిమాలకు సీక్వెల్స్ రావడం ట్రెండ్‌గా మారింది. అందుకే ఈ సినిమాకు కూడా సీక్వెల్‌ను రూపొందించే పనిలో ఉన్నారట. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సీక్వెల్ కోసం స్టోరీ లైన్‌ను సిద్ధం చేశారని, ప్రస్తుతం పూర్తి స్థాయి కథను డెవలప్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నవీన్ పొలిశెట్టి ఇప్పటికే సీక్వెల్‌కి ఓకే చెప్పడం జరిగింది. స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయిన తర్వాత అధికారికంగా ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మొదటి పార్ట్‌లో నటించిన నటీనటులు పలువురు సెకండ్ పార్ట్‌లో నటించబోతున్నారు. మొదటి పార్ట్‌తో పోల్చితే సెకండ్ పార్ట్ బడ్జెట్‌ను భారీగా పెంచబోతున్నారని తెలుస్తోంది.
ఇన్వెస్టిగేషన్ డ్రామాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుంది. హిట్ ప్రాంచైజీలో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అందుకే ఈ సినిమా కూడా తప్పకుండా మంచి విజయాన్ని సొంతం చేసుకునే విధంగా చక్కటి ఇన్వెస్టిగేషన్ కథను రెడీ చేయాలని భావిస్తున్నారు. నవీన్ పొలిశెట్టికి మంచి క్రేజ్ ఉంది. ఆ క్రేజ్‌కు తగ్గట్లుగా యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ సబ్జెక్ట్‌ను రెడీ చేయాలని భావిస్తున్నారు. అతి త్వరలోనే సినిమాను అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. నవీన్ పొలిశెట్టి ప్రస్తుతం అనగనగా ఒక రాజు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.
సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో రూపొందుతున్న ఆ సినిమాలో హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి నటిస్తోంది. ఈ ఏడాదిలోనే ఆ సినిమా విడుదల కాబోతుంది. ఆ సినిమా తర్వాత నవీన్ పొలిశెట్టి నటించబోతున్న తదుపరి సినిమా ఏంటి అనే విషయమై క్లారిటీ రాలేదు. ఇలాంటి సమయంలో ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సీక్వెల్ గురించి పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ ఏడాదిలో సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లి, వచ్చే ఏడాదిలో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. హిట్ సినిమాల సీక్వెల్స్‌కి ఖచ్చితంగా క్రేజ్ ఉంటుంది. కనుక ఆ క్రేజ్‌ను ఉపయోగించుకుని ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా చేసుకునే అవకాశం ఉంది. కనుక బడ్జెట్ విషయంలో నిర్మాతలు వెనక్కి తగ్గక పోవచ్చు.