తెలివిగా ఎస్కేప్ అయిన సంచ‌ల‌న డైరెక్ట‌ర్!

దర్శకుడు ఆదిత్య ధర్ తెర‌కెక్కించిన `ధురంధర్ ` రెండు భాగాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి విజ‌యాన్ని న‌మోదు చేసాయో తెలిసిందే.

Update: 2026-06-10 15:30 GMT

దర్శకుడు ఆదిత్య ధర్ తెర‌కెక్కించిన `ధురంధర్ ` రెండు భాగాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి విజ‌యాన్ని న‌మోదు చేసాయో తెలిసిందే. రెండు భాగాలు క‌లిపి 3000 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు సాధించి ఇండియ‌న్ బాక్సాఫీస్ వ‌ద్ద స‌రికొత్త రికార్డును న‌మోదు చేసాయి. వాస్త‌వ సంఘ‌ట‌న‌లు...పాకిస్తాన్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన స్పై థ్రిల్ంల‌ర్ కి ఫిదాకాని ప్రేక్ష‌కులు లేరు. చివ‌రికి శ‌త్రు దేశం పాకిస్తాన్ సైతం మెచ్చిన చిత్రంగా నిలిచింది. అయితే చిత్రంలోని కొన్ని తొలగించిన సన్నివేశాలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

ముఖ్యంగా ఈ చిత్రానికి సంబంధించిన అన్‌కట్ వర్షన్ గురించిన వివరాలు బయటకు రావడంతో పొలిటికల్ - హిస్టారికల్ కోణాల్లో సినిమా సృష్టించిన సంచలనం మరోసారి తెరపైకి వచ్చింది. ఒక నిర్దిష్ట వర్గాన్ని లేదా చారిత్రక ఘట్టాలను వివాదాస్పదంగా చూపించారనే విమర్శలపై చిత్ర బృందం స్పందించింది. ఈ చిత్రంలో 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లు -ఖలిస్తాన్ ఉద్యమ నేపథ్యానికి సంబంధించిన కొన్ని సున్నితమైన సంభాషణలు, సన్నివేశాలు ఉన్నాయంటూ ప్రచారం సాగింది. అయితే సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకూడదనే ఉద్దేశంతో , ప్రేక్షకుల సెంటిమెంట్లను గౌరవిస్తూ దర్శకుడు ఆదిత్య ధర్ ఆ వివాదాస్పద పంక్తులను ముందే తొలగించినట్లు తెలుస్తోంది.

చరిత్రలోని చేదు నిజాలను సినిమాటిక్ డ్రామా కోసం వాడుకోకుండా బాధ్యతాయుతమైన సినిమాగా దీనిని మలిచేందుకు స్క్రిప్ట్ దశలోనే పలు మార్పులు చేశారు. కథానాయకుడు రణ్‌వీర్ సింగ్ పోషించిన `జస్కిరత్ సింగ్ రంగీ` (హంజా) పాత్ర చుట్టూ అల్లబడిన ఈ కథలో పంజాబ్ రాజకీయాలు , సరిహద్దు ఉగ్రవాదం వంటి అంశాలను స్పృశించారు. కథ డిమాండ్ మేరకు కొన్ని సున్నితమైన చారిత్రక ప్రస్తావనలు ఉన్నప్పటికీ ఎక్కడా ప్రచార చిత్రంగా మారకుండా కేవలం ఒక స్పై థ్రిల్లర్‌గా నిలబెట్టేందుకే ప్రాధాన్యత ఇచ్చామని పరిశోధక బృందం స్పష్టం చేసింది.

సినిమా చూసే ప్రతి ఒక్కరికీ ఇది దేశభక్తిని, గూఢచారుల త్యాగాలను గుర్తుచేస్తుందే తప్ప ఏ వర్గాన్ని తక్కువ చేసి చూపించదని విశ్లేషించారు. ఇదే సమయంలో సోషల్ మీడియాలో రణ్‌వీర్ సింగ్ సిక్కు సంప్రదాయ పద్ధతిలో తలపాగా ధరించి ధూమపానం చేస్తున్నట్లు ఉన్న పోస్టర్ తీవ్ర వివాదానికి దారితీసింది. దీనిపై సిక్కు సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ముంబై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాయి. అయితే దీనిపై దర్శకుడు ఆదిత్య ధర్ తక్షణమే స్పందించారు. చిత్రం పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించబడిన నకిలీ పోస్టర్ అని తేల్చిచెప్పారు.

సినిమా ప్రమోషన్ల కోసం తాము అలాంటి చౌకబారు పద్ధతులను వాడలేదని.. సిక్కు సమాజం పట్ల తమకు అత్యున్నత గౌరవం ఉందని ప్రకటించారు. మొత్తంగా భారతదేశ సరిహద్దు భద్రత, గూఢచారుల జీవితాల్లోని అజ్ఞాత కోణాలను ఆవిష్కరించడంలో బాలీవుడ్ ఇటీవల కాలంలో సరికొత్త ధోరణిని అవలంబిస్తోంది. సమాజంలోని భిన్న వర్గాల భావోద్వేగాలను గాయ పరచకుండా.. వివాదాస్పద రాజకీయ కోణాలను సున్నితంగా హ్యాండిల్ చేయడంలో ద‌ర్శ‌కులు ఎంతో పరిణతితో వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

Tags:    

Similar News