ఆదిత్య 999.. ఆయన తప్ప ఇంకెవరు..?

ఆదిత్య 369 సీక్వల్ గా ఆదిత్య 999 ఉంటుందని నందమూరి బాలకృష్ణ అనౌన్స్ చేశారు.;

Update: 2025-09-15 10:30 GMT

ఆదిత్య 369 సీక్వల్ గా ఆదిత్య 999 ఉంటుందని నందమూరి బాలకృష్ణ అనౌన్స్ చేశారు. ఆయన డ్రీం ప్రాజెక్ట్స్ లో ఒకటైన ఈ సినిమా విషయంలో ప్రతిదీ కాస్త సస్పెన్స్ గా కొనసాగుతుంది. ముందు ఈ సినిమాను బాలయ్యే డైరెక్ట్ చేస్తాడని అన్నారు. ఆల్రెడీ బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేసినట్టు టాక్ వచ్చింది. ఐతే రీసెంట్ గా ఆ సినిమాను క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్ లో చేసేలా ప్లాన్ ఉందని వార్తలు వచ్చాయి. దాదాపు అదే కన్ ఫర్మ్ అనుకున్నారు. క్రిష్ తో ఆల్రెడీ బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ చేశాడు. రెండు భాగాలుగా వచ్చిన ఆ సినిమాలు ప్రేక్షకులను అలరించలేదు.

అనుష్క ఘాటి డిజాస్టర్..

అయినా సరే క్రిష్ కి ఆదిత్య 999 దర్శకత్వ బాధ్యతలను అప్పచెప్పాలని అనుకున్నారు బాలయ్య. ఐతే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ హరి హర వీరంల్లు, ఘాటి క్రిష్ డైరెక్ట్ చేసిన రెండు సినిమాలు ఫెయిల్ అయ్యాయి. వీరమల్లు సినిమాలో ఆయన చేసిన పోర్షన్ తక్కువే అది పార్ట్ 2లో ఉంటుందని అంటున్నారు. ఐతే తానే మొత్తం బాధ్యత తీసుకుని అనుష్కతో చేసిన ఘాటి డిజాస్టర్ అయ్యింది. ఘాటి రిజల్ట్ చూశాక కూడా క్రిష్ కి ఆదిత్య 999 ఛాన్స్ ని బాలకృష్ణ ఇస్తాడా అన్న డౌట్ మొదలైంది.

ఐతే ఫైనల్ గా మరోసారి రూమర్స్ కి చెక్ పెట్టేలా ఆదిత్య 999 కచ్చితంగా క్రిష్ డైరెక్షన్ లోనే ఉంటుందని అంటున్నారు. క్రిష్ ఆల్రెడీ ఆ సీక్వెల్ పనుల్లో ఇన్వాల్వ్ అయ్యారట. త్వరలోనే ఈ సినిమా అనౌన్స్ మెంట్ వస్తుందని టాక్. క్రిష్ డైరెక్షన్ లో వచ్చిన సినిమాలు రీసెంట్ గా ఫెయిల్యూర్స్ అయ్యాయి. అయినంత మాత్రానా అతని పని అయిపోయిందని కాదు. అందుకే బాలయ్య అతని మీద హోప్స్ పెట్టుకున్నారట.

ఈ సినిమాతో మోక్షజ్ఞ తెరంగేట్రం..

బాలకృష్ణ, క్రిష్ కాంబినేషన్ లో రాబోతున్న ఆదిత్య 999 సినిమా ఆశించిన స్థాయిలో ఉంటుందా లేదా అన్నది చూడాలి. ఈ సినిమా కాస్టింగ్ విషయంలో కూడా బాలకృష్ణ భారీ ప్లానింగ్ లో ఉన్నారట. అంతేకాదు నందమూరి వారసుడు మోక్షజ్ఞ కూడా ఈ సినిమాతో తెరంగేట్రం చేస్తారన్న టాక్ వినిపిస్తుంది.

బాలకృష్ణ చేస్తున్న అఖండ 2 డిసెంబర్ రిలీజ్ అంటున్నారు. ఆ సినిమా తర్వాత గోపీచంద్ తో కూడా ఒక ప్రాజెక్ట్ లైన్ చేస్తున్నారు. సో ఆదిత్య 999 తో పాటుగా బాలకృష్ణ గోపీచంద్ సినిమా కూడా ఒకేసారి సెట్స్ మీదకు వెళ్లనున్నాయి. ఆదిత్య 999 సీక్వెల్ అయితే కాస్త టైం పడుతుందేమో కానీ గోపీచంద్ సినిమా మాత్రం నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ రిలీజ్ ఉండే ఛాన్స్ కనిపిస్తుంది.

Tags:    

Similar News