తమ్ము జిగేల్ గ్లామర్.. స్టన్నింగ్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా రాణించిన వారిలో తమన్నా కూడా ఒకరు. ప్రస్తుతం తమన్నా మంచి జోరు మీద ఉంది

Update: 2023-09-01 10:36 GMT

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా రాణించిన వారిలో తమన్నా కూడా ఒకరు. ప్రస్తుతం తమన్నా మంచి జోరు మీద ఉంది. ఒకప్పుడు స్టార్ హీరోలందరితో నటించి మెప్పించిన ఈ బ్యూటీ ప్రస్తుతం తన దృష్టి మొత్తం వెబ్ సిరీస్ లపై పెట్టింది. ఓ వైపు సినిమాలు చేస్తూనే, మరో వైపు వెబ్ సిరీస్ లలో అవకాశాలు చేజిక్కించుకుంటోంది. ఇప్పటికే వరసగా రెండు వెబ్ సిరీస్ లలో మెరిసింది. రెండింటిలోనూ తన నటనతో,బోల్డ్ సీన్స్ తో ఆకట్టుకుంది. రీసెంట్ గా ‘ఆఖరి సచ్’ అనే వెబ్ సీరస్ లో నటిస్తోంది. ఇందులో పోలీస్ అధికారి పాత్రలో కనిపిస్తోంది.


కాగా, తమన్నా తాజాగా ఎయిర్ పోర్టులో కనిపించింది. రీసెంట్ గా తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి మాల్దీవులు ట్రిప్ కి వెళ్లింది. ఆ ట్రిప్ లో బికినీలో మెరిసి మైమరిపించింది. ఇప్పుడు ఆ ట్రిప్ పూర్తి చేసుకొని భారత్ కి వచ్చేసింది. అయితే, ట్రిప్ పూర్తయినా, ఆమె ఆ మూడ్ నుంచి ఇంకా బయటకు వచ్చినట్లు కనపడటం లేదు.

మెరున్ కలర్ బికినీ టైమ్ డ్రెస్ వేసింది. కింద ప్లాజో ధరించింది, పైన ఓవర్ ఓట్ కోట్ ధరించింది. ఈ డ్రెస్ లోనూ తమన్నా చాలా అందంగా కనపడుతుంది. కాగా, ట్రిప్ ఎలా జరిగింది అంటూ మీడియా వాళ్లు అడగగా, బాగా జరిగిందని సమాధానం చెప్పింది. ఇక, మాల్దీవ్స్ ట్రిప్ లో ఫోటోల్లో మీరు చాలా అందంగా కనపడుతున్నారంటూ చెప్పగా థాంక్యూ అంటూ ఫ్లైయింగ్ కిస్ ఇచ్చింది.

Read more!

ఇదిలా ఉండగా, ఇటీవల తమన్నా జైలర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. రజినీకాంత్ హీరోగా నటించిన ఈ సినిమాలో కావాలయ్యా అంటూ సాంగ్ లో మెరిసింది. పాట బాగా క్లిక్ అయ్యింది. తమన్నా అందాలకు అందరూ ఫిదా అయిపోయారు. దీంతో పాటు, చిరంజీవితో కలిసి భోళాశంకర్ లోనూ మెరిసింది. అయితే, ఆ సినిమా అనుకున్నంత క్లిక్ కాలేదు.

ప్రస్తుతం తమన్నా ఎలాంటి సినిమాలు చేయడం లేదు. ఆఖరి సోచ్ అనే వెబ్ సిరీస్ మాత్రమే ఆమె చేతిలో ఉంది. ఈ వెబ్ సిరీస్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్ కాగా, రియల్ ఎన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కించడం విశేషం.

Tags:    

Similar News