రాబోయే ఏడాది పాటు శ్రీలీల బొమ్మలే బొమ్మలు

పెళ్లి సందడి సినిమా తో టాలీవుడ్ లో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ శ్రీ లీల.. ఆ సినిమా తో నిరాశ పరిచిన కూడా అదృష్టం కొద్ది టాలీవుడ్ లో వరుస ఆఫర్లు దక్కించుకుంది.;

Update: 2023-09-16 03:55 GMT

పెళ్లి సందడి సినిమా తో టాలీవుడ్ లో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ శ్రీ లీల.. ఆ సినిమా తో నిరాశ పరిచిన కూడా అదృష్టం కొద్ది టాలీవుడ్ లో వరుస ఆఫర్లు దక్కించుకుంది. ముఖ్యంగా రవితేజ తో నటించిన ధమాకా సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యం లో ఈ ముద్దుగుమ్మ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు అన్నట్లుగా దూసుకు పోతుంది.

ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో దాదాపుగా పది సినిమాలు ఉన్నాయి. వాటిల్లో మూడు నాలుగు సినిమాలు షూటింగ్ దాదాపుగా పూర్తి అవ్వగా రెండు మూడు సినిమాలు షూటింగ్ మధ్యలో ఉన్నాయి. ఇంకా కొన్ని చర్చల దశలో ఉన్నాయి. మొత్తానికి శ్రీ లీల ప్రస్తుతం టాలీవుడ్ లో అత్యధిక సినిమాలు చేస్తున్న హీరోయిన్ గా ఉంది అనడంలో సందేహం లేదు.

ఈ నెల చివరి నుండి శ్రీ లీల సినిమా ల సందడి మొదలు అవ్వబోతుంది. స్కంద సినిమాలో రామ్‌ కు జోడీగా నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమా విడుదలకు రెడీ గా ఉంది. ఆ సినిమా తో మొదలుకుని వచ్చే నెలలో బాలకృష్ణ మూవీ భగవంత్ కేసరి సినిమాతో రాబోతుంది. ఆ తర్వాత ఆదికేశవ ఇలా చాలా సినిమాలతో వచ్చే ఏడాది చివరి వరకు కూడా శ్రీలీల నటించిన సినిమాలు రాబోతున్నాయి.

ఈ సినిమాల్లో రెండు మూడు సినిమాలు సక్సెస్‌ అయినా కూడా ఈమె క్రేజ్ రెట్టింపు అవ్వడం ఖాయం. అంతే కాకుండా స్టార్‌ హీరోలకు మరింత మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ గా మారడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మహేష్ బాబుతో కలిసి నటిస్తున్న గుంటూరు కారం సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రాబోతుంది, పవన్ కళ్యాణ్ తో నటిస్తున్న ఉస్తాద్ సినిమా కూడా వచ్చే ఏడాది రాబోతుంది. ఈ రెండు సినిమాలపై శ్రీలీల అభిమానులు చాలా ఆశలే పెట్టుకున్నారు. ఈ రెండు హిట్స్ గా నిలిస్తే ముందు ముందు చరణ్‌, ఎన్టీఆర్‌ లు కూడా ఈమెతో జత కట్టే అవకాశాలు లేకపోలేదు.

Tags:    

Similar News