శ్రీలీలకు ఓ టెన్షన్ పోయినట్లే..
తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం ది మోస్ట్ బిజీయెస్ హీరోయిన్, వాంటెడ్ హీరోయిన్, గ్లామరస్ హీరోయిన్, ఎనర్జిటిక్ హీరోయిన్, డ్యాన్స్ హీరోయిన్ అంటే టక్కున ఏం ఆలోచించకుండా చెప్పే పేరు శ్రీలీల.;
తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం ది మోస్ట్ బిజీయెస్ హీరోయిన్, వాంటెడ్ హీరోయిన్, గ్లామరస్ హీరోయిన్, ఎనర్జిటిక్ హీరోయిన్, డ్యాన్స్ హీరోయిన్ అంటే టక్కున ఏం ఆలోచించకుండా చెప్పే పేరు శ్రీలీల. చేసింది రెండు చిత్రాలే అయినా.. యంగ్ హీరోస్, డైరెక్టర్స్ నుంచి స్టార్ కథానాయకులు, దర్శకనిర్మాతల వరకు ఆమె డేట్స్ కోసమే పడిగాపులు కాసే రేంజ్‌కు ఎదిగిపోయింది. ఒకేసారి దాదాపు పది సినిమాలను ఒప్పుకుని ఖాళీ లేకుండా షూటింగ్లలో పాల్గొంటోంది.
అయితే ఇప్పుడామెకు కాస్త విశ్రాంతి దొరికే అవకాశం కనిపించేటట్టుంది. ఈ ఏడాదే ఆమె నటించిన మూడు చిత్రాల వరకు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. నాలుగు సినిమాల వరకు షూటింగ్ పూర్తి చేసిందట. రామ్‌పోతినేనితో చేసిన 'స్కంద', పంజా వైష్ణవ్ తేజ్‌తో చేసిన 'ఆదికేశవ'.. సినిమాల షూటింగ్ మొత్తం పూర్తి అయిపోయింది.
ఈ నెల 28న 'స్కంద' రిలీజ్ కానుండగా.. ఇక వచ్చే నెలలో శ్రీలీల నటించిన 'భగవంత్ కేసరి' విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాకి సంబంధించి కేవలం 5, 6 రోజుల పని మాత్రమే మిగిలి ఉందని తెలిసింది. ఇక 'ఆదికేశవ' చిత్రీకరణ ఇప్పటికే పూర్తై పోయింది. ఈ చిత్రం నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక ఈ ఏడాది డిసెంబర్లో నితిన్-శ్రీలీల కలిసి నటిస్తున్న ఎక్సట్రా రిలీజ్ కానుంది. దీనికి సంబంధించి కూడా కొంత పనే మిగిలి ఉందట. కాబట్టి.. మరి కొన్ని రోజుల్లో ఈ నాలుగు చిత్రాలకి సంబంధించిన ఒత్తిడి, పని భారం ఆమెకు తగ్గిపోయినట్టే. ఇక ఆమె సూపర్ స్టార్ మహేశ్ బాబుతో 'గుంటూరు కారం', పవన్ కల్యాణ్‌తో 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రాల షూటింగ్‌పై దృష్టి పెట్టి కాస్త ప్రశాంతంగా చేసుకోవచ్చు.
అయితే ఇంకా శ్రీలల చేతిలో పలు చిత్రాలు ఉన్నాయి. రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి ఓ సినిమా చేస్తోంది. ఇంకా దీంతో పాటే అనగనగ ఒక రాజు అనే చిత్రంలోనూ నటిస్తోంది. ఈ రెండు సినిమాలు ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. ఇవి కూడా వచ్చే ఏడాది రిలీజ్ కానున్నాయి.