• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సాక్షి వైద్య.. టాలెంట్​,...

సాక్షి వైద్య.. టాలెంట్​, గ్లామర్​ ఓకే.. కానీ లక్కే..

| ఇక ఈ వరుస ఫ్లాప్​లు అందుకోవడంతో మూవీలవర్స్​ ఆమె సజెషన్స్ చేస్తున్నారు. కథల ఎంపికలో జాగ్రత్తగా ఉండమంటూ చెబుతున్నారు.

By - Tupaki Desk
Update: 2023-08-27 11:10 GMT

ప్రతి హీరోయిన్ చిత్రసీమలోకి కోటి ఆశలతోనే అడుగు పెడుతుంది. తమ మొదటి సినిమా భారీ హిట్ సాధించాలనే ఆశ పడుతుంది. కానీ అది అందరికీ వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే గ్లామర్​, యాక్టింగ్ టాలెంట్​ మాత్రమే సరిపోదు. కూస్తంత అదృష్టం కూడా ఉండాలి. అప్పుడే వారికి సక్సెస్​లు క్యూ కడతాయి. లేదంటే మొదట్లో రెండు మూడు అవకాశాలు వచ్చినా తర్వాత ఫేడ్ ఔట్ అవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

అయితే ఇప్పుడు హీరోయిన్​ సాక్షి వైద్య పరిస్థితి ఇలా లేదు కానీ.. స్టార్టింగ్ స్టేజ్​లో ఉంది. ఈమె ఎన్నో ఆశలతో అఖిల్ అక్కినేని 'ఏజెంట్' సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. భారీ బడ్జెట్​, అంచనాలతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్​గా నిలిచింది.

'ఏజెంట్' ఫ్లాప్ అయినా ఆమె రెండో సినిమా కూడా భారీ బడ్జెట్​తోనే రూపొందింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన 'గాంఢీవధారి అర్జున' సినిమాలో కథానాయికగా నటించింది. ఈ సినిమాపై ఆమె బోలెడన్నీ ఆశలు పెట్టుకుంది. కానీ ఇప్పుడా చిత్రం తాజాగా విడుదలై బాక్సాఫీస్​ వద్ద బోల్తా కొట్టింది. ఆమెకు నిరాశనే మిగిల్చింది. దీంతో ఆమె ఖాతాలో బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్​లు పడ్డాయి.

ఇక ఈ వరుస ఫ్లాప్​లు అందుకోవడంతో మూవీలవర్స్​ ఆమె సజెషన్స్ చేస్తున్నారు. కథల ఎంపికలో జాగ్రత్తగా ఉండమంటూ చెబుతున్నారు. లేదంటే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అంటున్నారు. అయితే ఇప్పుడామె చేతిలో కూడా పలు ప్రాజెక్ట్​లు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్ట్‌ ఉస్తాద్‌ భగత్‌ సింగ్​లో ఆమె ఓ ఛాన్స్ అందుకున్నట్లు ప్రచారం సాగుతోంది.

ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ సినిమాలో శ్రీలీల మెయిన్ హీరోయిన్​గా నటిస్తుండగా.. సాక్షి వైద్యను సెకండ్‌ హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు అంటున్నారు. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. ఏదీ ఏమైనా.. సాక్షి ఇకపై కథల ఎంపికలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముంది. చూడాలి మరి ఆమె ఫేట్​ ఎలా ఉందో? ఎలాంటి కథలతో ఇకపై ఆడియెన్స్​ ముందుకు వస్తుందో.

Tags:    
  • Tollywood 
  • Youngbeauty 
  • Sakshivadiya 
  • Agent 
  • Gandeevadhariarjuna 
  • Movies 
  • Ustadbhagatsingh 

Similar News

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

AK 47 : ఆ కఠినమైన పని చేయడం అంత సులువు కాదు గురూజీ..!

2026-11-04 17:44 GMT

రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...

2026-11-04 17:30 GMT

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

Copyright @2026

Powered by Blink CMS