• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సాయి పల్లవి ఓకే చెప్పింది...

సాయి పల్లవి ఓకే చెప్పింది అంటే..!

| అందుకే సాయి పల్లవి నెక్స్ట్ సినిమాకు టైం తీసుకుంది. ఫైనల్ గా కమల్ హాసన్ నిర్మిస్తున్న సినిమాలో శివ కార్తికేయన్ తో జత కడుతుంది అమ్మడు

By - Tupaki Desk
Update: 2023-08-12 02:45 GMT

ప్రేమం సినిమాలో మలార్ పాత్రలో తన నటనతో సౌత్ ఆడియన్స్ మనసులు గెలిచిన సాయి పల్లవి తెలుగులో శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన ఫిదా సినిమాతో అదరగొట్టేసింది. ఆ సినిమా నుంచి తెలుగులో సాయి పల్లవి సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఆమె సినిమాలో ఉంది అంటే సినిమా సంథింగ్ స్పెషల్ అన్న ఇమేజ్ తెచ్చుకుంది. ప్రాధాన్యత ఉన్న పాత్రలనే చేస్తూ వస్తున్న సాయి పల్లవి లాస్ట్ ఇయర్ రానా విరాట పర్వం, గార్గి సినిమాలు చేసింది. ఆ సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.

అందుకే సాయి పల్లవి నెక్స్ట్ సినిమాకు టైం తీసుకుంది. ఫైనల్ గా కమల్ హాసన్ నిర్మిస్తున్న సినిమాలో శివ కార్తికేయన్ తో జత కడుతుంది అమ్మడు. ఈ సినిమా తో పాటుగా నాగ చైతన్య చందు మొండేటి కాంబోలో వస్తున్న సినిమాలో కూడా సాయి పల్లవి ఛాన్స్ అందుకుంది. ఈ రెండు సినిమాల తో మళ్లీ తిరిగి ఫాం లోకి రావాలని చూస్తుంది సాయి పల్లవి. సాయి పల్లవి సినిమాకు సైన్ చేసింది అంటే ఆ సినిమా డిఫరెంట్ గా ఉంటుందని ఆమె ఫ్యాన్స్ భావిస్తారు.

కోలీవుడ్ లో వెరైటీ కథలతో వస్తున్న శివ కార్తికేయన్ తో ఆమె జత కడుతుంది. మరోపక్క నాగ చైతన్య సినిమాలో నటిస్తుంది. రెండు సినిమాలతో సాయి పల్లవి పాత్రకు వెయిట్ ఉంటుందని చెప్పొచ్చు. ఇదే కాదు ఇక కెరీర్ లో గ్యాప్ తీసుకునేది లేదని డిసైడ్ అయ్యిందట సాయి పల్లవి. ప్రస్తుతం కమిటైన ఈ రెండు సినిమాలు చేశాక వెంటనే గ్యాప్ లేకుండా మరో సినిమా చేయాలని అనుకుంటుంది.

సాయి పల్లవికి తెలుగులో ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. వారే ఆమెకు లేడీ పవర్ స్టార్ అనే ట్యాగ్ కూడా ఇచ్చేశారు. కానీ తనే ఆ ట్యాగ్ కి అర్హురాలిని కాదని చెప్పేసింది. ఎంచుకున్న పాత్రలో తన 100 పర్సెంట్ ఇస్తున్న సాయి పల్లవి రాబోయే సినిమాలతో కూడా తన పర్ఫార్మెన్స్ తో అలరిస్తుందని చెప్పొచ్చు. చందు నాగ చైతన్య సినిమాలో సాయి పల్లవి పాత్ర కూడా హీరోకి ఈక్వల్ గా ఉంటుందని చెప్పుకుంటున్నారు. తెలుగుతో పాటు తమిళంలో కూడా దూసుకెళ్తున్న సాయి పల్లవి సినిమాల విషయంలో ఇక మీదట బ్రేక్ లు ఇచ్చేది లేదని నిర్ణయించుకుందని తెలుస్తుంది. అమ్మడి నిర్ణయం ఆమె ఫ్యాన్స్ కి ఫుల్ జోష్ అందిస్తుంది.

Tags:    
  • Saipallavi 
  • Nagachaithanya 
  • Shivakarthikeyan 
  • Actresssaipallavi 
  • Filmindustry 
  • Saipallavicareer 

Similar News

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

Copyright @2026

Powered by Blink CMS