రష్మిక కెరీర్​ నిలబడాలంటే.. ఆ రెండిటిపైనే ఆశలు

ఛలో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింఫును సొంతం చేసుకున్న బ్యూటీ రష్మిక.;

Update: 2023-09-24 08:02 GMT

ఛలో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింఫును సొంతం చేసుకున్న బ్యూటీ రష్మిక. స్టార్ హీరోల సినిమాల్లో నటించి ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ.. పుష్ప లాంటి భారీ సక్సెస్​తో పాన్​ ఇండియా లెవల్​లో నేషనల్ క్రష్​గా మారిపోయింది. దీంతో బాలీవుడ్​ బాట పట్టిన ఈ బ్యూటీ తెలుగులో సినిమాలు చేయడం తగ్గించేసింది.

అయితే ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ ఇండస్ట్రీని రూల్ చేస్తుందని అందరూ భావించారు. కానీ అది జరగలేదు. బోల్తా కొట్టింది. హిందీలో ఆమెకు చెప్పుకోదగ్గ స్థాయిలో హిట్స్​ రాలేదు. అలానే ఆఫర్లు కూడా తగ్గిపోయాయనే చెప్పాలి. ఈ ముద్దుగుమ్మ నటించిన తొలి చిత్రం గుడ్ బై ఫ్లాప్ టాక్ సొంతం చేసుకోంది. సిద్ధార్థ్​ మల్హోత్రాతో చేసిన మిషన్ మజ్ను సినిమా కూడా ఆడలేదు. ఇక ఆమె మూడో చిత్రం యానిమల్. తెలుగు డైరెక్టర్​ సందీప్​ వంగా తెరకెక్కించారు.

ఈ యానిమల్​ సినిమాపైనే రష్మిక ఆశలు పెట్టుకుంది. మరి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. ఈ సినిమా రిజల్ట్​పైనే ఆమె బాలీవుడ్ కెరీర్​ ఆధారపడి ఉంది. ఇక తమిళంలోనూ ఆమె అంతగా సక్సెస్ కాలేదు. తొలి చిత్రం సుల్తాన్​ అంత పెద్ద హిట్ కాలేదు. వారిసు కూడా ఆడలేదు. దీంతో ఆమెకు అక్కడ కూడా ఆఫర్లు తగ్గాయి.

ఇక తెలుగులో ఆమె అల్లు అర్జున్​ పాన్​ ఇండియా మూవీ పుష్ప 2 ఒక్కటే చేస్తోంది. రవితేజ-గోపిచంద్ మలినేని సినిమాలో కూడా ఛాన్స్ అందుకుందని తెలిసింది. ఇక తన మాతృ భాష కన్నడపై ఆమె ఫోకస్​ తగ్గించేసింది. అక్కడ ఎక్కువ సినిమాలు చేయట్లేదు.

అంటే యానిమల్, పుష్ప 2 రిజల్ట్స్​ ​పైనే ఆమె కెరీర్​ డిపెండ్​ అయి ఉంది. ఒకవేళ యానిమల్ పోయినా పుష్ప 2 హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. కాబట్టి రష్మిక.. తన పాపులారిటీ దృష్టిలో పెట్టుకుని కథలను ఎంచుకుంటూ ఓ స్ట్రాజజీతో ఆఫర్లను అందుకోవడం ముఖ్యం. అప్పుడు కెరీర్​లో మరింత ఉన్నత స్థాయి దిశగా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది.

Tags:    

Similar News