నయనతారని తీసుకోవడంపై ఇన్ని సందేహాలా?
షారుక్ ఖాన్ కథానాయకుడిగా అట్లీ దర్శకత్వంలో `జవాన్` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది.;
షారుక్ ఖాన్ కథానాయకుడిగా అట్లీ దర్శకత్వంలో `జవాన్` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. అయితే బాలీవుడ్ లో ఎంతో మంది సీనియర్ హీరోయిన్లు..కుర్ర భామలున్నా! నయనతారని ఏరికోరి మరి ఎంపిక చేసారు. ఈ ఛాయిస్ దర్శకుడిదా? షారుక్ ఖాన్ దా? అన్నది తెలియదు. కానీ నయనతారని `జవాన్` లో తీసుకోవడంపై కొన్ని రకాల సందేహాలు తెరపైకి వస్తున్నాయి. `జవాన్` ప్రమోషన్ లో భాగంగా షారుక్ ముందుకు ఈ ప్రశ్న వెళ్లింది.
అంత మంది హీరోయిన్లు ఉన్నారు. పనిగట్టుకుని నయనతారని తీసుకున్నారు? ఆమె కు ప్లాట్ అయిపోయారా? అని ఓ నెటి జనుడు నిర్మోహ మాటంగా అడిగేసాడు. దానికి షారుక్ ఖాన్ ఒక్కసారిగా చిర్రెత్తిపోయాడు. ఆమె ఇద్దరు పిల్లలకు తల్లిగా బాధ్యతలు వహిస్తుంది. నటిగా ఎంతో పేరుంది. అలాంటి నటి గురించి ఇలా మాట్లాడటం భావ్యమేనా? మీ బుర్ర ఇలాగే ఆలోచిస్తుందా? ఇలాంటి ప్రశ్న వేసే ముందు ఒక్కసారి కూడా ఆలోచించరా? అని అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. ఆ పాత్రకు ఏ నటి సూటవుతుందో? దర్శకుడు ఆ హీరోయిన్ తీసుకుంటారు.
ఇందులో హీరోల ఇన్వాల్వ్ మెంట్ ఏమీ ఉండదు. ఫలానా హీరోయిన్ అయితే బాగుంటుందని దర్శకులు చెబుతారు. వాళ్ల మాట ప్రకారం నేను ఒకే చెబుతా. అంతకు మించి హీరోయిన్ల విషయంలో పెద్దగా కల్పించు కోను. హిందీ నటులైతే హిందీ హీరోయిన్లకే అవకాశాలు ఇవ్వాలా? కొత్త వాళ్లని..పరభాషల వాళ్లని తీసుకో కూడదా? ఇలా ఎందుకు ఆలోచించరని చిన్న పాటి క్లాస్ తీసుకున్నారు.
అలాగే `జవాన్` చిత్రం సందేశాత్మక చిత్రమని.. మహిళల సాధికారత గురించి వివరించే సినిమా అని షారుక్ అన్నారు. మహిళలను ఎలా గౌరవించాలనే విషయాన్ని ఈ చిత్రంలో చూపించామన్నారు. ఓ వైపు భారీ యాక్షన్ సన్నివేశాలున్నా కథకి ఉండాల్సిన ప్రాధాన్యత ఉంది. అందులో భాగంగానే కుటుంబ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే సన్నివేశాలుంటాయని తెలిపారు.