క్యాన్సర్ తో పోరాడుతున్న నటి.. జయించిన సెలెబ్రిటీలు వీరే!

క్యాన్సర్.. ఈ మహమ్మారి రోజురోజుకు చాప కింద నీరులా వ్యాపిస్తూ.. ఎంతోమంది ప్రాణాలను కబలిస్తోంది.;

Update: 2025-12-13 10:12 GMT

క్యాన్సర్.. ఈ మహమ్మారి రోజురోజుకు చాప కింద నీరులా వ్యాపిస్తూ.. ఎంతోమంది ప్రాణాలను కబలిస్తోంది. ముఖ్యంగా క్యాన్సర్ వ్యాధికి చికిత్స ఉన్నప్పటికీ.. ఖర్చుతో కూడుకున్నది . ముఖ్యంగా చాలామంది ప్రజలు ఈ క్యాన్సర్ కి సరైన చికిత్సను తీసుకోలేక ప్రాణాలు విడుస్తున్నారు. ఇకపోతే సామాన్యలే కాదు సెలబ్రిటీలు కూడా ఈ క్యాన్సర్ బారిన పడి సంవత్సరాల తరబడి పోరాడి, అలసిపోయి మృత్యువు ఒడిలోకి చేరిపోతున్నారు. మరికొంతమంది మృత్యువుతో పోరాడి మృత్యుంజయులుగా మారి ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఇదిలా ఉండగా ఇప్పుడు క్యాన్సర్ బారిన పడి మరో హీరోయిన్ మృత్యువుతో పోరాడుతోంది. ఆమె ఎవరో కాదు వాహిని. ఎన్నో చిత్రాలలో నాగిని క్యారెక్టర్ లో నటించి ప్రేక్షకులను అలరించిన ఈమె.. విలన్ పాత్రలకు కూడా కేరాఫ్ అడ్రస్.తన అద్భుతమైన నటనతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సహాయ నటిగా పేరు సొంతం చేసుకున్న వాహిని రొమ్ము క్యాన్సర్ తో పోరాడుతున్నారు. ఆరోగ్యం క్షీణించడంతో ఆమెను హైదరాబాదులోనే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే ట్రీట్మెంట్ కి సుమారుగా 35 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తెలపగా.. ఈ విషయం తెలిసిన ప్రముఖ నటి కరాటే కళ్యాణి సోషల్ మీడియా ద్వారా ఆర్థిక సహాయం కావాలని కోరారు. అంతేకాదు ఈమె పరిస్థితి తెలుసుకొని అటు అభిమానులు, సెలబ్రిటీలు కూడా త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

ఇకపోతే క్యాన్సర్ తో పోరాడి మృత్యుంజయులుగా బయటపడ్డ హీరోయిన్స్ విషయానికి వస్తే.. మనీషా కొయిరాలా..2012లో ఫోర్త్ స్టేజ్ అండాశయ క్యాన్సర్ తో పోరాడిన ఈమె.. కీమో, రేడియేషన్ థెరపీ చికిత్సలతో క్యాన్సర్ ను జయించింది. ఇప్పుడు మళ్లీ సినిమాలలో రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

హీనా ఖాన్.. రొమ్ము క్యాన్సర్ తో మూడవ స్టేజ్ లో ఉన్న ఈమె ముంబైలోని ఒక ప్రముఖ ప్రైవేట్ హాస్పిటల్ లో కీమోథెరపీ చికిత్స తీసుకుంటున్నట్లు గతంలో సోషల్ మీడియా ద్వారా తెలిపింది. అలాగే ట్రీట్మెంట్ సమయంలో తీసుకున్న ఫోటోలను కూడా అభిమానులతో పంచుకుంది

మమతా మోహన్ దాస్.. 2009లో హాడ్జ్ కిన్స్ లింఫోమాతో బాధపడిన ఈమె.. పదేళ్లపాటు ఇండస్ట్రీకి దూరమై చికిత్స తీసుకొని జయించింది. ఇప్పుడు మళ్లీ హీరోయిన్గా సినిమాలు చేస్తోంది.

హంస నందిని.. 2021లో మూడవ స్టేజ్లో రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు తెలిపిన ఈమె.. క్యాన్సర్ ను జయించేందుకు కీమో, రేడియేషన్ థెరపీ వంటి చికిత్సలు తీసుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా అప్పట్లోనే సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయం తెలిసిందే.

గౌతమి.. రొమ్ము క్యాన్సర్ బారినపడ్డ మరో నటి గౌతమి. 35 సంవత్సరాల వయసులో రొమ్ము క్యాన్సర్ తో బాధపడిన ఈమె చికిత్స తీసుకొని మృత్యుంజయురాలిలా క్యాన్సర్ నుంచి బయటపడింది. ప్రస్తుతం లైఫ్ అగైన్ ఫౌండేషన్ ద్వారా క్యాన్సర్ తో పోరాడుతున్న వారికి అండగా నిలుస్తోంది.

Tags:    

Similar News