త్రిష, నయన్ ఇక్కడ ఫైట్ షురూ..?
కోలీవుడ్ స్టార్ హీరోయిన్స్ త్రిష, నయనతార ఇద్దరు కూడా అక్కడ ఇప్పటికీ మంచి ఫాం కొనసాగిస్తున్నారు.;
కోలీవుడ్ స్టార్ హీరోయిన్స్ త్రిష, నయనతార ఇద్దరు కూడా అక్కడ ఇప్పటికీ మంచి ఫాం కొనసాగిస్తున్నారు. నయనతార అయితే లేడీ సూపర్ స్టార్ గా అదరగొట్టేస్తుంది. ఐతే మధ్యలో త్రిష కూడా నయన్ కి పోటీగా వస్తుంది. ఈమధ్య త్రిష తమిళ్ లో వరుస స్టార్ ఛాన్స్ లతో అదరగొట్టేస్తుంది. త్రిష, నయనతార కోలీవుడ్ ఫైట్ కొనసాగుతుంది. ఐతే ఈ ఫైట్ కేవలం తమిళ్ లో మాత్రమే కాదు తెలుగు సినిమాలకు వచ్చింది.
విశ్వంభర సినిమాలో త్రిష..
మెగా 156 సినిమాగా వస్తున్న విశ్వంభర సినిమాలో చిరంజీవికి జతగా నటిస్తుంది త్రిష. దాదాపు 13, 14 ఏళ్ల తర్వాత త్రిష తెలుగు సినిమా చేస్తుంది. విశ్వంభర ఆమెకు తెలుగులో మళ్లీ ఫాం కొనసాగించేలా చేస్తుందని నమ్ముతుంది. ఐతే త్రిష వచ్చిందో లేదో మెగా 157 సినిమాకు నయనతార మళ్లీ టాలీవుడ్ రీ ఎంట్రీ ఇస్తుంది. అంతకుముందు తమిళ్ తో పాటు తెలుగులో కూడా వరుస సినిమాలు చేసిన నయనతార ఎందుకో అమ్మడు సడెన్ గా తెలుగు సినిమాలు ఆపేసింది.
ఐతే ఇప్పుడు మళ్లీ మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబో సినిమాలో ఆమె నటిస్తుంది. మెగా 157 సినిమాగా వస్తున్న ఈ మూవీ 2026 సంక్రాంతికి వస్తుంది. ఐతే చిరంజీవి వరుస రెండు సినిమాల్లో త్రిష, నయనతార నటిస్తున్నారు. ఈ సినిమాలు వాళ్లిద్దరికి మళ్లీ తెలుగులో ఫాం లోకి తీసుకు వచ్చేలా ఉన్నాయి. ఐతే సినిమాల పరంగా తమిళ్ లో త్రిష, నయనతార పోటీ పడుతున్నారు. ఇద్దరు కూడా ఒక సినిమాకు ఆమె మరో సినిమాకు ఈమె అనేలా పరిస్థితి ఉంది.
తమిళ్ లో కాదు తెలుగులో ఇద్దరు మధ్య పోటీ..
త్రిష, నయనతార మధ్య ఈ ఫైట్ ఇంట్రెస్టింగ్ గా మారింది. తమిళ్ లో కాదు తెలుగులో ఇద్దరు మధ్య జరుగుతున్న ఈ పోటీ ఆసక్తికరంగా మారింది. ప్రత్యేకంగా ప్లాన్ చేయకపోయిన సరే త్రిష, నయనతార ఇద్దరు కూడా సడేన్ గా తెలుగు సినిమాలు టార్గెట్ చేసుకున్నారు. తెలుగులో హీరోయిన్స్ కు మంచి డిమాండ్ ఉంటుంది. తప్పకుండా మళ్లీ త్రిష, నయనతార తిరిగి ఫాంలోకి వస్తే మాత్రం వరుస సినిమాల్లో నటించే ఛాన్స్ ఉంటుంది. త్రిష ఐతే ఇప్పటికీ గ్లామరస్ గా అదరగొట్టేస్తుంది. ఆమెతో లవ్ స్టోరీ తీసినా తీయొచ్చు అనేలా ఉంది. నయనతార ఇంకా తన పవర్ ఫుల్ సినిమాలతో అదరగొట్టాలని చూస్తుంది. ఈ ఇద్దరు మళ్లీ తెలుగు సినిమాల్లో నటించడంతో వాళ్ల తెలుగు ఫ్యాన్స్ కి సూపర్ హ్యాపీ అనిపిస్తుంది.