• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రాశి ఖన్నా.. ఇప్పటికైనా...

రాశి ఖన్నా.. ఇప్పటికైనా లక్కు మారేనా?

| 'తెలుసు కదా' మూవీతో మరల తెలుగులో బిజీ అవుతానని రాశిఖన్నా భావిస్తోంది.

By - Tupaki Desk
Update: 2024-11-14 07:19 GMT

టాలీవుడ్ లో కమర్షియల్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రాశిఖన్నా ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషలలో కూడా సక్సెస్ అయ్యే ప్రయత్నం చేస్తోంది. తెలుగులో ఆమె చివరిగా నాగ చైతన్యకి జోడీగా 'థాంక్యూ' మూవీలో కనిపించింది. అలాగే గోపిచంద్ తో పక్కా కమర్షియల్ సినిమా చేసింది. ఇవేవీ కూడా ఆమెకు సక్సెస్ ఇవ్వలేదు. అయితే తమిళ్, హిందీ భాషలలో మాత్రం రాశిఖన్నా బాగానే అవకాశాలు అందుకుంటుంది. థాంక్యూ తర్వాత తమిళంలో 'తిరు', 'సర్దార్', 'అరణ్మణై 4' సినిమాలు చేసి సక్సెస్ లు అందుకుంది.

ఇక ఆ మధ్య హిందీలో 'యోధ' అనే చిత్రాన్ని చేసింది. కానీ ఆ మూవీ డిజాస్టర్ అయ్యింది. ఆమె నటిగా 2013లో 'మద్రాస్ కేఫ్' సినిమాతో అరంగేట్రం చేసింది. జాన్ అబ్రహం హీరోగా ఈ సినిమా తెరకెక్కింది. మరల 10 ఏళ్ళ తర్వాత 'యోధ' ద్వారా హిందీలో మళ్ళీ రాశిఖన్నా కనిపించింది. బాలీవుడ్ లో ఈ సినిమా కూడా ఆమెకి సక్సెస్ ఇవ్వలేదు. అయితే ఓటీటీలో 'రుద్ర', 'ఫర్జీ' వెబ్ సిరీస్ ద్వారా తనకంటూ పేరు తెచ్చుకుంది.

ఇక లేటెస్ట్ గా హిందీలో విక్రాంత్‌ మాస్సే హీరోగా తెరకెక్కిన 'ది సబర్మతి రిపోర్ట్' సినిమాలో రాశిఖన్నా హీరోయిన్ గా చేసింది. వాస్తవ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. అత్యంత వివాదాస్పద చిత్రంగా సిద్ధమైన ఈ మూవీ నవంబర్ 15న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాపై ఆమె చాలా హోప్స్ పెట్టుకుంది. ఈ చిత్రంలో హిందీలో హీరోయిన్ గా కమర్షియల్ బ్రేక్ వస్తుందని ఆశ పడుతోంది.

సౌత్ లో స్టార్ హీరోయిన్ గా సక్సెస్ అయిన కూడా బాలీవుడ్ లో సరైన గుర్తింపు రాలేదనే బాధ ఆమెకుంది. 'ది సబర్మతి రిపోర్ట్' తో ఆ వర్రీ తీరిపోతుందని అనుకుంటుంది. ఇది కాకుండా తెలుగులో 'తెలుసు కదా' అనే సినిమాలో సిద్దు జొన్నలగడ్డకి జోడీగా రాశిఖన్నా నటిస్తోంది. ఈ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. అలాగే తమిళంలో 'అరణ్మణై 5', అలాగే 'అగత్యా' మూవీస్ చేస్తోంది. హిందీలో 'TME' అనే మూవీ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.

'తెలుసు కదా' మూవీతో మరల తెలుగులో బిజీ అవుతానని రాశిఖన్నా భావిస్తోంది. ఒక వేళ తెలుగులో ఛాన్స్ లు తగ్గిన హిందీ, తమిళ్ ఇండస్ట్రీ నుంచి రాశిఖన్నాకి బాగానే ఆఫర్స్ వస్తున్నాయి. 'ది సబర్మతి రిపోర్ట్' మూవీ రియలిస్టిక్ స్టోరీతో వస్తోన్న చిత్రం కావడంతో కచ్చితంగా కమర్షియల్ సక్సెస్ అందుకుంటుందని ట్రేడ్ పండితులు సైతం అంచనా వేస్తున్నారు. మరి రాశి అదృష్టం ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    
  • Rashikhanna 
  • Telugu 
  • Hinid 
  • Tamilmovies 
  • Yodha 
  • Thiru 
  • Sardaar 
  • Aranmanai4 
  • Rudra 
  • Farzi 
  • Telsukada 

Similar News

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

Copyright @2026

Powered by Blink CMS