రాధికకి అక్కడైనా కలిసి వచ్చేనా..?

ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న డ్యూడ్ సినిమా ప్రమోషన్‌లో నేహా శెట్టి ప్రముఖంగా కనిపిస్తోంది.;

Update: 2025-10-14 07:10 GMT

మెహబూబా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ నేహా శెట్టి. కెరీర్‌ ఆరంభంలో టాలీవుడ్‌ నుంచి ఈమెకు వచ్చిన ఆఫర్లు నిరాశనే మిగిల్చాయి. అయినా కూడా లక్‌ కలిసి రావడంతో సిద్దు జొన్నలగడ్డ హీరోగా చేసిన 'డీజే టిల్లు' సినిమాతో మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆ సినిమా ఖచ్చితంగా నేహా శెట్టి కెరీర్‌కి టర్నింగ్‌ పాయింట్‌గా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదని అంతా అనుకున్నారు. నిజంగానే ఆ పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది, కానీ ఆ సినిమా తర్వాత నేహా కి పెద్దగా ఆఫర్లు రాలేదు, వచ్చిన ఒకటి రెండు సినిమాలు సైతం బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా ప్రభావం చూపించలేదు. పెద్ద హీరోల నుంచి ఈమెకు పిలుపు రాలేదు. దాంతో నేహా శెట్టి కెరీర్‌ టాలీవుడ్‌లో ముగిసినంత పనైంది. అలాంటి సమయంలో ఓజీలో ఐటెం సాంగ్‌ చేసే అవకాశం దక్కింది. అయితే ఆ పాట తీసేసి, మళ్లీ పెట్టడంతో ఉందా లేదా అన్నట్లుగానే చాలా మంది ఓజీలో నేహా శెట్టి గురించి మాట్లాడుకుంటున్నారు.

టిల్లు స్క్వేర్‌, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాల్లో...

గత ఏడాది టిల్లు స్క్వేర్‌ సినిమాలో గెస్ట్‌ అప్పియరెన్స్‌ ఇవ్వడంతో పాటు, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో ఫుల్‌ హీరోయిన్‌ రోల్‌లో కనిపించింది. ఆ రెండు సినిమాలు సైతం నేహా శెట్టికి ఆఫర్లు తెచ్చి పెట్టలేదు. ఇప్పటికీ అభిమానులతో రాధిక అంటూ ప్రేమగా పిలిపించుకుంటున్న నేహా శెట్టి తెలుగు సినిమాల్లో ఆఫర్లు దక్కించుకోవడంలో విఫలం అవుతుంది. ఆఫర్ల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ముద్దుగుమ్మకు చాలా పెద్ద ఛాన్స్‌ డ్యూడ్‌ రూపంలో దక్కింది. తమిళ యంగ్‌ అండ్‌ ట్యాలెంటెడ్‌ హీరో ప్రదీప్‌ రంగనాథన్‌ డ్యూట్‌ సినిమాలో హీరోయిన్‌గా నేహా శెట్టి నటించడంతో కెరీర్‌ పై మళ్లీ ఆశలు మొదలు అయ్యాయి. డ్యూడ్‌ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ప్రదీప్‌ ప్రతి సినిమా మినిమం ఉంటుంది, ఆయనతో నటించిన హీరోయిన్స్‌కి కూడా మంచి గుర్తింపు, స్టార్‌డం దక్కిన సందర్భాలు ఉన్నాయి కనుక నేహా శెట్టి టైం మారినట్లుగా అనిపిస్తోందని అభిమానులు అంటున్నారు.

డిజే టిల్లు రాధికగా నేహా శెట్టి..

ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న డ్యూడ్ సినిమా ప్రమోషన్‌లో నేహా శెట్టి ప్రముఖంగా కనిపిస్తోంది. ఈ సినిమాలో మెయిన్‌ హీరోయిన్‌గా మమితబైజు ఉన్నప్పటికీ ఖచ్చితంగా నేహా శెట్టి పాత్రకు ప్రాధాన్యత ఉండే ఉంటుంది అనే అభిప్రాయంను ట్రైలర్‌ ను చూసిన వారు వ్యక్తం చేస్తున్నారు. నేహా శెట్టికి ఈ సినిమా హిట్ అయ్యి, పాత్రకు గుర్తింపు దక్కితే కోలీవుడ్‌ నుంచి ఆఫర్లు రావడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రాధిక తెలుగు ప్రేక్షకులను మెప్పించినా మేకర్స్‌ నుంచి ఆఫర్లు అందుకోలేక పోతుంది. అందమైన రూపం ఉన్నప్పటికీ ఆమెకు లక్‌ కలిసి రావడం లేదు. టాలీవుడ్‌లో ఆమె మళ్లీ కనిపిస్తుందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి సమయంలో కోలీవుడ్‌లో ఈమెకు కాలం కలిసి వచ్చేనా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆమె సైతం చాలా ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రదీప్ రంగనాథన్‌ సినిమా డ్యూడ్‌లో హీరోయిన్‌గా నేహా శెట్టి

కన్నడ మూవీతో కెరీర్‌ను ఆరంభించిన నేహా శెట్టి ఆ తర్వాత వరుసగా తెలుగు సినిమాలను చేసింది. ఐదు ఆరు ఏళ్లుగా కేవలం టాలీవుడ్‌కే పరిమితం అయిన నేహా శెట్టి ఇప్పుడు కోలీవుడ్‌ వైపు వెళ్లడంతో ఆమెకు కెరీర్‌ పరంగా కలిసి వస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ మధ్య కన్నడ సినిమా పరిశ్రమ నుంచి ఒకటి రెండు చిన్నా చితకా ఆఫర్లు వచ్చినప్పటికీ సున్నితంగా నేహా శెట్టి తిరస్కరించిందనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పుడు కోలీవుడ్‌ నుంచి వచ్చిన ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకుని కెరీర్‌లో ముందుకు వెళ్తుందా అనేది చూడాలి.

డ్యూడ్‌ సినిమాను ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. తమిళ్‌తో పాటు తెలుగులోనూ ఈ సినిమా విడుదల కాబోతుంది. హీరోతో పాటు ఇద్దరు హీరోయిన్స్‌కి తెలుగులో మంచి గుర్తింపు ఉండటం డ్యూట్‌ సినిమాకు కలిసి వచ్చే అశం అంటున్నారు. రాధిక పాత్రను మరిపించే విధంగా డ్యూడ్‌ లో నేహా శెట్టి పోషించిన ముధ పాత్ర ఉంటుందా అనేది చూడాలి.

Tags:    

Similar News