నీలాప‌నింద‌లు దుర్గ‌మ్మ తుడిచిపెట్టింది! న‌టి హేమ‌

బెంగుళూరు రేవ్ పార్టీ టాలీవుడ్ లో క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్కు చెందిన న‌టీన‌టులు ఉన్నారంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం సాగింది.;

Update: 2025-09-30 11:18 GMT

బెంగుళూరు రేవ్ పార్టీ టాలీవుడ్ లో క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్కు చెందిన న‌టీన‌టులు ఉన్నారంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం సాగింది. ప్ర‌ముఖంగా న‌టి హేమ ఉందంటూ పోలీసులు ప్ర‌క‌టిం చ‌డం..నోటీసులు జారీ అవ్వ‌డం..అరెస్ట్ అవ్వ‌డం..స్టే ఎపిసోడ్ అంతా తెలిసిన క‌థే. ఈ వ్య‌వ‌హార‌మంతా నెట్టింట వైర‌ల్ అవ్వ‌డం..ప్ర‌తిగా ఆప్ర‌చారాన్నిహేమ ఖండించ‌డం పెద్ద సంచ‌ల‌నంగా మారింది. తాజాగా ఈ ఘ‌ట‌న‌పై న‌టి దుర్గ‌మ్మ సాక్షిగా ఇంద్ర‌కీలాద్రిపై మ‌రోసారి స్పందించారు.

ద‌ర్శ‌నం అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ క‌న్నీటి ప‌ర్యంతం అయ్యారు. ప్ర‌తీ ఏడాది ద‌ర్శ‌నానికి రావ‌డం అన‌వాయితీ. ఆప్ర‌కార‌మే ఈ ఏడాది కూడా వ‌చ్చాను. అయితే ఈసారి ద‌ర్శ‌నం మాత్రం ప్ర‌త్యేకంగా పేర్కొన్నారు. త‌న‌పై వ‌చ్చిన నీలాప‌నింద‌లు దుర్గ‌మ్మ తుడిచి పెట్టేసింద‌న్నారు. చేయ‌ని త‌ప్పుకు త‌న‌ని బ‌లి చేసినా.. ఈరోజు దుర్గ‌మ్మ గుడికి రావ‌డానికి కార‌ణం అమ్మ‌వారేన‌న్నారు. దుర్గ‌మ్మ త‌ల్లి నేను ఉన్నాను..నువ్వు ముందుకెళ్లు అని ప్రోత్స‌హించిందన్నారు.

ఎన్ని జ‌న్మ‌లెత్తినా దుర్గ‌మ్మ అందించిన మ‌నోదైర్యం, ఆశీస్సులు మ‌ర్చిపోలేన‌న్నారు. త‌న గురించి ఏదైనా రాసేట‌ప్పుడు నిజా నిజాలు నిర్దారించుకుని రాస్తే మంచిద‌ని విజ్ఞ‌ప్తి చేసారు. గుడిలో ఉండి మ‌రోసారి చెబుతున్నా. తాను ఎలాంటి త‌ప్పు చేయ‌లేదని పాత విష‌యాన్నే మ‌ళ్లీ ఖండించారు. ప్ర‌స్తుతం ఈ వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

హేమ మూడు ద‌శాబ్దాలుగా సినిమాల్లో రాణిస్తోన్న సంగ‌తి తెలిసిందే. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును ద‌క్కించుకున్నారు. స్టార్ హీరోల చిత్రాల్లో కామెడీ త‌ర‌హా పాత్ర‌ల‌కు హేమ ప్ర‌త్యేకం. త‌మిళ్ లోనూ కొన్ని సినిమాలు చేసారు. క‌న్న‌డ‌, హిందీలోనూ రెండు సినిమాల‌కు ప‌ని చేసారు. టెలివిజ‌న్ రంగంలోనూ మెరిసారు. చివ‌రిగా 2023 లో రిలీజ్ అయిన `ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు`లో న‌టించారు.

Tags:    

Similar News