భర్త సోక్రటీస్..కొడుకు ప్లేటో..ఇది ఆనంది ఫ్యామిలీ!
తెలుగు నటి ఆనంది సుపరిచితమే. `ఈరోజుల్లో` సినిమాతో పరిచయమైంది. అటుపై మరికొన్ని చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది.;
తెలుగు నటి ఆనంది సుపరిచితమే. `ఈరోజుల్లో` సినిమాతో పరిచయమైంది. అటుపై మరికొన్ని చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. ఆ గుర్తింపుతో కోలీవుడ్ లో లాంచ్ అయింది. అక్కడ మాత్రం హీరోయిన్ గానే ఎంట్రీ ఇచ్చింది. నటించిన మూడవ సినిమా `కాయల్` కు గాను రాష్ట్ర అవార్డు కూడా అందుకుంది. తెలుగు పరిశ్రమ ఇవ్వని గుర్తింపును కోలీవుడ్ కెరీర్ ఆరంభంలోనే ఇచ్చింది. దీంతో హీరోయిన్ గా అవకాశాలకు తిరుగులేదు. 2019 వరకూ అక్కడే సినిమాలు చేసింది. ఆనంది ప్రయాణాన్ని గమనిస్తే తెలుగు నటి అంజలి ప్రయాణం గుర్తొస్తుంది.
దాదాపు ఇద్దరి జర్నీ ఒకేలా సాగింది. అంజలి కూడా తెలుగులో లాంచ్ అయి కోలీవుడ్ లో ఫేమస్ అయిన నటే. 2021 లో మాత్రం ఆనంద మళ్లీ తెలుగు సినిమాలతో బిజీ అయింది. ఈసారి హీరోయిన్ అవకాశాలు వరించాయి. అప్పటి నుంచి తెలుగు, తమిళ సినిమాలు కలిపి చేస్తోంది. ఈ మధ్యలోనే రక్షితగా ఉన్న అమ్మడు ఆనందిగానూ మారింది. అయితే కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుంది. సరిగ్గా 23 ఏళ్ల వయసులోనే సోక్రటీస్ అనే కుర్రాడిని పెళ్లాడింది. అయితే కెరీర్ పరంగా సోక్రటీస్ చాలా సహకారం అందించాడు.
భర్తగా ఎలాంటి కండీషన్లు పెట్టకుండా స్వేచ్ఛనిచ్చాడు. ఓ సినిమాలో బోల్డ్ ఆఫర్ వరించగా అందులో నటిస్తుందా? లేదా? అన్న సందేహం నేపథ్యంలో భర్తే దగ్గరుండి మరీ ప్రోత్సహించాడు. ఇలాంటి సినిమాలు అరుదుగా వచ్చినప్పుడు నటించాలని ఎంకరేజ్ చేయడంతో బోల్డ్ పాత్రలో సైతం కొనసాగింది. ప్రస్తుతం నటిగా కొనసాగుతూనే కుటుంబ జీవితాన్ని ఆస్వాదిస్తోంది. అయితే కుటుంబానికి సంబంధించిన విషయాలు పెద్దగా బయటకు రాలేదు. భర్త సోక్రటీస్ దర్శకుడు అని తెలిసింది. అంతకు మించి అతడు ఏ సినిమాలు డైరెక్ట్ చేసాడు? అన్నది పెద్దగా బయటకు రాలేదు.
అలాగే ఆనంది తల్లిగా కూడా బాధ్యతలు నెరవర్తిస్తుంది. కుమారుడి పేరు ప్లేటో. అయితే పెళ్లి విషయంలో ఆనంది తాజాగా ఓ విషయాన్ని రివీల్ చేసింది. తాను ఎలాంటి సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి రాలేదని.. స్టార్ స్టేటస్ వచ్చిందని ఆ కేటగిరికి చెందిన వారినే పెళ్లి చేసుకోవాలని తానెప్పుడు అనుకోలేదంది. ఓ సినిమా షూటింగ్ సమయంలో సోక్రటీస్ తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందని తెలిపింది. అతడి అభిప్రాయాలు, అభిరుచులు కలవడంతో పెద్దల అంగీకారంతోనే వివాహం చేసుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం కుటుంబ జీవితంలో తానెంతో సంతోషంగా ఉందంది. ఇద్దరి జీవితాల్లోకి ప్లేటో రావడంతో ఆ సంతోషం రెట్టింపు అయిందంది. మరి డైరెక్టర్ అయిన భర్తతో ఆనంది ఎప్పుడు సినిమా చేస్తుందో చూడాలి.