• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పిక్ టాక్ :​ హనుమాన్...

పిక్ టాక్ :​ హనుమాన్ హీరో రాయల్​ లుక్​..

| బాల నటుడిగా తెరంగేట్రం చేసి ప్రస్తుతం హీరోగా రాణిస్తున్న టాలీవుడ్ నటుడు తేజ సజ్జా. చూడాలని ఉంది చిత్రంతో వెండితెర అరంగేట్రం చేసి.. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో మెరిశాడు

By - Tupaki Desk
Update: 2023-10-07 06:03 GMT

బాల నటుడిగా తెరంగేట్రం చేసి ప్రస్తుతం హీరోగా రాణిస్తున్న టాలీవుడ్ నటుడు తేజ సజ్జా. చూడాలని ఉంది చిత్రంతో వెండితెర అరంగేట్రం చేసి.. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో మెరిశాడు. తన ముద్దు ముద్దు మాటలు ఇనోసెంట్​ ఫేస్​తో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం భారీ బడ్జెట్​ హనుమాన్​ చిత్రంతో బిజీగా ఉన్న అతడు.. ఆ సినిమా ప్రమోషన్స్​ కోసం రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఓ సూపర్ ఫొటోషూట్ చేశాడు.


పింక్ కలర్ సిల్క్ సాలిడ్ ఎంబ్రాయిడ్​ కుర్తా - వైట్ ప్యాంట్, చేతికి కాస్ట్లీ వాచ్​ ధరించి స్టన్నింగ్ లుక్​లో డ్యాపర్ ఛార్మ్​గా కనిపించి ఆకట్టుకున్నాడు. ఒక ఫొటోలో రెండు చేతులను జేబులో పెట్టుకుని కనిపించగా.. మరో ఫొటోలో మీసాలు మెలేస్తూ కనిపించాడు. మరో పిక్​లో స్టైలిష్​గా పోజులిచ్చాడు. మొత్తంగా ఈ పిక్స్​లో ఎంతో రాయల్​గా స్వాగ్​తో కనిపించాడు. ఈ పిక్స్​ నెటిజన్లను, సినీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి.

కాగా, రాజకుమారుడు, కలిసుందాం.. రా, యువరాజు, ఇంద్ర, గంగోత్రి, వసంతం, ఠాగూర్‌, బాలు తదితర చిత్రాల్లో బాల నటుడిగా సందడి చేసిన తేజ సజ్జా.. జాంబిరెడ్డి చిత్రంతో హీరోగా మారాడు. ఆ తర్వాత ఇష్క్‌, అద్భుతం వంటి చిత్రాలతో అలరించాడు. ప్రస్తుతం భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్​ హనుమాన్‌లో నటించాడు.

దర్శకుడు ప్రశాంత్‌ వర్మ తెరకెక్కిస్తున్న ఈ భారీ విజువల్ వండర్ సినిమా.. వచ్చే ఏడాది సంక్రాంతికి బడా సినిమాలతో పోటీ పడనుంది. ఈ చిత్రాన్ని దాదాపు 11 భాషల్లో రిలీజ్ చేసేలా సన్నాహాలు చేస్తున్నారని ఆ మధ్య వార్తలు కూడా వచ్చాయి. జాంబీరెడ్డి తర్వాత తేజ సజ్జ, ప్రశాంత్‌ వర్మల కాంబోలో తెరకెక్కనున్న చిత్రమిది.

కె నిరంజన్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అమృత అయ్యర్ కథానాయికగా నటించింది. గతంలో రిలీజైన టీజర్​ కూడా మిలియన్‌ వ్యూస్​తో అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. అంజనాద్రి అనే ఓ కల్పిత ప్రదేశం నేపథ్యంలో సాగే చిత్రమని మూవీటీమ్ చెబుతోంది. హీరో.. హనుమంతుడి శక్తుల్ని పొంది అంజనాద్రి కోసం ఎలా పోరాటం చేశాడనే కథాంశంతో సినిమా రూపొందింది.

Tags:    
  • Tejasajja 
  • Hanumanmovie 
  • Phototalk 
  • Prashanthvarma 
  • Zombiereddymovie 
  • Filmindustry 
  • Childartist 
  • Actortejasajja 

Similar News

'వారణాసి' చేస్తూ ఈ ప్రయోగం ఎందుకు పీసీ?

2026-11-07 12:30 GMT

మా సినిమా చూస్తే పిల్లలు చెడిపోరు...!

2026-11-07 11:47 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

2026-11-07 09:24 GMT

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

2026-11-07 09:23 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భార్యతో ఫొటో షేర్ చేసిన సాయి దుర్గ తేజ్!

2026-11-07 09:01 GMT

పర్సనల్ కంటెంట్ వైరల్.. సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్..

2026-11-07 09:01 GMT

శ్రేయా ఘోషల్ ఎంపిక వెనుక పెద్ద హైడ్రామా!

2026-11-07 08:51 GMT

సినిమా ప్రొడక్షన్‌లో ఎగ్జిక్యూటివ్ నిర్మాత పాత్ర ప‌రిధి ఎంత‌?

2026-11-07 08:25 GMT

రాహా బర్త్‌డే స్పెషల్.. చిక్ లుక్‌తో ఆకట్టుకున్న అలియా భట్!

2026-11-07 08:23 GMT

నటుడిగా చివరి దశాబ్దం.. డైరెక్టర్ గా స్టార్ హీరో!

2026-11-07 08:22 GMT

Bigg Boss Telugu 10: ఈసారైనా జబర్దస్త్ నరేష్ దొరికిపోతాడా?

2026-11-07 08:20 GMT

Copyright @2026

Powered by Blink CMS