నటీనటులకు జీవితాంతం రాయల్టీ ఇవ్వాలా?
అదే విధంగా సినిమాలో నటించిన కథానాయకుడికి, విభిన్న సమయాల్లో ఆ సినిమా కారణంగా వచ్చే ఆదాయంలో వాటా(రెసిడ్యువల్) ఇవ్వాలా? అంటే అలా ఇస్తే లైఫ్ టైమ్ ఆదాయ భద్రత పెరుగుతుందని అంటున్నారు సీనియర్ నటుడు ఆర్.మాధవన్.;
నటీనటులకు జాతీయ అవార్డులు, లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ అవార్డులు, ఫాల్కే అవార్డులు ఇవ్వడం సరే కానీ, వారికి కూడా టెక్నీషియన్లకు ఇస్తున్నట్టు లైఫ్ టైమ్ రాయల్టీ అందుకునే వెసులుబాటు చట్టంలో ఉంటే ఎలా ఉంటుంది? తమ సినిమాల హక్కులపై రాయల్టీ తమకు మాత్రమే ఉంటుందని నిర్మాత అంటారు. కానీ సంగీత దర్శకులు తాము స్వరపరిచిన పాటలకు జీవితాంతం రాయల్టీ చెల్లించాలని పట్టుబడుతున్నారు. తమ స్వరాల్ని విభిన్న మాధ్యమాలలో ఉపయోగించుకున్నప్పుడు ఆదాయం వస్తుంది.. అందులో తమ వాటా తమకు ఇవ్వాలని కోరుతున్నారు. అదే విధంగా సినిమాలో నటించిన కథానాయకుడికి, విభిన్న సమయాల్లో ఆ సినిమా కారణంగా వచ్చే ఆదాయంలో వాటా(రెసిడ్యువల్) ఇవ్వాలా? అంటే అలా ఇస్తే లైఫ్ టైమ్ ఆదాయ భద్రత పెరుగుతుందని అంటున్నారు సీనియర్ నటుడు ఆర్.మాధవన్.
హాలీవుడ్ లో ఈ విధంగా ఉంది. నటులకు ప్రొడక్షన్ హౌస్ నుంచి ఆదాయం వస్తూనే ఉంటుంది. స్పీల్ బర్గ్ సినిమాలో నటించిన అమ్రిష్ పురికి ఇప్పటికీ రెసిడ్యువల్ (రాయల్టీ తరహా ఆదాయం) అందుతోంది. ఆ రకంగా వచ్చే డబ్బుతో చాలా మ్యాజిక్ చేయొచ్చని మాధవన్ అన్నారు. తాను నటించిన నాలుగు బ్లాక్ బస్టర్ సినిమాలకు జీవితాంతం ఈ తరహా డబ్బు అందితే చాలు అని అన్నాడు. తాజా ఇంటర్వ్యూలో నటీనటుల ఆర్థిక భద్రత గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. నేను హాలీవుడ్ నటుడిని అయితే రెండు లేదా మూడు సినిమాలు సరిపోతాయి. 3 ఇడియట్స్, రంగ్ దే బసంతి, తను వెడ్స్ మను చిత్రాలు చాలు.. నా వంశంలో తరాలకు వారు తెలివిగా జీవిస్తే వారికి తిండి పెట్టేంత ఆదాయం వస్తూనే ఉంటుందని మాధవన్ తెలిపారు.
రెసిడ్యువల్స్ అంటే?
ఇవి కూడా రాయల్టీల మాదిరిగానే ఉంటాయి. ఒక సినిమా లేదా షోలో పనిచేసిన ప్రతి వ్యక్తికి చెల్లించే రాయల్టీలు, ఆ సినిమా లేదా షో ఏదైనా కానీ, టీవీలో స్ట్రీమింగ్ లేదా ఇతర పంపిణీ మార్గాల్లో ఆదాయాన్ని ఆర్జించినప్పుడల్లా స్థిరమైన ఆదాయన్ని తెస్తుంది. దాని నుంచి ఆర్టిస్టులు కూడా తమ వాటా తమకు అందాలని కోరుకోవడం అన్న మాట.