'సంతాన ప్రాప్తిరస్తు'.. హీరో అంచనాలు ఎలా ఉన్నాయంటే?
యంగ్ హీరో విక్రాంత్, చాందినీ చౌదరి లీడ్ రోల్స్ లో నటిస్తున్న సంతాన ప్రాప్తిరస్తు మూవీ.. నవంబర్ 14వ తేదీన రిలీజ్ కానుంది.;
తెలుగు సినీ ఇండస్ట్రీలో కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు ఎప్పటికప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తూ మంచి హిట్స్ గా నిలుస్తుంటాయన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ కోవకు చెందిన సంతాన ప్రాప్తిరస్తు కూడా రిలీజ్ కు సిద్ధమవుతోంది. పిల్లలు లేకపోవడం వల్ల పెళ్లైన జంటలు ఎదుర్కొనే సమస్యలతో ఎమోషనల్, కామెడీ జోనర్ లో సినిమా రూపొందుతోంది
యంగ్ హీరో విక్రాంత్, చాందినీ చౌదరి లీడ్ రోల్స్ లో నటిస్తున్న సంతాన ప్రాప్తిరస్తు మూవీ.. నవంబర్ 14వ తేదీన రిలీజ్ కానుంది. దీంతో మూవీ టీమ్ అంతా ప్రమోషన్స్ తో సందడి చేస్తున్నారు. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంటున్నారు. ఇప్పుడు విక్రాంత్ కూడా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు.
చిన్నప్పటి నుంచి సినిమాలపై మంచి ఆసక్తి కలిగి ఉన్న విక్రాంత్.. ఇండస్ట్రీలోకి రావడం కుదరక ఉన్నత చదువులు అయ్యాక అమెరికా వెళ్లిపోయారు. అక్కడ ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ స్టార్ట్ చేసి 700 మంది ఉద్యోగులతో నడిపిస్తున్నారు. ఇప్పుడు సినిమాలపై ప్యాషన్ తో ఇండియా వచ్చి హీరోగా రాణించాలని చూస్తున్నారు. ఇప్పటికే థ్రిల్లర్ మూవీ స్పార్క్ ది లైఫ్ లో నటించారు విక్రాంత్.
ఆ సినిమాకు దర్శకత్వం వహించగా.. అనుకున్న స్థాయిలో మూవీ ఆడియన్స్ ను ఆకట్టుకోలేదు. కానీ ఓటీటీలో మాత్రం విక్రాంత్ మంచి రెస్పాన్స్ అందుకున్నారు. ఇప్పుడు సంతాన ప్రాప్తిరస్తు సినిమాతో అలరించాలని చూస్తున్నారు. నేటి ప్రపంచంలో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్యతో మూవీ రూపొందిందని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
సినిమా కచ్చితంగా ఆడియన్స్ ను ఆకట్టుకుంటుందని అంచనా వేశారు విక్రాంత్. తాను సంతాన ప్రాప్తిరస్తు మూవీకి సైన్ చేశాక.. చాలా మంది ఫ్రెండ్స్, బంధువులు పిల్లలు లేకపోవడం వల్ల వారంతా ఎదుర్కొన్న అనుభవాలను తనతో పంచుకున్నారని తెలిపారు. ముఖ్యంగా తాను చేస్తున్న మూవీ సబ్జెక్ట్ ను కొనియాడారని పేర్కొన్నారు.
అయితే ఇలాంటి చిన్న సినిమాకు బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్స్ తక్కువగా ఉండవచ్చని అభిప్రాయపడ్డ విక్రాంత్.. సాయంత్రం షోల నుండి థియేటర్లు ఫుల్ అవుతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. పాజిటివ్ మౌత్ టాక్ స్ప్రైడ్ అయ్యి జనాలను రప్పిస్తుందని చెప్పారు. తన మొదటి సినిమాతో ప్రతికూల సమీక్షలు ఎదుర్కొన్నానని ఆయన పంచుకున్నారు. ఇప్పుడు ఆడియన్స్ ను అలరించాలని చూస్తున్నట్లు చెప్పారు. మరి ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాలి.