యంగ్ హీరో ఈసారైనా మెప్పిస్తాడా?
ఒకప్పుడు అల్లరి నరేష్ నుంచి ఏడాదికి కనీసం మూడు నాలుగు సినిమాలైనా రిలీజ్ అయ్యేవి.;
ఒకప్పుడు అల్లరి నరేష్ నుంచి ఏడాదికి కనీసం మూడు నాలుగు సినిమాలైనా రిలీజ్ అయ్యేవి. దీంతో థియేటర్లు కళకళలాడేవి. యావరేజ్ గానైనా నరేష్ చిత్రాలు ఆడేసేవి. కామెడీ జానర్ కాబట్టి వర్కౌట్ అయ్యేది. కమెడియన్ గా అతడికి ఉన్న గుర్తింపుతో అది సాధ్యమయ్యేది. నరేష్ సినిమాలంటే చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపించేవారు. ఈ మధ్య కాలంలో నరేష్ లాగే సుహాస్ సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి.
కానీ మార్కెట్ లో మాత్రం వర్కౌట్ అవ్వడం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పరిచయమైన సుహాస్ ఇప్పుడు హీరోగా వరుస సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే సుహాస్ నటించిన 'ప్రసన్న వదనం', 'జనక అయితే గనక', 'గొర్రె పురాణం' లాంటి చిత్రాలు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మార్కెట్ లో వీటి ప్రభావం కనిపించలేదు. థియేట్రికల్ రిలీజ్ అయినా..ఓటీటీ రిలీజ్ అయినా సుహాస్ ఆకట్టుకోలేకపో యాడు. పైగా ఈ సినిమాలకు పెద్దగా ప్రచారం కూడా చేయకపోవడంతో కలిసి రాలేదు.
ఇటీవలే కీర్తి సురేష్‌తో కలిసి నటించిన 'ఉప్పు కప్పురంబు' కూడా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయింది. ఈసినిమా కూడా తేలిపోయింది. ఏ మాత్రం పాజిటివ్ రివ్యూలు రాలేదు. దీంతో సుహాస్ సినిమాలు చేస్తున్నాడు గానీ సక్సెస్ పరంగా బాగా వెనుకబడే ఉన్నాడని మరోసారి ప్రూవ్ అయింది. జులై 11న 'ఓ భామా అయ్యో రామా' అంటూ ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఆశలన్నీ ఈ సినిమాపైనే. రిలీజ్ అయిన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
మరి ఇదే ఆసక్తి జనాలు థియేటర్ వరకూ వచ్చి చూపిస్తారా? అన్నది చూడాలి. ఈరోజుల్లో సినిమా ఆడాలంటే రిలీజ్ కు ముందు ప్రచారం ఎంత ముఖ్యమో? తొలి షో అనంతరం వచ్చే మౌత్ టాక్ కూడా అంతే కీలకం. సినిమా గొప్పగా ఉంటే తప్ప జనాలు థియేటర్ కు రావడం లేదు. స్టార్ హీరో సినిమాలే తొలి షోతో లేపేస్తున్నారు. చిన్న హీరోలైతే పూర్తిగా కంటెంట్ మీద ఆధారపడాల్సిందే. మరి ఇలాంటి ఫేజ్ లో ఉన్న సుహాస్ తదుపరి ఎలాంటి ఫలితాలు సాధిస్తాడో చూడాలి.