ఆస్మాన్ పోస్టర్ లో సింహాన్ని చూశా: శాంతి శ్రీహరి

రియల్ స్టార్ శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి నటిస్తున్న 'ఆస్మాన్' సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీహరి సతీమణి, నటి శాంతి శ్రీహరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

Update: 2026-08-15 17:10 GMT

రియల్ స్టార్ శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి నటిస్తున్న 'ఆస్మాన్' సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీహరి సతీమణి, నటి శాంతి శ్రీహరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తన కొడుకు సినిమా ఈవెంట్ లో ఆమె చేసిన కామెంట్స్, పంచుకున్న విషయాలు అందరినీ ఆకట్టుకున్నాయి. మొదటగా సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరి ఎదుగుదలకు కారణమయ్యే మీడియాకు ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

మేఘాంశ్ మీద నమ్మకం ఉంచి ఈ సినిమాను మొదలుపెట్టిన దర్శక నిర్మాతలకు శాంతి శ్రీహరి థాంక్స్ చెప్పారు. డైరెక్టర్ రామ్ నందన్ గురించి మాట్లాడుతూ సరదాగా కొన్ని విషయాలు షేర్ చేసుకున్నారు. మేఘాంశ్ ను రోజుకు ఇరవై గంటలు కష్టపెడుతున్నారని, రాత్రి రెండు మూడు గంటల దాకా వాడి మొహం చూడటానికి తాను మెలకువతో ఎదురుచూడాల్సి వస్తోందని నవ్వుతూ చెప్పారు.

శ్రీహరి గారు కూడా ఒకప్పుడు ఇలాగే కష్టపడి పనిచేశారని, ఆర్టిస్టులుగా ఎదగాలంటే ఆ మాత్రం కష్టం తప్పదని అన్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న రాయంచను శాంతి శ్రీహరి ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. చాలా ఏళ్ల తర్వాత మన తెలుగు బిడ్డ ఇలా హీరోయిన్ గా రావడం చాలా సంతోషంగా ఉందని, ఆమెను ఎంపిక చేసినందుకు దర్శక నిర్మాతలకు థాంక్స్ చెప్పారు.

అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ ఆర్ విహారిని సరదాగా అడుగుతూ, తనకు ఇంకా పాటలేవీ వినిపించలేదని, వెంటనే మేఘాంశ్ తో కలిసి మంచి పాటలు వినిపించాలని కోరారు. యూనిట్ లోని ప్రొడక్షన్ బాయ్స్ నుంచి ప్రతి ఒక్కరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు. తన పెద్ద కొడుకు శశాంక్ గురించి చెబుతూ ఆమె చాలా ఎమోషనల్ అయ్యారు. తమ్ముడు మేఘాంశ్ డైట్, వర్కౌట్స్, ఫుడ్ విషయంలో శశాంక్ తనకంటే ఎక్కువ కేర్ తీసుకుంటున్నాడని చెప్పారు.

వచ్చే ఏడాది శశాంక్ కూడా డైరెక్టర్ గా మీ ముందుకు రాబోతున్నాడని ఒక సర్ ప్రైజ్ న్యూస్ రివీల్ చేశారు. ఆ సినిమాలో తనకు కూడా ఏదైనా మంచి వేషం ఇస్తాడేమో చూడాలని సరదాగా అన్నారు. మేఘాంశ్ ను ఇప్పటివరకు తాను ఒక చిన్న పిల్లాడిలాగే చూసుకున్నానని, ఫ్రిడ్జ్ లో స్వీట్లు దొంగిలించేంత అమాయకుడిగా భావించానని శాంతి చెప్పారు.

కానీ 'ఆస్మాన్' పోస్టర్ లో వాడిని చూశాక ఒక సింహాన్ని చూసినట్టు అనిపించిందని, మళ్లీ శ్రీహరి గారే పుట్టారేమో అన్నంత గర్వంగా ఉందని అన్నారు. తమ కుటుంబం ఈ స్థాయిలో ఉండటానికి కారణమైన శ్రీహరి గారిని, ఆయనతో సినిమాలు తీసిన దర్శక నిర్మాతలను, ప్రేక్షకులను ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపారు.

Tags:    

Similar News