న‌టి 1200 కోట్ల సంపాద‌న వెన‌క క‌థ‌

ఇప్పుడు 1200కోట్ల రేంజుకు ఎదిగింది. 2018లో `రెనీ` పేరుతో కాస్మోటిక్స్ ఉత్ప‌త్తుల రంగంలో ప్ర‌వేశించి కేవ‌లం ఏడేళ్ల‌లోనే 1200 కోట్ల ప్ర‌గ‌తిని సాధించ‌డం ఆశ్చ‌ర్య‌క‌రం.;

Update: 2025-07-25 04:15 GMT

హిందీ టీవీ సీరియ‌ళ్లు, రియాలిటీ షోల‌తో పాపుల‌రైన ప్ర‌ముఖ న‌టి, కొన్నేళ్ల‌కు న‌ట‌నారంగాన్ని విడిచిపెట్టింది. అటుపై భాగ‌స్వాముల‌తో క‌లిసి కేవ‌లం 50ల‌క్ష‌ల పెట్టుబ‌డితో సౌంద‌ర్య ఉత్ప‌త్తుల రంగంలో ప్ర‌వేశించింది. ప్రారంభించిన ఏడాదిలోనే 100 కోట్ల ట‌ర్నోవ‌ర్ కి చేరుకుంది కంపెనీ. ఇప్పుడు 1200కోట్ల రేంజుకు ఎదిగింది. 2018లో `రెనీ` పేరుతో కాస్మోటిక్స్ ఉత్ప‌త్తుల రంగంలో ప్ర‌వేశించి కేవ‌లం ఏడేళ్ల‌లోనే 1200 కోట్ల ప్ర‌గ‌తిని సాధించ‌డం ఆశ్చ‌ర్య‌క‌రం.


ఇంత‌కీ ఈ న‌టి ఎవ‌రు? ఏ టీవీ సీరియ‌ళ్లలో న‌టించింది? అంటే వివ‌రాల్లోకి వెళ్లాలి. ఎంట‌ర్ ప్రెన్యూర్ గా త‌నదైన స్టైల్లో రాణిస్తున్న ఈ ప్ర‌ముఖ న‌టి పేరు ఆష్కా గొరాడియా. రూ. 1,200 కోట్ల వ్యాపార‌ సామ్రాజ్యాన్ని ఏల్తోంది ఈ న‌టి. హిందీలో ప‌లు హిట్ టెలివిజన్ సీరియల్స్‌లో న‌టించింది. రియాలిటీ షోల‌లోను క‌నిపించింది. 2018లో వ్యవస్థాపకులు ప్రియాంక్ షా, అశుతోష్ వల్లానిలతో కలిసి ఆష్కా `రెనీ కాస్మెటిక్స్‌`ను స్థాపించారు. పురుషుల గ్రూమింగ్ బ్రాండ్ బియర్డోను సృష్టించింది ఈ ముగ్గురే. కేవ‌లం 50ల‌క్ష‌ల పెట్టుబ‌డులు, భాగ‌స్వాముల‌తో క‌లిసి ప్రారంభించిన ఈ బ్రాండ్ వేగంగా పాపుల‌రైంది.

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, నైకా, మైంత్రా వంటి ఇకామర్స్ వెబ్ సైట్లతో భాగస్వామ్యం ద్వారా ఆన్‌లైన్ ఫస్ట్ బ్యూటీ లేబుల్‌గా ప్రారంభమైంది. తరువాత రెనీ ఆఫ్‌లైన్ రిటైల్‌లోకి కూడా విస్తరించింది. ప్రారంభించిన రెండు సంవత్సరాలలోపు, రెనీ ఆదాయం రూ. 100 కోట్లను దాటింది. 2024 నాటికే బ్రాండ్ విలువ రూ. 1,200- రూ. 1,400 కోట్ల రేంజుకు చేరుకుంద‌ని అంచ‌నా. 2019లో అమెరికన్ యోగా టీచర్ అయిన తన భర్త బ్రెంట్ గోబుల్‌తో గోవాకు వెళ్లింది. ఈ జంట యోగా స్టూడియోను ప్రారంభించారు. ఇప్పుడు రెండేళ్ల కొడుకుతో అక్కడ నివసిస్తున్నారు. ఆష్కా కేవ‌లం 23 వ‌య‌సులోనే సొంత ఇల్లు కొనుక్కున్న ప్ర‌తిభాశాలి. ప్రస్తుతం రెనీ కాస్మెటిక్స్‌లో చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ కం డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.

టీవీ రంగంలో జ‌ర్నీ:

2002లో అచానక్ 37 సాల్ బాద్‌తో వినోద పరిశ్రమలో తన ప్రయాణాన్ని ప్రారంభించింది ఆష్కా గొరాడియా. కుసుమ్, క్యుంకి సాస్ భీ కభీ బహు థి, సిందూర్ తేరే నామ్ కా, నాగిన్ వంటి సీరియ‌ళ్ల‌తో న‌టిగా పాపుల‌రైంది. బిగ్ బాస్ 6, ఝలక్ దిఖ‌లాజా 4, నాచ్ బలియే 8, ఖత్రోన్ కే ఖిలాడి 4 షోలు త‌న‌కు మంచి పేరు తెచ్చాయి. ఫిక్షన్ రియాలిటీ షోలతో రియాలిటీ క్వీన్ గాను ఎదిగింది. బుల్లితెర రంగంలో రెండు ద‌శాబ్ధాల సుదీర్ఘ కెరీర్ ని కొన‌సాగించిన ఆష్కా గొరాడియా ఇప్పుడు యూట్యూబ‌ర్ గా, ఇన్ ఫ్లూయెన్స‌ర్ గాను రాణిస్తోంది. త‌న భ‌ర్త కుమారునితో క‌లిసి బీచ్ లో వైర‌ల్ యోగా ఫీట్స్ తో అల‌రించే ఈ బో*ల్డ్ భామ ప్ర‌పంచ‌వ్యాప్తంగా పాపులారిటీని, ఫాలోయింగ్ ని ఆస్వాధిస్తోంది.

Tags:    

Similar News