1862 కోట్ల ఆస్తులతో టాప్ 5 హీరోల్లో ఒకడు
ప్రపంచవ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఉన్న భారతీయ స్టార్లలో అతడు ఒకడు.;
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ దాదాపు నాలుగు దశాబ్ధాల కెరీర్ లో అధిరోహించని శిఖరం లేదు. ఆస్కార్ అవార్డుల వరకూ ఆయన బిగ్ ఫైట్ కొనసాగింది. ప్రపంచవ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఉన్న భారతీయ స్టార్లలో అతడు ఒకడు. అయితే అమీర్ ఇన్నేళ్లలో ఎంత సంపాదించాడు? అంటే.. అతడి నికర ఆస్తుల విలువ సుమారు 1862 కోట్లుగా ఉందని మీడియాలో కథనాలు వస్తున్నాయి. అమీర్ తన సినిమాలు, నిర్మాణ సంస్థ, ఎండార్స్‌మెంట్‌లు, రియల్ ఎస్టేట్ , వ్యవస్థాపక పెట్టుబడులతో ఆర్జిస్తున్నాడు.
అమీర్ ఒక్కో సినిమా కోసం 100కోట్లు లాభాల్లో వాటాలు తీసుకుంటున్నాడు. అమీర్ ఖాన్ ఆస్తులు దేశ విదేశాల్లో ఉన్నాయి. అమీర్ అమెరికా లాస్ ఏంజెల్స్ లోని బెవర్లీ హిల్స్‌లో ఒక ఖరీదైన ఇంటిని కలిగి ఉన్నాడు. దీని ధర రూ. 75 కోట్లు. చాలా మంది హాలీవుడ్ ప్రముఖులు నివశించే చోటు ఇది. అమెరికా విలాసవంతమైన ప్రాంతంలో పెట్టుబడులు పెట్టిన బాలీవుడ్ నటులలో అమీర్ ఖాన్ కూడా ఉన్నారు. అమీర్ ఖాన్ ముంబై (బాంద్రా) ఇంటి ఖరీదు 60 కోట్లు. 5,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు అంతస్తులతో విస్తరించి సీఫేసింగ్ లో ఇది ఉంది. అందులో ఒక అంతస్తును అమీర్ ఖాన్ కార్యాలయంగా వినియోగిస్తున్నారు. అమీర్ ఖాన్ తన కుటుంబం సహా తరచుగా నగర ఔటర్‌లోని విశాలమైన పంచగని ఫామ్‌హౌస్‌లో తమ సమయాన్ని వెచ్చిస్తారు. రెండు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ రాజభవనాన్ని అమీర్ 7 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు సమాచారం. అమీర్ పాలీ హిల్ లోని సొంత ఇంట్లో చిన్నప్పటి నుంచి నివశించాడు. బెల్లా విస్టా (ఇండియన్ ఎక్స్‌ప్రెస్)లోని 24 యూనిట్లలో 9 యూనిట్లను సొంతం చేసుకున్నాడు. పొరుగున ఉన్న మెరీనా అపార్ట్‌మెంట్‌లలోను అతడు చాలా ఫ్లాట్‌లను కొన్నాడు. ఉత్తర ప్రదేశ్‌లో భారీ ఆస్తులున్నాయి.
అమీర్ ఖాన్ గ్యారేజీలో ఖరీదైన కార్లకు కొదవేమీ లేదు. గ్యారేజీలోని మెర్సిడెస్-బెంజ్ S600 ఖరీదు 10.50 కోట్లు. అమీర్ ఖాన్ కార్లలో రోల్స్ రాయిస్ ఘోస్ట్ ఖరీదైనది. ఇది బాలీవుడ్ ప్రముఖులకు ఇష్టమైనది. ఈ లగ్జరీ కారు ధర రూ.6.95 కోట్ల నుండి రూ.7.95 కోట్ల మధ్య ఉంటుంది. అమీర్ నిర్మాణ సంస్థ ద్వారా కూడా ఆదాయం ఆర్జిస్తున్నాడు.
GQ ఇండియా వివరాల ప్రకారం...
*రోల్స్ రాయిస్ ఘోస్ట్ -రూ. 5.25–6.8 కోట్లు
*మెర్సిడెస్ బెంజ్ S-600 - రూ. 10.5 కోట్లు.. అంబానీలకు ఇలాంటి కార్ ఉంది.
* రేంజ్ రోవర్ వోగ్ - రూ. 2.26 కోట్ల బీస్ట్ కార్.
*బెంట్లీ కాంటినెంటల్ ఫ్లయింగ్ స్పర్ - ఐకానిక్ 0007 నంబర్ ప్లేట్‌తో కొన్నాడు. దీని ధర రూ. 3.21–3.41 కోట్లు.
*BMW 6-సిరీస్ - రూ. 65 లక్షల స్టైలిష్ కారు..
*టయోటా వెల్‌ఫైర్ & ఫార్చ్యూనర్ - అతని బ్రాండ్ అంబాసిడర్ రోజుల నుండి ఇప్పటికీ రొటీన్ డ్రైవ్‌లలో ఈ కార్ ఉంటుంది.
*మహీంద్రా XUV500 & టయోటా ఇన్నోవా .. నిరంతరం ఉపయోగించేవి.
ఆమిర్ ఖాన్ లగ్జరీ జీవితం వివరాలు:
*అతడి నికర ఆస్తుల విలువ- రూ. 1,862 కోట్లు
*సినిమా పారితోషికం పరిధి - రూ. 100 నుంచి రూ. 275 కోట్లు (లాభాల్లో వాటా కలుపుకుంటే)
*ముంబై ఇళ్ళు - పాలి హిల్ (బాల్య గృహం), బెల్లా విస్టాలో 9 ఫ్లాట్లు
*మెరీనా అపార్ట్‌మెంట్లు కొత్త ఫ్లాట్ ధర రూ. 9.75 కోట్లు (బెల్లా విస్టా, బాంద్రా)
*ఫామ్‌హౌస్ - LAలోని పంచగని ఇంటర్నేషనల్ మాన్షన్ రూ. 75 కోట్లు
*సూపర్ కార్లు - రోల్స్ రాయిస్ ఘోస్ట్, మెర్సిడెస్ S-600, బెంట్లీ, BMW 6-సిరీస్, రేంజ్ రోవర్
జాగ్రత్తగా సినిమాలను ఎంపిక చేసుకునే అమీర్ ఖాన్ ఇటీవలే తారే జమీన్ పర్ సీక్వెల్ 'సీతారే జమీన్ పర్' తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. నెమ్మదిగా వ్యూహాత్మకంగా తెలివైన ఎత్తుగడలతో వందల కోట్ల సామ్రాజ్యాలను నిర్మించడం సాధ్యమేనని అమీర్ ఖాన్ నిరూపించాడు.