యాక్టింగ్‌ బోర్‌ కొట్టే ప్రమాదం ఉంది, అందుకే దానికి నో..!

నటనపై తనకు ఉన్న ఇష్టం కారణంగానే దర్శకత్వంకు దూరంగా ఉండాల్సి వస్తుందని ఆమీర్‌ ఖాన్‌ తాజా ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.;

Update: 2025-06-28 19:30 GMT

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ ఆమీర్‌ ఖాన్‌కి మరోసారి నిరాశ మిగిలింది. ఆయన దర్శకత్వంలో వచ్చిన తారే జమీన్‌ పర్‌ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కానీ ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో సినిమా రాలేదు. ఇటీవల వచ్చిన సితారే జమీన్‌ పర్‌ సినిమాను తారే జమీన్‌ పర్ సినిమాకు సీక్వెల్‌ అంటూ ప్రచారం చేశారు. సీక్వెల్‌కి కూడా తాను దర్శకత్వం వహించలేదు. దర్శకత్వంపై ఆసక్తి ఉన్నప్పటికీ నటన అంటే చాలా ఇష్టం అని, అందుకే తాను దర్శకత్వం వైపు అడుగులు వేయడం లేదని చెప్పుకొచ్చాడు. నటనపై తనకు ఉన్న ఇష్టం కారణంగానే దర్శకత్వంకు దూరంగా ఉండాల్సి వస్తుందని ఆమీర్‌ ఖాన్‌ తాజా ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

తన సితారే జమీన్‌ పర్‌ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆమీర్‌ ఖాన్‌ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.... దర్శకత్వం, నిర్మాణం అనేది చాలా ఆసక్తికర అంశాలు. వాటిని చేయడం ఛాలెంజింగ్‌గా ఉంటుంది. ముఖ్యంగా దర్వకత్వం చేస్తే నటన అనేది బోరింగ్‌గా అనిపిస్తుంది. దర్శకత్వం చేస్తూ నటనపై శ్రద్ధ కనబర్చడం సాధ్యం కాదు. నటన అనేది బోర్‌ కొట్టిస్తుంది. దర్శకత్వం చేయడం వల్ల ఆ తర్వాత నటన అనేది బోరింగ్‌ ఎలిమెంట్‌గా మారడం మనం గమనించొచ్చు. యాక్టింగ్‌ బోర్‌ కొట్టే ప్రమాదం ఉన్న కారణంగానే తాను దర్శకత్వం చేయాలని అనుకోవడం లేదని చెప్పుకొచ్చాడు. దర్శకత్వం చేసే ఉద్దేశం తనకు ఉందని, కానీ అది ఎప్పుడు అనేది మాత్రం ఇప్పుడు చెప్పలేను అన్నాడు.

తారే జమీన్‌ పర్‌ సినిమాకు దర్శకత్వం వహించడంపై ఆమీర్‌ ఖాన్‌ స్పందిస్తూ... ఆ సమయంలో కొన్ని కారణాల వల్ల ఆ సినిమాకు దర్శకత్వం వహించాల్సి వచ్చింది. అప్పుడు ఉన్న పరిస్థితుల కారణంగా తాను దర్శకత్వం చేయాల్సి వచ్చింది. అప్పుడు కూడా నేను అయిష్టంగానే దర్శకత్వం వహించాను. ముందు ముందు తన దర్శకత్వంలో సినిమాలు వస్తాయని ఎదురు చూస్తున్న అభిమానులకు ఆమీర్‌ ఖాన్‌ తాజా ఇంటర్వ్యూలో ఫుల్‌ క్లారిటీ ఇచ్చాడు. తనకు ముందు ముందు కూడా దర్శకత్వం చేసే ఆలోచన లేదు అన్నట్లుగా చెప్పకనే చెప్పాడు. కానీ నటనకు ఎప్పుడు అయితే దూరం అవుతాడో అప్పుడు సినిమాలకు దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

ఆమీర్‌ ఖాన్‌ దశాబ్ద కాలంగా సక్సెస్‌ లేకపోవడంతో నటనకు దూరం అవుతాడనే పుకార్లు షికార్లు చేశాయి. మరో వైపు ఆయన హీరోగా లోకేష్ కనగరాజ్‌ దర్శకత్వంలో సినిమా ఉంటుంది అనే వార్తలు వచ్చాయి. సితారే జమీన్‌ పర్‌ సినిమా కు ముందు తెలుగు దర్శకుడితో ఆమీర్‌ ఖాన్‌ సినిమా ఉంటుంది అనే వార్తలు వచ్చాయి. ఆ విషయమై ఆయన పెద్దగా స్పందించలేదు. కానీ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సినిమా విషయంలో మాత్రం ఆయన ఆసక్తిగా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. మరో వైపు అల్లు అర్జున్‌తో కలిసి ఒక సినిమా చేస్తాడట అంటూ వార్తలు వచ్చాయి. కానీ వార్తలను సున్నితంగా ఖండించాడు. తాను అల్లు అర్జున్‌తో సినిమాను చేయడం లేదని క్లారిటీ ఇచ్చాడు.

Tags:    

Similar News