కూలీ.. క్యామెడీ పీస్ అయిపోయాడుగా..!

కూలీ చూసిన అందరికీ వచ్చే మొదటి డౌట్ అసలు అమీర్ ఖాన్ లాంటి స్టార్ ఈ సినిమాలో ఆ క్యామియోకి ఎందుకు ఒప్పుకున్నాడా అని.;

Update: 2025-08-16 08:26 GMT

కూలీ చూసిన అందరికీ వచ్చే మొదటి డౌట్ అసలు అమీర్ ఖాన్ లాంటి స్టార్ ఈ సినిమాలో ఆ క్యామియోకి ఎందుకు ఒప్పుకున్నాడా అని. ఎంత రజినీ మీద అభిమానం ఉన్నా కూడా తన స్టార్ డం కి తగిన రోల్ వస్తే సరే అని చేసేయొచ్చు కానీ అలా కాకుండా ఎలా పడితే అలా జస్ట్ క్యామియోనే కదా అనుకుంటే ప్రశంసలు రావడం పక్కన పెడితే నెగిటివ్ కామెంట్స్ రాకపోతే మంచిదే. కూలీ సినిమా చూశాక అమీర్ ఖాన్ ని కచ్చితంగా మిస్ యూజ్ చేశారనే అనిపిస్తుంది. అంత స్టార్ డం ఉన్న అమీర్ ని ఒక బలమైన క్యామియో కోసం వాడి ఉంటే బాగుండేది కానీ లోకేష్ అలా చేయలేదు.

అమీర్ రోల్ చూసి షాక్..

అమీర్ ఖాన్ లోకేష్ మీద ఉన్న నమ్మకంతోనే అలా చేసి ఉండొచ్చు. ముఖ్యంగా సూపర్ స్టార్ రజనీకాంత్ మీద ఉన్న అభిమానం ఆయన్ను అలా చేసేలా చేసింది. ఐతే అమీర్ రోల్ ని చూసి అందరు షాక్ అయ్యారు. ఈమాత్రం దానికా ఇంత హడావిడి చేసింది అనుకున్నారు. అసలే అమీర్ ఖాన్ కెరీర్ బాలీవుడ్ లో బాగాలేదు. ఆయన సినిమాలన్నీ వరుసగా నిరాశపరుస్తున్నాయి. ఇలాంటి టైం లో సౌత్ సినిమాల్లో అది క్యామియో రోల్ అని చెప్పి జోకర్ ని చేశారు.

రోలెక్స్ రోల్ చేసిన సూర్య తో పోల్చారు..

ముఖ్యంగా అమీర్ ఖాన్ ఫ్యాన్స్ అయితే కూలీ చూసి అప్సెట్ అవుతున్నారు. సరదాగా ఏదో ఒక ట్రయల్ వేద్దామనుకున్నాడు తప్ప సీరియస్ గా చూస్తే అమీర్ అసలు ఈ రోల్ చేయాల్సింది కాదు. అమీర్ ఖాన్ లుక్ కూడా అంతగా మెప్పించలేదు. మరి లోకేష్ ఎలా ఆలోచించి అమీర్ ఖాన్ క్యామియోని రాసుకున్నాడు కానీ అసలు వర్క్ అవుట్ కాలేదు. అంతేకాదు రిలీజ్ ముందు ఈ రోల్ ని విక్రం లో రోలెక్స్ రోల్ చేసిన సూర్య తో పోల్చారు. రోలెక్స్ రోల్ విక్రం సినిమాను చివర్లో అలా పైకి లేపింది. కానీ అమీర్ ఖాన్ దాహా రోల్ కూలీకి బ్యాడ్ మార్క్ తెచ్చింది. అమీర్ ఖాన్ ఇలాంటివి చేసేప్పుడు కాస్త ఆలోచించాల్సిన అవసరం ఉందని అంటున్నారు.

కూలీ సినిమాలో మిగతా స్టార్ కాస్ట్ కూడా తగినంతగా వాడుకోలేదన్న టాక్ ఉంది. ఐతే లోకేష్ కనకరాజ్ అమీర్ విషయంలో ఫ్యాన్స్ ని మరింత హర్ట్ అయ్యేలా చేశాడు. కూలీ సినిమాకు ఇవన్నీ పాజిటివ్స్ అవుతాయనుకున్న లోకేష్ కి ఈ రెస్పాన్స్ షాక్ ఇస్తుందని చెప్పొచ్చు.

Tags:    

Similar News