హిందూ ధ‌ర్మాన్ని కించ‌ప‌రిచాడంటూ అమీర్‌ఖాన్‌ పై ఫైరింగ్

మ‌త‌ప‌ర‌మైన భావోద్వేగాల‌ను ట‌చ్ చేస్తే సీన్ ఎలా సితారైపోతుందో ఇప్పుడు మ‌రోసారి బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కి అర్థ‌మైంది. అత‌డు హిందూ మ‌తాన్ని కించ‌ప‌రిచాడ‌ని నెటిజ‌నులు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.;

Update: 2025-12-02 16:57 GMT

మ‌త‌ప‌ర‌మైన భావోద్వేగాల‌ను ట‌చ్ చేస్తే సీన్ ఎలా సితారైపోతుందో ఇప్పుడు మ‌రోసారి బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కి అర్థ‌మైంది. అత‌డు హిందూ మ‌తాన్ని కించ‌ప‌రిచాడ‌ని నెటిజ‌నులు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. ఈ ట్రోలింగ్ చూశాక‌, సెల‌బ్రిటీ నుంచి సామాన్యుడి వ‌ర‌కూ ఏ ఒక్క‌రైనా కులం, మ‌తం గురించి మాట్లాడే ముందు చాలా ఆలోచించుకుని, తెలివిగా మాట్లాడాల‌ని అర్థ‌మ‌వుతుంది. గాలి వాటంగా ఏం మాట్లాడినా అది కొంప‌లు ముంచుతుంద‌ని కూడా గ్ర‌హించాలి.

అస‌లు మ్యాట‌ర్ లోకి వెళితే.. బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ష‌నిస్ట్ అమీర్ ఖాన్, కియ‌రా అద్వాణీ తాజాగా ఓ బ్యాంక్ ప్ర‌క‌ట‌న‌లో క‌నిపించారు. అయితే ఈ ప్ర‌క‌ట‌న సోష‌ల్ మీడియాల్లో వైర‌ల్ అయిన కొద్ది సేప‌టికే స‌ద‌రు

బ్యాంకు మతపరమైన మ‌నోభావాలను దెబ్బతీసిందని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. దీనికి కార‌కుడైన అమీర్ ఖాన్‌ను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. AU బ్యాంక్ తాజా అడ్వ‌ర్టైజ్‌మెంట్ మతపరమైన భావాలను దెబ్బతీయ‌డంతో ఈ బ్యాంక్ కి ఎవ‌రూ వెళ్ల‌కూడ‌ద‌ని, డిపాజిట్ల‌తో ఆద‌రించ‌కూడ‌ద‌ని కూడా ఒక సెక్ష‌న్ ప్ర‌జ‌లు సీరియ‌స్ అవుతున్నారు.

అస‌లింత‌కీ ఈ ప్ర‌క‌ట‌న‌లో ఏం ఉంది? అన్న‌ది ఆరా తీస్తే, కాన్సెప్ట్ ప్ర‌కారం.. వివాహం తర్వాత స‌హ‌జంగా వధువు తన ఇంటిని వదిలి భర్త ఇంటికి వెళ్ల‌డం సంప్రదాయం. కానీ ఇక్క‌డ అంతా రివ‌ర్స్. అమీర్ ఖాన్ స్వ‌యంగా కియ‌రాను పెళ్లాడి, ఆమె ఇంటికి వెళ‌తాడు. ఈ ప్ర‌క‌ట‌న‌లో అవ‌క‌రంపై `క‌శ్మీర్ ఫైల్స్` దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి సీరియ‌స్‌గా స్పందించారు. ``సామాజిక, మతపరమైన సంప్రదాయాలను మార్చడానికి బ్యాంకులు ఎప్పటి నుండి బాధ్యత వహిస్తున్నాయో నాకు అర్థం కాలేదు? అవినీతి బ్యాంకింగ్ వ్యవస్థను మార్చడం ద్వారా ఏయు బ్యాంక్ మ‌రింత జ‌వాబుదారీగా ఉండాల‌ని నేను భావిస్తున్నాను. ఐసీ బక్వాస్ కర్తే హై ఫిర్ కెహ్తే హై! హిందువులను కించ‌ప‌రిచారు.. ! వారు ట్రోల్ చేస్తున్నారు..`` అని రాసారు.

#AamirKhan_Insults_HinduDharma అనే హ్యాష్ ట్యాగ్ ఈ మంగ‌ళ‌వారం (12 అక్టోబర్ 2022) నాడు ఎక్స్ లో ట్రెండ్ అవుతోంది. ఏయు బ్యాంక్ తో పాటు, అమీర్ ఖాన్ ని బ‌హిష్క‌రించాల‌ని చాలా మంది నెటిజ‌నులు దుమ్మెత్తిపోస్తున్నారు. లింక్డ్ఇన్ పోస్ట్‌లు కూడా ఈ ప్రకటనను విమర్శించాయి.

నిజానికి హిందూ సంస్కృతిని త‌ప్పుడు ప‌ద్ధ‌తిలో చిత్రీక‌రించ‌డం అమీర్ ఖాన్ కి ఇదే మొద‌టిసారి కాదు. 2021లో దీపావళి పండుగ సందర్భంగా ప్రజల మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు సియట్ టైర్స్ కోసం అత‌డు చేసిన‌ ప్రకటనను విమర్శించారు. అంత‌కుముందు పీకే చిత్రంలో దేవుళ్ల‌ను కించ‌ప‌రిచిన‌ప్పుడు పెద్ద వివాదం చెల‌రేగిన‌ సంగ‌తి తెలిసిందే. ఆ స‌మ‌యంలో ఖాన్ ల త్ర‌యాన్ని దేశం నుంచి బ‌హిష్క‌రించాల‌ని కూడా కొంద‌రు డిమాండ్ చేసారు. భార‌త‌దేశంలో అత్యంత సున్నిత‌మైన అంశాల జాబితాను సిద్ధం చేసుకుని సెల‌బ్రిటీలు ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకుని మాట్లాడాల్సి ఉంటుంద‌ని కొంద‌రు సూచిస్తున్నారు. ఈ జాబితాలో కులం, మ‌తం త‌ప్ప‌నిస‌రి.



Tags:    

Similar News