యంగ్ హీరోకి ప్ర‌భాస్, రానా లిప్ట్!

సాయి కుమార్ వార‌సత్వంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఆది కెరీర్ ఎలా సాగుతుందో తెలిసిందే.;

Update: 2025-11-05 06:40 GMT

సాయి కుమార్ వార‌సత్వంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఆది కెరీర్ ఎలా సాగుతుందో తెలిసిందే. ఆరంభంలో వ‌రుస‌గా రెండు..మూడు విజ‌యాలు అందుకోవ‌డంతో న‌టుడిగా బిజీ అయ్యాడు. వ‌రుస‌గా అవ‌కాశాలు వ‌చ్చాయి. వాటిలో హిట్లు కంటే ప్లాప్ లే ఎక్కువ. అయినా స‌రే ఆది కెరీర్ లో మాత్రం ఎక్క‌డా ఖాళీగా లేడు. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ సినిమాలు చేస్తూనే ఉన్నాడు. కానీ అవి ఎప్పుడు రిలీజ్ అయిపోతున్నాయో కూడా తెలియ‌దు. చెప్పుకోవ‌డానికి చాలా సినిమాలున్నాయి. కానీ వాటిలో విజ‌యాలే ఎక్క‌డా క‌నిపించ‌వు.

ప్ర‌భాస్ ఎంట్రీతో భారీ హైప్:

తాజా లైన‌ప్ కూడా అంతే స్ట్రాంగ్ గా ఉంది. ప్ర‌స్తుతం ఆది న‌టిస్తోన్న ఐదు సినిమాలు ఆన్ సెట్స్ లో ఉన్నాయి. వాటిలో `శంబాల` చిత్రం డిసెంబ‌ర్ లో రిలీజ్ అవుతుంది. ఈ సినిమాపై కాస్త బ‌జ్ క‌నిపిస్తోంది. టైటిల్ స‌హా రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాల‌పై పాజిటివ్ ఇంప్రెష‌న్ ప‌డింది. అయితే ఈ చిత్రాన్ని హీరో ప్ర‌భాస్ రిలీజ్ చేయ‌డంతో భారీ హైప్ మొద‌లైంది. దీంతో సినిమాకు పెద్ద ఎత్తున రిలీజ్ ద‌క్కుతుంది. చాలా మంది ప్రేక్ష‌కుల‌కు ఈ సినిమా చేరే అవ‌కాశం ఉంటుంది. ఎంత మంచి సినిమా తీసినా రిలీజ్ అన్న‌ది స‌వ్యంగా జ‌ర‌గ‌క‌పోతే అదెంత గొప్ప క‌థ అయినా ప్రేక్ష‌కుల‌కు చేర‌దు.

స్టార్ హీరోలు మ‌ద్ద‌తుగా:

రిలీజ్ అయిన థియేట‌ర్ల వ‌ర‌కే ప‌రిమితం అవుతుంది. ఆ థియేట‌ర్లు ఎక్క‌డో మారు మూల ఉండ‌టంతో మౌత్ టాక్ కూడా బ‌యట‌కు రాదు. చాలా సినిమాలు అలాగే కిల్ అవుతున్నాయి. పేరున్న సంస్థ‌ల ద్వారా రిలీజ్ అయితే పాజిటివ్ టాక్ వ‌చ్చిందంటే? బంప‌ర్ విజ‌యాన్ని అందుకుంటాయి. శంబాల‌కి ఇప్పుడా ఛాన్స్ ఉంది. ప్ర‌భాస్ అభిమానుల కూడా ఈసినిమాను ఆద‌రించే అవ‌కాశం ఉంటుంది. రానా కూడా ట్రైల‌ర్ చూసి మెచ్చుకున్నాడు. త‌న నుంచి కావాల్సినంత స‌హాయం ఉంటుంద‌ని భ‌రోసా క‌ల్పించాడు.

ఇమేజ్ తో ప‌నిలేకుండా ఆస్వాద‌న‌:

ఇంకా రిలీజ్ కు కొంత స‌మ‌యం ఉన్న నేప‌థ్యంలో మ‌రింత మంది స్టార్లు ఈ చిత్రాన్ని ప్ర‌మోట్ చేయ‌డానికి ముందుకొచ్చే అవ‌కాశం ఉంది. ప్ర‌చార చిత్రాలు న‌చ్చినా? రిలీజ్ త‌ర్వాత సినిమా న‌చ్చినా స్టార్ హీరోలంతా ఎంతో స్పోర్టివ్ గా స్పందిస్తున్నారు. ఒక‌ప్ప‌టిలా ముడుచుకుని కూర్చోలేదు. త‌మ రివ్యూను సోష‌ల్ మీడియావ ఏదిక‌గా పంచుకుంటున్నారు. `శంబాల` రిలీజ్ అనంత‌రం పాజిటివ్ టాక్ వచ్చిందంటే చాలా మంది స్లార్టు వీక్షించ‌కే అవ‌కాశం ఉంటుంది.

Tags:    

Similar News