ఆ హీరో డెడికేషన్ చూసి షాకయ్యా!
ప్రతీదీ ఎంతో క్షుణ్ణంగా ఆలోచించి, చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తూ తమదైన గుర్తింపు తెచ్చుకుంటారు. అలాంటి వారిలో టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ ఆది పినిశెట్టి కూడా ఒకరు.;
ఇండస్ట్రీలోకి కొందరు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి కష్టపడితే, మరికొందరు మాత్రం బ్యాక్ గ్రౌండ్ తో వచ్చినప్పటికీ తమకంటూ సొంత గుర్తింపు తెచ్చుకోవడానికి చాలా కష్టపడుతుంటారు. ప్రతీదీ ఎంతో క్షుణ్ణంగా ఆలోచించి, చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తూ తమదైన గుర్తింపు తెచ్చుకుంటారు. అలాంటి వారిలో టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ ఆది పినిశెట్టి కూడా ఒకరు.
బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ సొంత గుర్తింపు కోసం ఆరాటం
ఆది పినిశెట్టి తండ్రి రవిరాజా పినిశెట్టి టాలీవుడ్ లో ప్రముఖ డైరెక్టర్. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, మోహన్ బాబు లాంటి స్టార్లతో సినిమాలు చేసి ఎన్నో హిట్లు అందుకున్న రవిరాజా పినిశెట్టి కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆది ఎప్పుడూ తన వారసత్వాన్ని అడ్డుపెట్టుకుని ఆఫర్లు అందుకోలేదు. ఇండస్ట్రీలో తనకంటూ మంచి పేరు రావాలని దాని కోసం ఎంత కష్టపడుతూ వస్తున్నారు.
ఒక వి చిత్రం సినిమాతో ఆది యాక్టింగ్ లోకి అడుగుపెట్టగా, ఆ తర్వాత తమిళంలో ఈరం అనే సినిమా చేసి దాంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సరైనోడు, నిన్ను కోరి, రంగస్థలం, మిరుగం లాంటి సినిమాల్లో ఆది యాక్టింగ్ కు అందరూ ఫిదా అయిపోయారు. రీసెంట్ గా మయసభ వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆది ఆ సిరీస్‌తో మంచి పేరు తెచ్చుకున్నారు.
ఆది వల్ల మయసభ బాగా ఎలివేట్ అయింది
ఆది పినిశెట్టి యాక్టింగ్ గురించి, అతనితో వర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్ గురించి మయసభ డైరెక్టర్ దేవ కట్టా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. హీరోగానైనా, విలన్‌గానైనా, సపోర్టింగ్ రోల్స్ లో నైనా ఆది అద్భుతమైన నటనను కనబరచగలడని, నిన్ను కోరి సినిమాలో ఆది యాక్టింగ్, అతని డిక్షన్ చూసి తాను ఆశ్చర్యపోయినట్టు దేవా కట్టా చెప్పారు. మయసభ ఓటీటీ ఫార్మాట్ కు మారినప్పుడు హీరోగా తనకు వెంటనే ఆది గుర్తొచ్చాడని, వెంటనే స్క్రిప్ట్ ను పంపి, 8 గంటల పాటూ జూమ్ కాల్ లో ఆ కథను ఆదికి చెప్పానని, ఆది ఈ ప్రాజెక్టును ఒప్పుకున్న తర్వాత టీమ్ లో మరింత ఉత్సాహం నెలకొందని, కథలోని చిన్న చిన్న విషయాలను కూడా ఆది చాలా జాగ్రత్తగా పట్టుకుని వాటిని స్క్రీన్ పైకి తీసుకొచ్చారని, కెకెఎన్ పాత్ర తడబడటం, అతని కలలకు వ్యతిరేకంగా ఉన్న ఆర్థిక పరిమితులు, ఎమోషన్స్ ఇలా ప్రతీ సమస్యను ఎదుర్కొనే పాత్రలో ఆది నటించిన తీరు అద్భుతంగా పండటం వల్లే ఇవాళ మయసభకు మంచి రెస్పాన్స్ వస్తోందని ఆయన అన్నారు. తన యాక్టింగ్ తో ఆది మయసభలో ఆడియన్స్ కు ఎన్నో హై మూమెంట్స్ ఇచ్చారని దేవా కట్ట చెప్పారు.