బన్నీ కోసం అంత గొప్ప కథ రాసాడా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 22వ చిత్రం అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది.;
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 22వ చిత్రం అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. భారీ టెక్నికల్ అంశాలతో ముడిపడిన కథగా తెలుస్తోంది. ఖ ర్చు కూడా వందల కోట్లు అవుతుంది. అయితే ఎన్ని వందల కోట్లు అవుతుంది? అన్నది మాత్రం ఇంత వరకూ బయటకు రాలేదు. ఈ నేపథ్యంలో చెన్నై యూనివర్శిటీలో ప్రత్యక్షమైన అట్లీ ప్రాజెక్ట్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ చేసాడు.
ఆయనతో పాటు ఆయన టీమ్ స్పందించిన తీరు చూస్తే స్టన్ అవ్వాల్సిందే. ఎందుకంటే ప్రాజెక్ట్ ను అంత గొప్పగా లేపుతూ వ్యాఖ్యానించారు. ఈ సినిమా భారతీయ సినిమా నిర్మాణానికి కొత్త సాంకేతికతను పరిచ యం చేస్తుంది. ఇప్పటి వరకూ నిర్మించిన అన్ని చిత్రాల కంటే ఇదే అత్యంత భారీ బడ్జెట్ చిత్రమ వుతుంది. బడ్జెట్ ఎంత అన్నది ఇంకా నిర్ణయించలేదు. మా దృష్టి బడ్జెట్ వైపు ఉండకూడదు.
చాలా పెద్ద కల కంటున్నాము. సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ విజయం భారతీయ సినిమాకు ఓ గర్వ కారణంగా ఉంటుందని అట్లీ చెప్పుకొచ్చాడు. కాపీ రైట్ ఆరోపణ వస్తోన్న నేపథ్యంలో అట్లీ దానికి బధు లిచ్చాడు. ఏ హాలీవుడ్ సినిమా నుంచి ప్రేరణ పొందలేదన్నారు. ఈ సినిమాకు పని చేస్తోన్న కొంత మంది టెక్నికల్ స్టాప్ ఓ రేంజ్ లో చెప్పుకొచ్చారు. `స్టోరీ చదివాను . తల తిరుగుతుంది.
ఇప్పటి వరకూ చదివిన స్క్రిప్ట్ లు అన్నింటికీ భిన్నమైంది. విఎఫ్ ఎక్స్ పరంగా తాము సృష్టించాల నుకున్న అసలైన కథగా వర్ణించారు. ఇందులో బన్నీకి జోడిగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే ని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే ప్రాజెక్ట్ ముంబైలో ప్రారంభమైంది. రెగ్యులర్ షూటింగ్ కి రెడీ అవుతున్నారు.