ఎమ్మీ అవార్డుల్లో సత్తా చాటిన అడాల్‌సెన్స్
ఇంటర్నేషనల్ సినీ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్మాతక్మంగా భావించే 77వ ఎమ్మీ అవార్డ్స్ ఫంక్షన్ లాస్ ఏంజిల్స్ ఓలని పికాక్ థియేటర్లో ఎంతో గ్రాండ్ గా జరిగింది.;
ఇంటర్నేషనల్ సినీ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్మాతక్మంగా భావించే 77వ ఎమ్మీ అవార్డ్స్ ఫంక్షన్ లాస్ ఏంజిల్స్ ఓలని పికాక్ థియేటర్లో ఎంతో గ్రాండ్ గా జరిగింది. ఈ ఫంక్షన్ ను హాలీవుడ్ కు చెందిన ప్రముఖులు, సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు. అమెరికన్ టెలివిజన్ ఇండస్ట్రీలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వారిని ఎమ్మీ అవార్డులతో సత్కరిస్తుంటారు.
అకాడమీ ఆఫ్ టెలివిజన్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ప్రతీ ఏటా ఈ అవార్డులను ఇస్తూ వస్తోంది. కాగా ప్రతీ ఏడాది లాగానే ఈ సారి కూడా నామినేషన్స్ లో ఎన్నో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు పోటీ పడగా, అందులో నెట్‌ఫ్లిక్స్ వేదికగా రిలీజైన అడాల్‌సెన్స్ ఏకంగా 5 అవార్డులను సొంతం చేసుకుంది. ఇందులో నటించిన ఓవెన్ కూపర్ అతి చిన్న వయసులోనే ఎమ్మీ అవార్డును అందుకుని రికార్డు సృష్టించారు. 2024-2025 మధ్యలో ప్రసారమైన కార్యక్రమాలకు గానూ ఈ అవార్డులను అందించగా, అడోల్‌సెన్స్, ఆర్కేన్ లీగ్ ఆఫ్ లెజెండ్స్ సిరీస్‌లకు అవార్డులు దక్కాయి. అవి కాకుండా ఏయే కేటగిరీలో ఎవరు అవార్డులు అందుకున్నారంటే..
ఉత్తమ నటుడు: నోహ్ వైల్ (ది పిట్)
ఉత్తమ నటి: బ్రిట్నీ లీ లోయర్ (సెవెరెన్స్)
ఉత్తమ డ్రామా సిరీస్: ది పిట్
ఉత్తమ నటుడు (సిరీస్): స్టీఫెన్ గ్రాహం (అడాల్‌సెన్స్)
ఉత్తమ సహాయనటి (సిరీస్): ఎవరిన్ డోహెర్టీ (అడాల్‌సెన్స్)
ఉత్తమ సహాయనటుడు (సిరీస్): ఓవెన్ కూపర్ (అడాల్‌సెన్స్)
ఉత్తమ సిరీస్: అడాల్‌సెన్స్
ఉత్తమ కామెడీ సిరీస్: ది స్టూడియో
ఉత్తమ స్క్రిప్ట్ రైటర్: లాస్ట్ వీక్ టునైట్ (సాటర్డే నైట్ లైవ్)
ఉత్తమ డైరెక్టర్: ఆడమ్ రాండాల్ (స్లో హార్సెస్)
ఉత్తమ దర్శకుడు (లిమిటెడ్ సిరీస్): ఫిలిమ్ బారంటిని (అడాల్‌సెన్స్)
ఉత్తమ సహాయ నటుడు (కామెడీ): జెఫ్ హిల్లర్ (సమ్‌బడీ సమ్‌వేర్)
ఉత్తమ సహాయనటి (కామెడీ): హన్నా ఐన్‌బండర్ (హ్యాక్స్)
ఉత్తమ రియాలిటీ షో: ది ట్రయేటర్స్