2026 లో కొత్త భామలతో హాయ్!
టాలీవుడ్ కి నిరంతరం ఎంతో మంది కొత్త భామలు దిగుమతి అవుతుంటారు. వారిలో కొందరు మాత్రమే సక్సెస్ అవుతుంటారు.;
టాలీవుడ్ కి నిరంతరం ఎంతో మంది కొత్త భామలు దిగుమతి అవుతుంటారు. వారిలో కొందరు మాత్రమే సక్సెస్ అవుతుంటారు. మిగిలిన వారు ప్రత్యామ్నాయాలు వెతుక్కుని బయటకు వెళ్లిపోతుంటారు. కానీ టాలీవుడ్ లో హిట్ అందుకున్న హీరోయిన్ మాత్రం లక్కీ గాళ్లే అవుతుంది. ఇక్కడున్నంత క్రేజ్ మరే భాషలో ఉండదు. ఇక్కడ సంపా దించినంత మరే భాషలో కూడా సంపాదించడానికి ఉండదు. టాలీవుడ్ లో ఉన్న పోటీతత్వమే అవకాశాలతో పాటు, మంచి పారితోషికం కూడా కల్పిస్తుంది. తాజాగా 2026 లో కొంత మంది భామలు టాలీవుడ్ కి హాయ్ చెప్పడానికి రెడీ అవుతున్నారు. దుల్కార్ సల్మాన్ హీరోగా నటిస్తోన్న `ఆకాశంలో ఒక తార` చిత్రం తో తెలుగు నటి సాత్విక వీరవల్లి హీరోయిన్గా పరిచయమవుతుంది. స్వచ్ఛమైన తెలుగు అమ్మాయి లుక్ ఇప్పటికే ఆకట్టుకుంటుంది.
లంగావోణీలో అమ్మడు నిజంగానే ఆకాశంలో ఒక తారలా ఉంది. గీతా ఆర్స్ట్- వైజయంతీ బ్యానర్లు నిర్మిస్తోన్న చిత్రంలో ఓ తెలుగు నటిని తీసుకున్నారంటే? ఆమె సంథిగ్ స్పెషల్ కు అవకాశం ఉంది. ఈ విషయంలో సాత్విక ఎంతో లక్కీ కూడా. ఇంత పెద్ద నిర్మాణ సంస్థలో హీరోయిన్ గా పరిచయమైతే వచ్చే గుర్తింపు ప్రత్యేకమే. విజయం సాధిస్తే కొత్త అవకాశాలు క్యూ కడతాయి.
ఈ సినిమా తర్వాత సాత్వికకు టాలీవుడ్ లో మంచి భవిష్యత్ ఉంటుందని పలువురు భావిస్తున్నారు.అలాగే ప్రభాస్ హీరోగా నటిస్తోన్న `ఫౌజీ` సినిమాతో పాకిస్తాన్ మూలాలున్న ఇమ్మాన్వీ ఇస్మైల్ హీరోయిన్ గా లాంచ్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే అమ్మడు డాన్సింగ్ ట్యాలెంట్ తో యువతను ఆకట్టుకుంది. హను రాఘవపూడి హీరోయిన్ గా తీసుకున్నాడంటే? ఆమె ప్రతి భావంతురాలు అయ్యే ఉంటుందని అందరి అంచనా. పాన్ ఇండియాలో రిలీజ్ అవుతున్న ఈ సినిమా సక్సెస్ అయితే ఇమ్మాన్వీకి టాలీవుడ్ లో మంచి భవిష్యత్ ఉంటుంది.
ఇక్కడ నుంచి నేరుగా బాలీవుడ్ కి ప్రమోట్ అవ్వొచ్చు. అలాగే గుణశేఖర్ స్వీయా దర్శకత్వంలో నిర్మిస్తోన్న `యూఫోరియా` సినిమాతో సారా అర్జున్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది. `ధురంధర్` విజయంతో అమ్మడి పేరు పాన్ ఇండియాలో ఇప్పటికే సంచలనంగా మారింది. ఆ సినిమా క్రేజ్ యూఫోరియాకు కలిసొస్తుంది. దీంతో `యూఫోరియా` టీమ్ సారా అర్జున్ ని ప్రత్యేకంగా ట్రీట్ చేస్తోంది. ఆమె క్రేజ్ ను ఎన్ క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే సారాకి టాలీవుడ్ లో అవకాశాలు క్యూ కడుతున్నాయనే ప్రచారం జోరుగా జరుగుతోంది. `ది రాజాసాబ్` సినిమాతో మాళవిక మోహనన్ ఇదే ఏడాది లాంచ్ అయిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా వాటిని అందుకోవడంలో విఫలమైంది. మరి ఈ లాంచింగ్ మాళవికకు ఎలాంటి అవకాశాలు తెచ్చి పెడుతుందో చూడాలి.