2026 గోల్డెన్ గ్లోబ్ అవార్డుల నామినేషన్లు ఇవే!
83వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కోలాహాలం మొదలైంది. 2026 ఏడాదికి గానూ నామినేట్ అయిన చిత్రాల జాబితా వెలువడింది.;
83వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కోలాహాలం మొదలైంది. 2026 ఏడాదికి గానూ నామినేట్ అయిన చిత్రాల జాబితా వెలువడింది. జనవరిలో జరగబోయే అవార్డుల ప్రధానోత్స వానికి సంబంధించి కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్ వేదికగా నామినేషన్లు ప్రక టించారు. ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు లియోనార్డో డికాప్రియో నటించిన `వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనతర్లో` చిత్రం ఏకంగా ఎనిమిది విభాగాల్లో నామినేట్ అయింది. నార్వేజియన్ చిత్రం `సెంటిమెంటల్ వ్యాల్యూ` ఎనిమిది నామినేషన్లతో రెండవ స్థానంలో నిలవగా, `ది వైట్ లోటస్` ఆరు విభాగాల్లో నామినేట్ అయ్యా యి. ఈ నామినేషన్లను హాలీవుడ్ నటులు మార్లాన్ వెయెన్స్ - స్కై పి మార్షల్ లైవ్ ఈవెంట్ లో ప్రకటించారు.
నామినేషన్లకు సంబంధించిన జాబితా ఇదే: బెస్ట్ ఫిల్మ్ - డ్రామా విభాగంలో `ఫ్రాంకెన్‌స్టైన్`, `హామ్నెట్`, `ఇట్ వాస్ జస్ట్ అన్ యాక్సిడెంట్`,` ది సీక్రెట్ ఎజెంట్`, `సెంటిమెంటల్ వ్యాల్యూ` `సిన్నర్స్`,`బ్లూ మూన్`, `బగోనియా`, `మార్టీ సుప్రీమ్`,` నో అదర్ చాయిస్`, `నువెల్ వాగ్ `, `వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనతర్` చిత్రాలు పోటీ పడుతున్నాయి.అలాగే బెస్ట్ ఫీమెల్ యాక్టర్ - డ్రామా లో నామినేట్ అయినవారు జెస్సీ బక్లే (హ్యామ్నెట్), జెన్నిఫర్ లారెన్స్ (డై మై లవ్), రెనేట్ రీన్స్‌వే (సెంట్ మెంటల్ వ్యాల్యూ), జూలియా రాబర్ట్స్ (ఆఫ్టర్ ది హంట్), టెస్సా టాంప్సన్ (హెద్దా), ఎవా విక్టర్ (సారీ బాబీ) పోటీ బరిలో నిలిచారు.
బెస్ట్ మేల్ యాక్టర్ విభాగం నుంచి జోయెల్ ఎడ్జర్టన్ (ట్రెయిన్ డ్రీమ్స్), ఆస్కర్ ఐక్ (ఫ్రాంకెన్‌స్టైన్), మైకెల్ బి జోర్డాన్ (సిన్నర్స్), వాగ్నర్ మూరా (ది సీక్రెట్ ఏజెంట్), జెరెమీ ఆలెన్ వైట్ (డెలివర్ మీ ఫ్రం నోహ్వేర్). మ్యూజికల్ మరియు కామెడీ కేటగిరి నుంచి బెస్ట్ ఫీమెల్ యాక్టర్స్ లో నామినేషన్ పొందినవారు. రోస్ బైరన్, సింథియా ఎరివో, కేట్ హడ్సన్, చేస్ ఇన్ఫినిటీ, అమెండా సెఫ్రైడ్ మరియు ఎమ్మా స్టోన్. బెస్ట్ మేల్ యాక్టర్ గా నామినేట్ అయినవారు టిమోతి చలమేట్, జార్జ్ క్లూనీ, లియోనార్డో డికాప్రియో, ఇథాన్ హాక్, లీ బ్యున్-హన్ మరియు జెస్సీ ప్లెమన్స్.
యానిమేటెడ్ ఫిల్మ్ ఫీచర్స్ విభాగం నుంచి ఆర్కో డిమన్ స్లేయర్: `కిమెట్సు నో యైబా` – `ఇన్ఫినిటీ కాసిల్`, ఎలియో, కెపాప్ డీమన్ హంటర్స్, `లిటిల్ అమెలీ` ,` జూటోపియా 2` చిత్రాలు పోటీలో ఉన్నాయి. నాన్ ఇంగ్లీష్ సినిమాల విభాగంలో నామినేషన్స్: `ఇట్ వాస్ జస్ట్ అన్ యాక్సిడెంట్`, `నో అదర్ చాయిస్`,`ది సీక్రెట్ ఏజెంట్`, `సెంటిమెంటల్ వ్యాల్యూ`, `సిరాట్` , `ది వాయిస్ ఆఫ్ హింద్ రజబ్` పోటీలో ఉన్నాయి.
ఫీమేల్ సపోర్టింగ్ రోల్స్ నామినేషన్స్: ఎమిలీ బ్లంట్, ఎల్ ఫానింగ్, ఎరియానా గ్రాండే, ఇంగా ఐబ్స్‌డాటర్ లిల్లియాస్, ఎమి మాడిగన్ మరియు టేయానా టేలర్ ఉన్నారు. మేల్ సపోర్టింగ్ రోల్స్ నామినేషన్స్: బెనిసియో డెల్ టోరో, జేకబ్ ఎలోర్డీ, పాల్ మేస్త్కల్, షాన్ పెన్, అడమ్ సాండ్‌లర్, స్టెలాన్ స్కార్స్‌గార్డ్ పోటీ పడుతు న్నారు.దర్శకత్వ విభాగం నుంచి నామినీలు: పాల్ థామస్ ఆండర్సన్, రియాన్ కూల్గర్, గిలెర్మో డెల్ టోరో, జఫార్ పానాహీ, జోయాకిమ్ ట్రియర్, క్లో జావో పోటీ పడుతున్నారు.
బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో : అల్‌జాంగ్‌లు అలెక్సాండర్ డెస్ప్లాట్, లూడ్విగ్ గోరాన్‌సన్, జోనీ గ్రీన్‌వూడ్, మ్యాక్స్ రిచ్టర్ మరియు హాన్స్ జిమ్మర్ పోటీ పడుతు న్నారు. ఇదే విభాగం నుంచి అవతార్ : ఫైర్ అండ్ యాష్,`కెపాప్ డిమోన్హంటర్స్`, `సిన్నర్స్`, `వికెడ్: ఫర్ గుడ్ మరియు ట్రైన్ డ్రీమ్స్ ట్రాక్స్ కూడా పోటీ బరిలో ఉన్నాయి.అలాగే సినిమాటిక్ మరియు బాక్స్ ఆఫీస్ అచీవ్‌మెంట్ కేటగిరీకి `అవతార్: ఫైర్ అండ్ యాష్`, కెపాప్ డిమోన్ హంటర్స్`,` మిషన్: ఇంపాసిబుల్ – ది ఫైనల్ రికనింగ్`, `సిన్నర్స్`, `వెపన్స్`, `వికెడ్: ఫర్ గుడ్` , `జుటోపియా 2` వంటి కమర్శియల్ రిలీజ్ లు పోటీలో ఉన్నాయి.