ద్వితీయార్థంలో తెలుగులో క్లీన్ హిట్ కరువైందా?

2025.. ఈ ఏడాది సంక్రాంతి బాక్స్ ఆఫీస్ బరిలో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ , బాలకృష్ణ డాకు మహారాజ్ , వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు దిగి.. బాక్సాఫీస్ వద్ద సత్తా చాటే ప్రయత్నం చేశాయి;

Update: 2025-09-21 07:30 GMT

2025.. ఈ ఏడాది సంక్రాంతి బాక్స్ ఆఫీస్ బరిలో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ , బాలకృష్ణ డాకు మహారాజ్ , వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు దిగి.. బాక్సాఫీస్ వద్ద సత్తా చాటే ప్రయత్నం చేశాయి. అందులో సంక్రాంతికి వస్తున్నాం సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకొని.. ప్రాంతీయ సూపర్ హిట్ మూవీగా నిలిచింది. ఇకపోతే ఈ ఏడాది ప్రారంభం మొదలవ్వడమే మంచి జోరుతో మొదలైనా.. కీలకమైన సమ్మర్ మాత్రం చాలా చప్పగా సాగిందనే చెప్పాలి. ఈ సమ్మర్ కి పెద్దగా సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాలేదు. దీంతో ఈ సమ్మర్ హాలిడేస్ ని ఏ ఒక్క హీరో కూడా పెద్దగా ఉపయోగించుకోలేకపోయిన విషయం అందరికీ తెలిసిందే.

దీంతో ద్వితీయార్థంలోనైనా టాలీవుడ్ సూపర్ హిట్ లు అందుకుంటుందని క్లీన్ హిట్ దక్కించుకుంటుందని అభిమానులు ఎంతో ఎదురు చూశారు. కానీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అవడం ఓకే అనిపించేలా స్టార్ట్ అయినా.. అనుకున్నంత రేంజ్ లో తెలుగులో హిట్స్ అయితే సొంతం కాలేదని చెప్పాలి. కానీ ఆగస్టు సెకండ్ ఆఫ్ తర్వాత వచ్చిన మూవీస్ లో ఎక్కువ సినిమాలు.. ఆడియన్స్ ని అలరిస్తూ బాక్సాఫీస్ వద్ద మంచి జోరును చూపెట్టి.. హిట్ గీతను దాటుతూ కాస్త బాక్స్ ఆఫీస్ కు ఊరట కలిగించాయని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా ఆగస్టు చివరి వారం నుండి ఇప్పటివరకు వచ్చిన సినిమాలను చూసుకుంటే డబ్బింగ్ మూవీలతో కలిపి ఎన్నో హిట్ సినిమాలు సత్తా చాటుతూ జోరు చూపించాయి.

అందులో ఒక డబ్బింగ్ మూవీ ఆల్మోస్ట్ సెమీ హిట్ రేంజ్ లో పరుగును కంప్లీట్ చేయగా.. మొత్తం మీద సెప్టెంబర్ వరకు చూసుకుంటే ఇప్పటివరకు తెలుగులో 11 సినిమాలు క్లీన్ హిట్స్ సొంతం చేసుకోగా.. 5 డబ్బింగ్ సినిమాలు హిట్ అయ్యాయి. మరో రెండు చిత్రాలు సెమీ హిట్స్ గా నిలిచాయి. ఇక మొత్తానికైతే ఈ ఏడాది తెలుగు సినిమాలు ఇప్పటివరకు ఎన్ని క్లీన్ హిట్ గా నిలిచాయి అనే విషయం ఒకసారి చూద్దాం.

ఈ ఏడాది హిట్ గా నిలిచిన తెలుగు చిత్రాలు..

సంక్రాంతికి వస్తున్నాం -బ్లాక్ బస్టర్

తండేల్ -సూపర్ హిట్

కోర్ట్ - బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్

మ్యాడ్ స్క్వేర్ -బ్లాక్ బస్టర్

హిట్ 3 -హిట్

సింగిల్ -బ్లాక్ బస్టర్

శుభం -హిట్

కుబేర -హిట్

లిటిల్ హార్ట్స్ -సెమీ బ్లాక్ బస్టర్

మిరాయ్ -బ్లాక్ బస్టర్

కిష్కింధపురి - హిట్

ఈ ఏడాది విడుదలై హిట్ అందుకున్న డబ్బింగ్ చిత్రాల విషయానికి వస్తే..

మార్కో -సూపర్ హిట్

ఛావా - ష్యూజ్ బ్లాక్ బస్టర్

రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ - హ్యూజ్ బ్లాక్ బస్టర్

మహావతార నరసింహ - ఎపిక్ బ్లాక్ బస్టర్

కొత్తలోక - డబుల్ బ్లాక్ బస్టర్

ఈ ఏడాది సెమీ హిట్ గా నిలిచిన చిత్రాల విషయానికి వస్తే..

డాకు మహారాజ్ సినిమాతో పాటు డబ్బింగ్ మూవీ కూలీ కూడా సెమీ హిట్ గా నిలిచింది.

ఇకపోతే సెప్టెంబర్ వరకు ఈ సినిమాల పరిస్థితి ఇలా ఉంది. ఇప్పుడు సెప్టెంబర్ నుంచి కొన్ని చిత్రాలు విడుదల కాబోతున్నాయి. మరి రాబోయే సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సత్తా చాటుతాయో చూడాలి.

Tags:    

Similar News