వెయ్యి కోట్లు.. స్టార్ పవర్ సరిపోదా?

"వెయ్యి కోట్లు".. ఇదిప్పుడు ఇండియన్ సినిమాకు కొత్త బెంచ్‌మార్క్. ఈ మ్యాజిక్ నంబర్‌ను టచ్ చేస్తే చాలు, ఆ సినిమా రేంజే వేరు.;

Update: 2025-10-19 06:39 GMT

"వెయ్యి కోట్లు".. ఇదిప్పుడు ఇండియన్ సినిమాకు కొత్త బెంచ్‌మార్క్. ఈ మ్యాజిక్ నంబర్‌ను టచ్ చేస్తే చాలు, ఆ సినిమా రేంజే వేరు. కానీ, ఆ మార్క్‌ను అందుకోవడం అంత ఈజీ కాదని 2025 సంవత్సరం స్పష్టంగా ప్రూవ్ చేసింది. స్టార్ పవర్, భారీ బడ్జెట్, సక్సెస్‌ఫుల్ ఫ్రాంచైజీ.. ఇవేవీ గ్యారెంటీ కాదని ఈ ఏడాది ఫలితాలు తేల్చి చెప్పాయి.

గత మూడేళ్లుగా బాక్సాఫీస్ దగ్గర వెయ్యి కోట్ల వర్షం కురిసింది. 'RRR' నుంచి 'కల్కి' వరకు, ప్రతీ ఏడాది కనీసం రెండు సినిమాలు ఈ ఫీట్‌ను అందుకున్నాయి. దీంతో, ఈ ఏడాది కూడా అదే ట్రెండ్ రిపీట్ అవుతుందని అందరూ భావించారు. ముఖ్యంగా, 'వార్ 2', 'కూలీ' చిత్రాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ, ఆ అంచనాలు తలకిందులయ్యాయి.

అసలు తేడా ఎక్కడ కొట్టింది?

ప్రాబ్లమ్ స్టార్ క్యాస్టింగ్‌లో లేదు, వారిని వాడుకున్న విధానంలో ఉంది. ‘కూలీ’ చిత్రాన్ని చూస్తే, రజినీకాంత్, నాగార్జున, అమీర్ ఖాన్.. ఇలా మూడు ఇండస్ట్రీల లెజెండ్స్ ఉన్నారు. కానీ, కథలో వారి పాత్రలకు సరైన వెయిట్, ఎమోషనల్ కనెక్ట్ లేకుండా పోయింది. కేవలం స్టార్స్ ఉంటే చాలు, ప్రేక్షకులు వచ్చేస్తారని అనుకోవడం పెద్ద పొరపాటు అని ఈ సినిమా నిరూపించింది. సరైన కంటెంట్‌తో వారి ఇమేజ్‌ను వాడుకుని ఉంటే, ఫలితం మరోలా ఉండేది.

ఇక ‘వార్ 2’ విషయానికొస్తే, హృతిక్ లాంటి గ్రీక్ గాడ్, ఎన్టీఆర్ లాంటి డ్యాన్సింగ్ డైనమైట్.. ఈ ఇద్దరి కాంబోకు దేశం మొత్తం ఊగిపోయింది. కనీసం ఒక్క 'నాటు నాటు' లాంటి హై ఓల్టేజ్ డ్యాన్స్ నంబర్ పడినా, సినిమా గ్రాఫ్ ఎక్కడికో వెళ్ళేది. కానీ, రొటీన్ బాలీవుడ్ మసాలా, ఎమోషన్ లేని యాక్షన్ సీక్వెన్స్‌లతో సినిమా బోర్ కొట్టించింది. ఇద్దరు బిగ్ స్టార్స్, నాలుగు ఫైట్లు, కొన్ని సంబంధం లేని ఎలివేషన్లు.. ఈ ఫార్ములా ఇప్పుడు వర్కవుట్ అవ్వదని ఆడియన్స్ క్లారిటీ ఇచ్చేశారు.

ఇప్పటివరకు వెయ్యి కోట్లు కొట్టిన సినిమాలను ఒక్కసారి గమనిస్తే, అన్నింటిలోనూ ఒక కామన్ పాయింట్ కనిపిస్తుంది. అదే.. ఎమోషన్. 'RRR'లో ఇద్దరు హీరోల మధ్య స్నేహం, 'KGF'లో తల్లి సెంటిమెంట్, 'కల్కి'లో చివరలో కర్ణుడి యాక్షన్ ఎపిసోడ్‌లో క్యారెక్టర్ ఎలివేషన్.. ఇవన్నీ ప్రేక్షకుడిని కథలో లీనమయ్యేలా చేశాయి. కేవలం విజువల్ గ్రాండియర్‌తోనో, స్టార్ పవర్‌తోనో వెయ్యి కోట్లు రావు. కథలో ఒక సోల్ ఉండాలి, ఆడియన్ గుండెను టచ్ చేసే ఎమోషన్ కూడా ఉండాలి.

'కూలీ', 'వార్ 2' చిత్రాలు సరిగ్గా ఈ ఎమోషనల్ కనెక్ట్ దగ్గరే ఫెయిల్ అయ్యాయి. ఒక్క బలమైన సీన్ పడినా, ఒక్క హార్ట్ టచింగ్ సన్నివేశం ఉన్నా, ఈ సినిమాల రేంజ్ వేరేలా ఉండేది. బహుశా, 2025లో వెయ్యి కోట్ల సినిమా మిస్ అవ్వడం ఇండస్ట్రీకి ఒక మంచి గుణపాఠమేమో. ఇంకాస్త జాగ్రత్తలు నేర్పిందని చెప్పవచ్చు. ఇక నుంచైనా స్ట్రాంగ్ కథతో క్యారెక్టర్స్ మధ్య పవర్ఫుల్ కనెక్షన్ తో సినిమాలు రావాలి.

Tags:    

Similar News